Friday, 6 May 2016

వంటింటి చిట్కాలు 31-40

                                             
                                                    వంటింటి చిట్కాలు 31-40

1. అన్నము తెల్లగా ఉండా లంటే బియ్యము కడిగే టప్పుడు అందులో కొద్దిగా నిమ్మ రసము పిండాలి

2. గుండ్రము గా లావుగా వుండే చేమ దుంపలు దురద ఉండదు

3. బత్తాయి ,కమలాలు వంటివి టిస్యు పేపర్  లో చుట్టి ఫ్రిడ్జ్ లో ఉంచితే ఎక్కువ కాలము నిలవ ఉంటాయి

4. కాగిన పాల మీద చిల్లుల పళ్ళెము మూత పెడితే మీగడ చక్కగా పేరుకుంటుంది

5. దోశల పిండి రుబ్బే టప్పుడు ఒక కప్పు సగ్గు బియ్యము వేసి రుబ్బితే అట్లు విరగ కుండా పల్చగా వస్తాయి

6. సేమ్యా ని ఉడికించే  టప్పుడు 2,3 చుక్కల నిమ్మ రసము పిండితే అంటుకుని ముద్దలా మారవు

7. కాకరకాయ ముక్కలను బియ్యము కడుగు నీళ్ళలో ఒక గంట ఉంచితే చేదు తగ్గుతుంది

8. రుచికి పచ్చి మిరపకాయలు శ్రేష్టము

9. ఆరోగ్యానికి ఎండు మిరపకాయలు శ్రేష్టము

10. డైనింగ్ టేబుల్ మధ్యలో పుదినా ఆకులు ఉంచితే ఆ వాసనకు ఈగలు,దోమలు చేరవు

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi