Sunday, 15 May 2016

వంటింటి చిట్కాలు 41-50

           
                                                 
                                                             వంటింటి చిట్కాలు 41-50

1. పెరుగు గిన్నె లో ఒక చిన్న కొబ్బరి ముక్క , లేదా ,చిన్న ఎండు మిరపకాయ,
    లేదా చిన్న విస్తరాకు ముక్క   వేసి ఉంచితే పులవదు,


2. వారానికి ఒకసారి తోటకూర , ములగాకు కూర  పొన్నగంటి కూ ర తినడము కంటికి మంచిది


3. ఇంగువ వేసిన వంటకాలలో వెల్లుల్లి వేస్తే నప్పదు


4. వెల్లుల్లి వేసిన వంటకాలలో ఇంగువ వేస్తె  నప్పదు


5. టమాటాలను  ఉప్పు నీటి లో వేసి ఉంచితే మర్నాడు ఉదయానికి ఫ్రెష్ గా ఉంటాయి


6. కాయ కూరలను పసుపు వేసిన నీటి లో తరిగితే వాటిలోని క్రిములు నశించి నీటి పైన తేలుతాయి


7. వెల్లుల్లిని కొంచెము  నూని రాసి ఎండపెడితే  దాని మీద పొరలును తేలికగా వలువ వచ్చు


8. వెల్లుల్లి ని ఖాలీ ముకుడి లో కాసేపు వేయిస్తే పొరలు తేలిక గా వస్తాయి


9. కూరలలో కొద్దిగా పాలు వేసి ఉడికిస్తే ఆకురలకు విపరీతమైన రుచి వస్తుంది


10. కరివేపాకు ని నీడలో గాలికు ఆర బెట్టి సీసా లో నిలవ చేసుకుంటే పాడవదు

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi