Saturday, 28 May 2016

ఆనపకాయ నువ్వుల పొడి కూర



                                                     ఆనపకాయ నువ్వుల పొడి కూర

కావలిసిన పదార్థాలు

ఆనప కాయ ముక్కలు  3
కప్పులు  కరివేపాకు
పోపు దినుసులు:  1స్పూన్ మినపప్పు  ,
అర స్పూన్ జీలకర్ర ,  అర స్పూన్ ఆవాలు ,
ఎండు మిరపకాయ1,

నువ్వుల పొడికి  : నూపప్పు  6 స్పూన్స్ ,
ఎండుమిరపకాయలు 2 .

 తయారీ విధానము :

ముందుగా ఆనప కాయముక్కలను కుక్కర్ లో ఉడికించు కుని చల్లార బెట్టుకోవాలి .

స్టవ్ వెలిగించి బాణలి పెట్టి,
 నూపప్పు , ఎండు మిరపకాయలను వేసి దోరగా వేపుకోవాలి  .
చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .

స్టవ్ బాణలి పెట్టి 3స్పూన్స్ ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపుదినుసులను వేసి  దోరగా వేగాక ,
కరివేపాకు , ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసి
కలిపి కొంతసేపు  మగ్గనిచ్చి  ,

తరువాతముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసి
కూరంతా కలిసేలా కలుపుకోవాలి  .

తరువాత సరిపడినంత ఉప్పు వేసి
బాగా కలిపి
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
ఆనపకాయ నువూల పొడి కూర రెడీ

Subha's Kitchen