Monday, 23 May 2016

గుత్తి వంకాయ మసాలా కర్రీ


గుత్తి వంకాయ మసాలా కర్రీ

కావలిసిన పదార్థాలు

1. గుత్తి వంకాయలు  పావు కేజీ
2  టొమాటోలు 3
3 కొబ్బరి కోరు 1కప్పు
4. అల్లం వెల్లుల్లి పేస్టు 1స్పూన్
5. లవంగాలు 2
6. గసగసాలు పావు స్పూన్
7. జీడిపప్పు పలుకులు 10
8.  ఉల్లిపాయలు 2
9. కారము 2స్పూన్స్
10. చింత పండు  నీళ్ళలో వేసి పిసికిన రసం  1  కప్పు

తయారీ  విధానము
ముందుగా స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి
 అల్లంవెల్లుల్లి పేస్టు ,  ఉల్లిపాయముక్కలు,   టమాటో ముక్కలు   కొబ్బరికోరు  ,
లవంగాలు ,  గసగసాలు ,  జీడిపప్పుపలుకులు,   కారము వేసి
బాగా దోరగా మగ్గనివ్వాలి  .
ఇది చల్లారాక  సరిపడినంత ఉప్పు వేసి
మెత్తగా రుబ్బుకోవాలి
వంకాయలను  గుత్తులుగా తరుగుకుని  స్టౌ మీద బాణలి పెట్టి వేడెక్కాక 4 స్పూన్స్ ఆయిల్ వేసి
వంకాయలు వేసి ,  కొద్దిగా పసుపు వేసుకుని కొతసేపు, వేగనిచ్చి ,
(వేగుతున్నప్పుడు గరిట తో కాకుండా పేన్ కుదిపి తే వంకాయ  ముక్కలు విడకుండా కాయలాగే ఉంటుది )
.తరువత మూత పెట్టి  మగ్గనివ్వాలిమగ్గాక ,
పైన చెప్పిన మసాలా ముద్దను , వంకాయల  పైన వేసుకుని కలుపుకుని కొంత సేపు
మగ్గనిచ్చి , తరువాత
 చింతపండు రసాన్ని వేసి బాగా  మగ్గ నివ్వాలి
 బాగా దగ్గర పడేమ్తవరకు మగ్గనిచ్చి
పైన జీడిపప్పు కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
ఘుమ ఘుమ లాడే గుత్తి వంకాయ మసాల కర్రీ రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi