Tuesday, 24 May 2016

అల్లం పచ్చడి


  అల్లం  పచ్చడి

కావలిసిన పదార్థాలు

1. అల్లం  100 గ్రాములు
2. పచ్చి మిర్ల్చి 6
3. సెనగ పప్పు 3స్పూన్స్
4. మినపప్పు 3 స్పూన్స్
5.  ఆవాలు 1 స్పూన్
6. మెంతులు అర స్పూన్
7. ధనియాలు  1 స్పూన్
8. జీలకర్ర 1 స్పూన్
9. ఎండు మిరపకాయలు 10
10. చింతపండు 50 గ్రాములు
11.  బెల్లం 100 గ్రాములు
12. ఉప్పు
13. పసుపు

తయారీ విధానము

చింత పండు  నీళ్ళలో  నానబెట్టుకోవాలి .
స్టవ్  వెలిగించి బాణలి పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని

సెనగపప్పు ,  మినపప్పు   , ఆవాలు.,   జీలకర్ర  ,
మెంతులు , దనియాలు , ఎండు మిరపకాయలు  ,
వేసి  వేపుకోవాలి .

 ఇవి వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి

 అదే బాణలిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి
 తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు , పచ్చిమిర్చి చీలికలు వేసి దోరగా వేపుకోవాలి  .

ఇవి  రెండు చల్లారాక
ముందుగా

వేపుకున్న పోపు దినుసులను మెత్తగా పొడి లాగ  గ్రైండ్  చఎసుకొవాలి
ఈ పొడిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి

తరువాత వేపుకున్న అల్లం పచ్చిమిర్చి  లను కూడా మెత్తగా గ్రైండ్  చేసుకుని ,

దాంట్లో
నానబెట్టుకున్న చింతపండు ని , ఉప్పుని , బెల్లం మిశ్రమాని వేసి ,
మెత్తగా గ్రైండ్ చేసుకుని తరువాత
ముందుగా గ్రైండ్ చేసిపెట్టుకున్న కారము పొడి ని కూడా వేసి
మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి

దీనిని  ఒక బౌల్ లోకి తీసుకుని
ఆవాలు , జీలకర్ర , ఎండు మిరపకాయ , కరివేపాకు వేసి , ఇంగువ ,
పోపు పెట్టుకుంటే
అల్లం పచ్చడి రెడీ అవుతుంది.

ఇడ్లీ  ,దోశ   , పెసరట్టు ఉప్మా , లలోకి  చాలా  బావుంటుంది .

Subha's Kitchen