Monday 2 May 2016

తెల్ల " వంకాయ పచ్చడి "


                                                 
                                                                

తెల్ల " వంకాయ పచ్చడి "
కావలసిన పదార్థాలు

1.   తెల్ల వంకాయలు  పెద్దవి 3  
2. పచ్చి మిరపకాయలు  3  
3. మినపప్పు  1స్పూన్  
4. ఆవాలు అర స్పూన్ 
5.  జీలకర్ర అర స్పూన్  
6. ఎండు   మిరపకాయలు  1, 
7. కొత్తిమీర  

తయారీ విధానము :
  తెల్ల వంకాయలు  పెద్దవి తీసుకుని  స్టవ్  మీద
 సన్నని  సెగ  ఫై  కాల్చుకోవాలి  . 
కాల్చిన వంకాయలు చల్లారిన  తరువాత  ,
ఫైన  తొక్క తీసి  మెత్తగా గుజ్జులా  చేసుకోవాలి . 
స్టవ్ ఫై బాణలి  పెట్టి  పోపు కి సరిపడినంతగా  ఆయిల్ వేసుకుని  , 
మినపప్పు , ఆవాలు , జీలకర్రా ,  ఎందు మిర్చి , 
వేసి దోరగా వేయించుకోవాలి   . 
వేయించుకున్న  పోపు , మరియు 
పచ్చి మిర్చి చీలికలు ,
మెత్తగా చేసి పెట్టుకున్న వంకాయ గుజ్జు లో వేసి ,
ఉప్పు కూడా  వేసుకుని కలుపుకోవాలి . 
పైన కొత్తిమీర వేసి కలుపుకుంటే ఘుమఘుమ లాడే 
వంకాయ పచ్చడి రెడీ
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi