రుచిలో////పోషకాల్లోఘనమైన బెండకాయ
1. బెండకాయ జిగురులోని పాలీశాక్రైడ్లు జీర్ణక్రియ మెరుగుపడటానికి తోడ్పడతాయి. పేగుల కదలికలు సాఫీగా సాగేందుకూ దోహదం చేస్తాయి.
2. బెండకాయలో పీచుతో పాటు విటమిన్ సి, ఫోలేట్ వంటి పోషకాలు కూడా దండిగా ఉంటాయి.
3. ఒక కప్పు (100 గ్రాములు) బెండకాయ ముక్కల్లో.. 2.5 గ్రాముల పీచు, 16.3 మిల్రీగ్రాముల విటమిన్ సి, 46 మైక్రోగ్రాముల ఫోలేట్, 283 ఐయూల విటమిన్ ఏ, 40 మైక్రోగ్రాముల విటమిన్ కె ఉంటాయి. ఇంకా నియాసిన్, థైమిన్, విటమిన్ బీ6, మెగ్నీషియం, మాంగనీస్, బీటా కెరటిన్ వంటి పోషకాలూ లభిస్తాయి.
4. బెండకాయలో నీటిలో కరిగే రకానికి చెందిన పెక్టిన్ అనే పీచు ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గటానికి తోడ్పడుతుంది. ఫలితంగా గుండెజబ్బులనూ దూరంగా ఉంచుతుందన్నమాట.
5. బరువు తగ్గాలని అనుకునేవారు తరచుగా బెండకాయలను తినటం మంచిది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువ. 100 గ్రాముల బెండకాయల్లో 33 కేలరీలు మాత్రమే ఉంటాయి.
6. ఇక ఇందులోని పీచు చిన్నపేగుల్లోంచి రక్తం లోకి గ్లూకోజు త్వరగా చేరకుండా నియంత్రి స్తుంది. ఇలా రక్తంలో గ్లూకోజు మోతాదులు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడతాయి.
7. దీనిలోని విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంపొందించి జబ్బుల బారినపడకుండా కాపాడుతుంది.
8. అలాగే పీచు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడుతుంది.
9. ఈ బ్యాక్టీరియా కూడా రోగనిరోధక వ్యవస్థ పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది.
10. బెండకాయ గర్భిణులకూ మేలు చేస్తుంది. దీనిలోని ఫోలేట్ పుట్టబోయే పిల్లల్లో వెన్ను లోపాలు తలెత్తుకుండా కాపాడుతుంది. ఫోలేట్ మెదడు పనితీరునూ మెరుగు పరుస్తుంది. యాంటీఆక్సిడెంట్లు విశృంఖల కణాల దుష్ప్రభావాల బారిన పడకుండా చూస్తాయి.
11. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయి. బెండకాయలో నీటిలో కరగని పీచు కూడా కొద్దిమొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణకోశ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలాశయ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది.
కావలసిన పదార్ధాలు–
బెండకాయలు – 1/2 కిలో
పచ్చిమిర్చ్చి–— 4
5 కరివేపాకు — 2 రెమ్మలు
పల్లీలు (వేరు శనగ పలుకులు) —
శనగ పిండి– 2 చెంచాలు
నూనె — 2 చెంచాాలు
ఉప్పు– తగినంత
విధానం
కడిగిన బెండకాయలను చిన్న ముక్కలుగా తరిగి ,
పేపర్ పైన అరగంట సేపు ఆరబెట్టు కోవాలి.
తరువాత, స్టవ్ వెలిగించుకుని ,
మూకుడు పెట్టి, రెండు చెంచాల నూనె వేసుకోవాలి.
నూనె వేడెక్కాక
కరివేపాకు, పచ్చి మిర్చి,
పల్లీలు,
బెండకాయ ముక్కలు ,
వేసి బాగా వేయించాలి. తరువాత ,
ఉప్పు వేసి బాగా కలిపి రెండు నిముషాల తరువాత ,
శనగ పిండి
వేసి బాగా కలిపి , కూరను మైక్రో వేవ్ ఓవెన్ లో ఒక్కనిముషం వుంచి తీసుకోవాలి.
ఎంతో రుచికరముగా, కరకరలాడుతూ వుండే “బెండకాయ పల్లి ఫ్రై” రెడీ.
Subha's Kitchen