కొత్తిమీర పచ్చడి
కావలిసినపదార్తాలు
1. కొత్తిమీర 1 కట్ట
2. పచ్చి మిరప కాయలు 4
3. ఉప్పు తగినంత
4. పసుపు
5. చింతపండు కొంచెము
6. బెల్లము 1స్పూన్
తయారీ విధానము :
కొత్తిమీర ను మట్టిలేకుండా కడుగుకొని
సన్నగా తరుగుకోవాలి .
తరిగిపెట్టుకున్న కొత్తిమీర , పచ్చి మిరపకాయలు , పసుపు ,
ఉప్పు , చింతపండు , బెల్లం వేసి
బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కొత్తిమీర పచ్చడి రెడీ
దీనిని రవ్వ దోస , మినప దోస లకి బావుంటుంది.
Subha's Kitchen