గుత్తి వంకాయ గ్రేవీ కూర
కావలిసిన పదార్థాలు
1. గుత్తి వంకాయలు పావు కేజి
2. ఉల్లిపాయలు 2
3. నూపప్పు 3 స్పూన్స్
4. కొబ్బరికోరు చిన్న కప్పు
5. పల్లీలు 3స్పూన్స్
6. ఎండు మిరపకాయలు 5
7. ఉప్పు
8. పసుపు
తయారీవిధానము
ముందుగా స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టుకుని పైన చెప్పిన
నూపప్పు , పల్లీలు , ఎండు మిరపకాయలను , వేసి దోరగా వేపుకోవాలి
అవి చల్లారాక కొబ్బరి కోరు కుడా కలుపుకుని మెత్తగా ముద్దలాగ రుబ్బుకోవాలి
ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి
వంకాయ లు గుత్తులు గా తరుగు కోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి దోరగా వేగాక
వంకాయ గుత్తులు పసుపు
సరిపడినంత ఉప్పు వేసుకుని మగ్గనివ్వాలి
రుబ్బి పెట్టుకున్న ముద్దను వేసి కొంచెము నీళ్ళు పోసుకుని
బాగా దగ్గర పడేమ్తవరకు వుడకనివ్వాలి
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
ఘుమ ఘుమలాడే గుత్తివంకాయ గ్రేవీ కూర రెడీ.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi