బొబ్బట్లు
కావలిసిన పదార్థాలు
1. సెనగ పప్పు 250 గ్రాములు
2. బెల్లం 250 గ్రాములు
3. ఇలాచి పొడి కొద్దిగా
4. మైదా పిండి 250 గ్రాములు
5. ఆయిల్
తయారీ విధానము :
ముందుగా సెనగ పప్పు ను ఉడక బెట్టుకుని బాగా చల్లారనివ్వాలి .
మైదా పిండి ని కొద్దిగా ఉప్పు వేసుకుని నీళ్ళూ పోసుకుని పూరి పిండి మాదిరిగా కలుపుకుని,
ఆ పిండి పైన ఆయిల్ వేసుకుని బాగా మర్దిమ్చాలి.
ఈ పిండి ని బాగా నాననివ్వాలి.
ఎంత ఎక్కువ సేపు నానితే బొబ్బట్లు అంత బాగా మెత్తగా వస్తాయి.
చల్లారిన పప్పు ని మెత్త గారుబ్బుకుని ,
మెత్తని బెల్లము పొడి ,
ఇలాచీ పొడి ,
వేసుకుని బాగా కలుపుకోవాలి
ఈ మిశ్రమాన్ని కావలిసిన. సైజు లో ఉండలుగా చేసుకోవాలి
అరచేతికి ఆయిల్ రాసుకుని ,
నానిన మైదాపిండి ని కొద్దిగా తీసుకుని,
పూరీ లా చేసుకుని ,
దాంట్లో ముందుగా చేసి పెట్టుకున్న సెనగపప్పు పూర్ణాన్ని పెట్టుకుని ఉండ లా చేసుకుని
అరిటాకు గాని ప్లాస్టిక్ కవర్ గాని తీసుకుని
దాని మీద ఆయిల్ రాసుకుని
ఈ ఉండ ను పెట్టి చేతి తో వత్తుకోవాలి
స్టవ్ మీద పెనం పెట్టి కాల్చుకోవాలి
స్టవ్ మంట మీడియం లో ఉండేలా చూసుకోవాలి
ఘుమ ఘుమ లాడే బొబ్బట్లు రెడీ.
పాలల్లో వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటాయి.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.