Saturday 21 May 2016

పెసర పుణుకుల మజ్జిగ పులుసు


               
                                                        పెసర పుణుకుల మజ్జిగ పులుసు

కావలిసిన పదార్థాలు
1. మజ్జిగ అర లీటరు
2. ఆనపకాయ ముక్కలు 1 కప్పు
3. వంకాయలు 2
4. బెండకాయలు 2
5. టమాటో 1
6. పచ్చిమిర్చి 2
7. సెనగపిండి 3స్పూన్స్
8. పసుపు  కొంచెము  ,
9. ధనియాల పొడి  1 స్పూన్
10. కొబ్బరి కోరు 4స్పూన్స్
11. ఉప్పు
12. కొత్తిమీర
13. కరివేపాకు.

పెసర పుణుకులకి :::
1.  పెసర  పప్పు  2 కప్పులు
2. ఉప్పు
3. నూని

తయారీ విధానము.  
ముందుగా పెసర పప్పు  నీళ్ళలో నానబెట్టుకోవాలి .
గంట సేపు నానితే సరిపోతుంది .
మెత్తగా రుబ్బుకోవాలి . తరువాత  తగినంత ఉప్పు కలుపుకోవాలి .

స్టవ్ వెలిగించి బాణలి లో ఆయిల్ పోసుకుని ,కాగాక
రుబ్బుకున్న ఈ పిండిని  చిన్న చిన్న పునుకులలాగా వేసుకోవాలి.

 కూరముక్కలను  ఒక  గిన్నె లో వేసుకుని ముక్కలకు సరిపడే నీళ్ళూ పోసి

స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి
 ముక్కలు ఉడికిన తరువాత బాగాచల్లారనివ్వాలి .

 ఒక గిన్నెలోకి మజ్జిగ తీసుకుని అందులో
పసుపు , ధనియాల పొడి
 ( శనగపప్పు 2స్పూన్స్ ,మినప పప్పు 2 స్పూన్స్ ,ధనియాలు 2 స్పూన్స్
మిరియాలు 2, , ఎండు  మిరపకాయ ఒకటి , వే ఇంచి  గ్రైండ్ చేసిన పొడి ),
కొబ్బరి కోరు , సెనగపిండి , ఉప్పు  వేసి
ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి .
దీంట్లో చల్లారిన కూరముక్కలను వేసి బాగా కలిపి
 స్టవ్ మీద పెట్టి  ఉడికించాలి
మంట సిం లో ఉండేలా చూసుకోవాలి  మధ్య మధ్య లో కలుపుతూ వుండాలి

ఆవాలు జీలకర్ర మెంతులు, ఎండు మిరపకాయ , పచ్చి మిరపకాయ  ,ఇంగువ కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి

వేగిన  పునుకులను పులుసులో వేసి ,
కొత్తిమీరతో గార్నిష్   చేసుకోవాలి
ఘుమఘుమ లాడే మజ్జిగ పులుసు రెడీ.

---Subha's Kitchen