వరాహ స్వామి ఆలయం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రధానాలయానికి ఉత్తరాన, స్వామి పుష్కరిణి ఒడ్డున శ్రీ వరాహ స్వామి ఆలయం వున్నది.
పురాణాల ప్రకారం
తిరుమల ఆది వరాహ క్షేత్రమని, వరాహ స్వామి వారి అనుమతితో శ్రీవేంకటేశ్వర స్వామి ఇచ్చట కొలువు దీరారని చెప్పబడుతోంది.
బ్రహ్మ పురాణం ప్రకారం, తిరుమలకి వచ్చిన భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించి,నైవేద్యము సమర్పించిన తరువాత శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పబడినది.
అత్రి సంహిత ప్రకారం, వరాహావతారాన్ని మూడు రూపాల్లో కొలుస్తారు. –
ఆది వరాహ –
ప్రళయ వరాహ –
యజ్ఞ్న వరాహ
వైఖానస ఆగమం ప్రకారం, తిరుమలలోని వరాహ స్వామి ఆలయంలో వున్న మూర్తి ఆదివరాహ మూర్తిగా చెప్పబడుతోంది.
బేడి ఆంజనేయస్వామి ఆలయం:
బేడి ఆంజనేయస్వామి ఆలయం తిరుమల సన్నిధి వీధిలో , శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రధానాలయ మహా ద్వారమునకు ఎదురుగా వున్నది.
శ్రీ వేంకటేశ్వర స్వామికి, శ్రీ వరాహ స్వామికి ప్రతిసారి నైవేద్యము సమర్పించిన తరువాత, ఆ ప్రసాదమును ఈ ఆలయం వద్దకు కూడా తీసుకు వస్తారు.
ప్రతి ఆదివారము ఈ ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకము నిర్వహిస్తారు.