Tuesday, 3 May 2016

. బోర్ " . ఫీలింగ్ తగ్గించు కోవడానికి మార్గము

                                        బోర్ " . ఫీలింగ్ తగ్గించు కోవడానికి  మార్గము

అలసట కంటే మనుషులను ఎక్కువ నీరస పరిచేది"  బోర్ " . ఫీలింగ్ .

ఒక లక్ష్యము లేక పోవడము వలననే ఏర్పడే ఫీలింగ్ ఇది .

బోర్ కొట్టినప్పుడు ఏపని చేయాలనిపించదు చాల అసంతృప్తి గ ,చిరాగ్గా,బద్దకము గా ఉంటుంది

దీన్ని తగ్గించు కోవడానికి  ఒక మార్గము ఉన్నది.:

1. కొత్త విషయాలలో ఆసక్తి చూపించడము

2. కొత్త చాలెంజ్ లు స్వీకరించడ ము

3. కొత్త లక్ష్యాలను ఎర్పరుచుకోవడము

4. నిరాసక్తత బోర్ వైపు తీసుకు వెళుతుంది

 5. కొత్తనీ , నూతనత్వాన్ని స్వీకరించడానికి భయము .

  6. అందులో ఏమి ఆనందము ఉన్నదో తెలుసుకోవడానికి ప్రయత్నము చేయకపోడము

7. చేయవలిసిన పనులు అన్నింటిని రాసుకుని చేసుకుంటూ పొతే అసలు బోర్ కొట్టదు అంటారు

8. కొత్త విషయాలు తెలుసుకోవడము లో ఉన్న "ఆనందనమును "తెలుసుకో గలిగితే అందులో

    ఉన్న సంతృప్తి మరి ఎందులోనూ  ఉండదు

9. మనలో చాలామంది కష్టపడే పని చేస్తాము

10. కొంత మంది చేస్తున్న పనిని ఇష్ట పడి చేస్తారు

11. పనిలో ఆనందమును వెతుకుకుని , "ఇష్టముగా  "కష్టపడి " పని చేసే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు

12. ఇష్టము లేకుండా "ఇక తప్పదు " అని చేసే వాళ్ళు ఏ ఎదుగుదల లేకుండా ఉంటారు

13. ఒక పని చేస్తున్నప్పుడు కలిగేసంత్రుప్తి ఆ పని పూర్తి అయిన తరువాత ఉండదు

14. కాబట్టి నిరంతరమూ కొత్త లక్ష్యాన్ని ఎర్పరుచుకుంటూ వాటిని చేరుకోవడానికి కృషి చేస్తే

      ఎప్పుడు జీవితము ఉస్విగ్న్నముగా ,సంత్రుప్తికరము గా నూ ఉంటుంది .

16. మన జీవితమును తేలిగ్గా తీసుకుంటూ పొతే జీవితము కుడా నిరాసక్తత నే ఇస్తుంది

17. కొత్త కొత్త అనుభవాల ను ఇవ్వడము ప్రారంభిస్తే అది మనకు కొత్త అనుభూతులను ఇస్తుంది

18. ఈ చిన్న విషయము గ్రహిస్తే జీవితములో నిరాసక్తత బోర్ అన్న భావన ఉండదు

కొత్త ను చూసి భయపడకుండా ఆహ్వానిస్తే ఉత్సాహము, ఉత్తేజము రెట్టింపు అవుతాయి