Thursday, 5 May 2016

వంటింటి చిట్కాలు 20-30

                               
                 

 వంటింటి చిట్కాలు 20-30


1. ఏ పదార్థము ఐన ఎక్కువ గా ఉడికితే C  విటమిన్ విరిగిపోతుంది 

2. ఉడుకుతున్న కేబేజీ లో ఒక  బ్రెడ్ ముక్క వెస్తే దుర్వాసన పోతుంది 

3. కాలి ఫ్లవర్ కూరలో కాసిని పాలు పోసి ఉడికిస్తే కుర తెల్ల గానూ రుచి గాను ఉంటుంది 

4. వేపుడు కుర్ల ను దింపే ముందు కొంచెం చెనగ పిండి జల్లితే ముక్కలు విడివిడి గా క్రిస్పి గా వస్తాయి 

5. అప్పడాలు కాల్చే ముందు వాటికీ రెండు ప్రక్కలా నెయ్యి రాస్తే నూని లో వేయించిన
    అప్పడాలులా ఉంటాయి 

6. ఏవైనా పచ్చి పదార్ధాలు తింటే కొంచెం బెల్లము ముక్క తినాలి 

7. జామ తినగానే కాస్త ఉప్పు, జీలకర్ర చప్పరించాలి 

8. ఖర్జూరాలు తింటే వెంటనే వేడి నీళ్ళు తాగాలి 

9. పులుసు లో కాస్త వరిపిండి వేయక పొతే అది పుల్ల నీళ్ళు లా తయారు అవుతుంది 

10. దోశల కోసం పిండి రుబ్బే టప్పుడు , కాసిని మెంతులు వేస్తె దోశలు సువాసన భరితము గానూ 

       మరియు  మెత్తగాను ఉంటాయి

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi