Tuesday 17 May 2016

వంటింటి చిట్కాలు 61-70

                                               
                                                                


                                                          వంటింటి చిట్కాలు 61-70


1. ధనియాల పొడి ,సాంబారు పొడి,చారు పొడి, మొదలు మసాలా దినుసులలో కాస్త ఇంగువ ముక్క
    వేసి ఉంచితే ఎక్కువ రోజులు పాడవ   కుండా నిలువ ఉంటాయి .
2. బొబ్బట్ల పిండి లో ఒక చెంచాడు గోధుమ రవ్వ కలిపితే బొబ్బట్లు చిరిగి పోకుండా ఉంటాయి .
3. మిల్లు లో పట్టించిన ఏ పిండి నైనా పేపర్లలో బాగా ఆరబెట్టి బాగా ఆరిన తరువాతే డబ్బా లో
    వేసి ఉంచాలి .
4. మినపట్లు గాని దోశ లు గాని వేసేటప్పుడు ముందుగా పెనాన్ని వంకాయ ముచ్చిక తో గానీ వంకాయ
    ముక్క తో గానీ రుద్దితే మినపట్లు  పెనానికి అంటుకోకుండా వస్తాయి .
5. బెండకాయ కూర జిగురు పోవాలంటే అరగంట ముందే కడిగి  ఆర బెట్టాలి .
6. నూనె లో కొంచెము ఉప్పు కలిపితే గారెలు మోదిలైన  వంటకాలు ఎక్కువ నూనె పీల్చవు  .
7. గంజిలో ఉండే  విటమిన్లు కూడా మనం శరీరానికి అవసరమే దానిలో తగినంత ఉప్పు ,పంచదార   కలిపి త్రాగాలి .వడ  దెబ్బ తగలదు .
8. పాత్రలకు అడుగు భాగాన వరిపిండి ,ఉప్పు కలిపి రాస్తే సులువు గా  తోముకోవచ్చు .
9. నిమ్మ రసం క్రింద ఒలికి గచ్చు తెల్లగా అయితే దాని మీద దోస ముక్క తో గాని గుమ్మడి ముక్క తో
  గాని  రుద్దితే  తెలుపు పోతుంది .
10. ఎండా కాలంలో పాలు విరిగిపోకుండా ఉండాలంటే దానిలో  2, 3 వడ్ల గింజలు వెయ్యాలి .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi