Friday, 27 May 2016

అరటి కాయ ఆవముద్ద కూర



                                                           అరటి కాయ ఆవముద్ద కూర

కావలిసిన పదార్థాలు

1అరటి కాయలు 3
2. ఉల్లిపాయలు 2
3. పచ్చి మిరప కాయలు 3
4.  అల్లం చిన్న ముక్క
5. కరివేపాకు

పోపు  దినుసులు :
మినపప్పు 1 స్పూన్ , సెనగ పప్పు 1 స్పూన్  ,
ఆవాలు అర స్పూన్ , జీల కర్ర అరస్పూన్ ,
ఎండు మిరపకాయలు 2  , ఆవ ముద్ద 1 స్పూన్

తయారీ విధానము
 అరటి కాయలు  తొక్క తీసి కుక్కర్ లో  పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి  .
స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని
 మినపప్పు , సెనగపప్పు , ఆవాలు,  జీల కర్ర,  ఎండు మిరపకాయలను,
 వేసి అవి దోరగా వేగాక
తరిగి పెట్టుకున్న ఉల్లి పాయ ముక్కలు , పచ్చిమిర్చి చీలిక లు , కరివేపాకులను
వేసి అవి వేగాక
ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసి ,
కొంతసేపు మగ్గనిచ్చి ,
వాటి పైన పసుపు ,సరిపడినంత ఉప్పు వేసి ,
మెత్తగా కుమ్ముకోవాలి .
ఇది చల్లారాక
ఆవముద్ద వేసి కలుపుకుంటే
 అరటి కాయ ఆవముద్ద కూర రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadev