Tuesday, 31 May 2016

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము “అంతర్వేది “. ( అన్నా చెల్లెళ్ళ గట్టు )



                                                             
                                                   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము
                                                                    “అంతర్వేది “.
                                                               

అంతర్వేది నృసిం హాగ్రా రత్నలోచనాసక
ఉత్తిష్ట  కమలాకాంతా భక్తాభీష్ట ప్రపూరయా
అశ్వరూఢామ్బికావ్యాప్త జీహ్వరుద్దరి ఉద్గమా
లక్ష్మీ నృసింహ భగవాన్ సుప్రభాతమరిన్దమాన్”

నవ నృసింహ క్షేత్రాలలో  అగ్రగణ్య మైనదిగా  ప్రభవిల్లుతున్న క్షేత్రం “అంతర్వేది “.  ఇది పరమ పుణ్య  ప్రధమ  క్షేత్రం.  సాగర సంగమ ప్రదేశములో  విరాజిల్లుతున్న ఈ ప్రముఖ దేవాలయము, తూర్పు గోదావరి జిల్లాలోని సఖి నేటిపల్లి మండలం, అంతర్వేది గ్రామంలో వున్నది. పౌరాణికముగా, చారిత్రికముగా ఎంతో ప్రాశస్త్యం వున్న ఈ దివ్య క్షేత్రంలో కొలువై వున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం సకల శుభప్రదం.పవిత్ర గోదావరీ తీరాన వెలసిన ఈ పుణ్య క్షేత్రం  , పర్యాటక కేంద్రంగా కూడా ఎంతో  ప్రసిద్ధి చెందినది…

" కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి , విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై ,కూనలమ్మ కునుకై ,అది కూచిపూడి నడకై , పచ్చని చేల పావడ కట్టి ,
కొండమల్లెలే కొప్పున బెట్టి,వచ్చే దొరసాని మా వెన్నెల కిన్నెరసాని…"

అంటూ ఎందరో కవులు చల్లని గోదావరి తల్లి గురించి ఎన్నో వర్ణనలు చేసారు…ఇక్కడ గోదావరి నదికి ఇరు ప్రక్కలా  కొబ్బరి చెట్లు, పచ్చటి పొలాలు, లంకలు కనువిందు చెస్తూ ఉంటే, ఎదురుగా అనంతముగా వ్యాపించి వున్న సముద్రము ఆహ్లాదాన్ని  కలిగిస్తుంది. ఉరకలు, పరవళ్లతో పరుగులు తీసేగోదావరి, సముద్రములో కలిసే దృశ్యము ను చూసి తీరవలసినదే.  అంతర వాహినిలా నది, కడలిలో కలిసే వైనము, ఒక అద్భుత సుందర దృశ్యకావ్యము.  పౌర్ణమి నాటి వెన్నెలలో, వెండి వెలుగులలో  మెరిసిపోతూ ఆ సుందర మనోహర  దృశ్యము కన్నుల పండుగలా ఉంటుంది. మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ, వశిష్ఠ గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.

అంతర్వేది త్రికోణాకారపు (లంక) దీవిలో  వుంది. అన్నా చెల్లెల గట్టుగా పిలువ బడే ఈ  ప్రాంతములో, ప్రశాంత మైన వాతావరణములో, భూతల స్వర్గమును తలపింప చేసే శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయము, సుప్రసిద్ధ  పుణ్య క్షేత్రముగా  భాసిల్లుతున్నది.
స్థలపురాణం:
ఒకసారి బ్రహ్మ, రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్టమహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది
రక్తావలోచనుని కథ:
హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరం కోరుతాడు. రక్తావలోచనుని శరీరం నుంచి   పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువుల మీద పడితే ఆ ఇసుకరేణువుల నుంచి బలవంతులైన
రక్తావలోచనులు ఉద్భవించాలనే వరం  పొందుతాడు. ఆ వర గర్వంతో యఙ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి, వశిష్టుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు విశ్వామిత్రుని ఆఙ్ఞపై వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు పుత్రులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్ధించగా విష్ణుమూర్తి లక్ష్మీసమేతుడై నరహరి అవతారంతో రక్తలోచనుడుని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. నరశింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తినుపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా చేస్తాడు. అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశారు. ఈ రక్తకుల్య లోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రవరచుకున్నారని పురాణ కధనము. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తేసర్వపాపాలు హరిస్తాయని చెబుతారు.
హిరణ్యకశిపుని సంహరించిన స్వామి అనంతరం తన శరీరాన్ని అంతరిక్షంలోకి విసిరేసినపుడు అది ఈ ప్రాంతంలో పడిందని అందుకే అంతర్వేది అని పేరు వచ్చిందని కూడా అంటూ వుంటారు.
శ్రీ రాముడు సీతా సమేతుడై లక్ష్మణ, హనుమంతులతో కూడి   వశిష్ఠాశ్రమాన్ని, శ్రీ లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి, సేవించినట్లు అక్కడే కొన్ని రోజులు నివసించినట్లు అక్కడి శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. అర్జునుడు తీర్ధయాత్రలు చేస్తూ ‘అంతర్వేది’ దర్శించినట్లు చేమకూర వెంకటకవి తన ‘విజయయ విలాసము’లోను,  శ్రీనాధ కవిసార్వభౌముడు ‘హరివిలాసం’లోను వర్ణించారు.
ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం క్రీ.శ. 300 ఏళ్ళకు పూర్వం నిర్మంపబడిందని తెలుస్తోంది. పల్లవులచే నిర్మితమైన తొలి ఆలయం నాశనమైపోగా మళ్ళీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది.
వశిష్ఠాశ్రమం:
సముద్రతీరాన ఆలయానికి దగ్గరలో వశిష్ఠాశ్రమం వుంది. ఈ ఆశ్రమం కమలం ఆకారంలో నాలుగు అంతస్థులుగా నిర్మించారు. చూట్టూ సరోవరం మధ్య కమలం ఆకారంలో వుంది ఈ కట్టడం. దగ్గరలో ధ్యానమందిరం, యోగశాల మొదలైనవి వున్నాయి. వశిష్ఠాశ్రమం కూడా మనము తప్పక దర్శించవలసినది.
అన్నాచెల్లెళ్ళగట్టు: 
సముద్రంలో వశిష్ఠ గోదావరి నది కలిసేచోటును అన్నాచెల్లెళ్ళ గట్టు అంటారు. ఇక్కడు సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మేట వేసి వుంటుంది. దానికి అటు వైపు ఇటువైపు నీరు వేరు వేరు రంగులలో, ఒకవైపు స్వచ్ఛంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్రం ఆటుపోట్లలలో కూడా ఇలాగే వుంటుంది.
అశ్వరూఢామ్బిక ఆలయం (గుర్రాలక్క):
లక్ష్మీ నృశింహస్వామి ఆలయానికి దగ్గరలో అశ్వరూఢామ్బి కాలయం ఉంది. నరసింహస్వామికి రక్తావలోచనుడికి జరిగిన యుద్ధంలో రక్తావలోచనుడి రక్తం భూమి మీద పడకుండా నరసింహుడు పార్వతి అంశతో మాయాశక్తిని సృష్టిస్తాడు. ఈ మాయాశక్తి అశ్వరూపంలో రక్తావలోచనుడి నుంచి పడిన రక్తాన్ని పిల్చేస్తూ అతని మరణానికి కారణమౌతుంది. అనంతరం ఈ మాయాశక్తి అశ్వరూఢామ్బికగా వెలిసింది అని పురాణ కధనము.
ప్రతి ఏటా మాఘమాసం శుద్ధ సప్తమి నుంచి బపుళ పాడ్యమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మాఘ శుద్ధ దశమి నాడు స్వామివారి కళ్యాణం, ఏకాదశినాడు స్వామివారి రధోత్సవం జరుగుతాయి. వైశాఖమాసంలో శుద్ధ చతుర్దశినాడు శ్రీ లక్ష్మీనృసింహ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. సంతానం లేని వారు స్వామివారిని దర్శిస్తే తమ కోరిక తీరుతుందని నమ్మకం. ఇక్కడ వుండి, రాత్రి తడి బట్టలతో నిద్రిస్తారు. నిద్రలో పళ్ళు, చిన్నపిల్లల బొమ్మలు కలలో  కనిపిస్తేసంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసము.


                  పర్యాటక , ఆధ్యాత్మిక అంతర్వేదిక అయినఅంతర్వేదిని  దర్శించండి, సర్వ శుభాలు  పొందండి…
                              ఓం ప్రహ్లాద వరద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమః

Monday, 30 May 2016

నిమ్మకాయ ఉరగాయ


నిమ్మకాయ ఊరగాయ 
కావలిసిన పదార్థములు
1. నిమ్మ కాయలు 6
2. ఆవాలు  2 స్పూన్స్
3. మెంతులు  2 స్పూన్స్
4. నూని  గ్రాములు
5. ఇంగువ
6. కారము  2  కప్స్
7 ఉప్పు
   
తయారీ విధానము :
ముందుగా  స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టి
మెంతులు  ఆవాలు నూనె లేకుండా పొడిగా  వేపుకుని
చల్లారాక మెత్తగా పోడిలా గ్రైండ్  చేసుకోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ పోసుకుని
కొంచెము ఇంగువ  వేసుకుని  ఆయిల్ ని  వేడి చేసుకోవాలి
వేడి చేసుకున్న ఈ ఆయిల్ లో
పైన చెప్పిన కారము , మెత్తగా చేసిపెట్టుకున్న  మెంతి ఆవ పొడిని  ,
తగినంత ఉప్పుని వేసి
అంతా బాగా కలిసేలా చేసుకున్న తరువాత
తరిగి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలను
వేసి కలుపుకుంటే
నిమ్మ కాయ ఊరగాయ రెడీ
Subha'skitchen

నిత్యమూ చదవ వలిసిన శ్లోకాలు

                                          నిత్యమూ  చదవ వలిసిన  శ్లోకాలు

21.లక్ష్మీ శ్లోకం :
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ !
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ !
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ !
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ !!

22. వెంకటేశ్వర శ్లోకం :
శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేఁర్థినామ్ !
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ !!

23. దేవీ శ్లోకమ్ :
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే !
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే !!

24 దక్షినామూర్తి శ్లోకం :
గురువే సర్వలోకానాం భిషజే భివరోగినామ్ !
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: !!

25. అపరాధ క్షమాపణ స్తోత్రం :
అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !
దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!

26. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!

27 కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి !!

28. బౌద్ధ ప్రార్థన :
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి

29. శాంతి మంత్రం :
అసతోమా సద్దమయా !
తమసోమా జ్యోతిర్గమయా !
మృత్యోర్మా అమృతంగమయా !
ఓం శాంతి: శాంతి: శాంతి:

30. సర్వే భవంత సుఖిన: సర్వే సంతు నిరామయా: !
సర్వే భ్రదాణి పశ్యంతు మా కశ్చిద్దు:ఖ భాగ్భవేత్ !!

31. ఓం సహ నా’వవతు ! స నౌ’ భునక్తు ! సహవీర్యం’ కరవావహై !
తేజస్వినావధీ’ తమస్తు మా వి’ద్విషావహై !!
ఓం శాంతి: శాంతి: శాంతి: !!

32. విశేష మంత్రా:
పంచాక్షరి - ఓం నమశ్శివాయ
అష్టాక్షరి - ఓం నమో నారాయణాయ
ద్వాదశాక్షరి - ఓం నమో భగవతే వాసుదేవాయ

నిత్యమూ చదవ వలిసిన శ్లోకాలు


                                    నిత్యమూ  చదవ వలిసిన  శ్లోకాలు
11. నిద్రా శ్లోకం :
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !
శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !!

12. కార్య ప్రారంభ శ్లోకం :
వక్రుతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ: !
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా !!

13. గాయత్రి మంత్రం :
ఓం భూర్భువస్సువ: ! తథ్స’వితుర్వరే’ణ్యం !
భర్గో దేవస్య’ ధీమహి ! థియో యోన: ప్రచోదయా’’త్ !!

14. హనుమ స్తోత్రం :
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి !!

15. బుద్ధిర్భలం యశొధైర్యం నిర్భయత్వ - మరోగతా !
అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ - స్మరణాద్ - భవేత్ !!

16. శ్రీరామ స్తోత్రం :
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

17. గణేశ స్తోత్రం :
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!
అగజానన పద్మార్కం గజానన మహర్ణిశమ్ !
అనేకదంతం భక్తానా - మేకదంత - ముపాస్మహే !!

18. శివ స్తోత్రం :
త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధినమ్ !
ఉర్వారుకమి’ వ బంధ’ నాన్ - మృత్యో’ర్ - ముక్షీయమాఁ మృతా’’త్ !!

19. గురు శ్లోకం :
గురుబ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: !
గురు: సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: !!

20. సరస్వతీ శ్లోకం :
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ !
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా !!

యు కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా !
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా !!
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ - దేవై: సదా పూజితా !
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా !!

నిత్యమూ చదువుకోవలిసిన శ్లోకాలు


                                                   నిత్యమూ చదువుకోవలిసిన శ్లోకాలు

1. ప్రభాత శ్లోకం :ప్రభాత శ్లోకం :
కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ !
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !!

ప్రభాత భూమి శ్లోకం :
సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే !
విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే !!

సూర్యోదయ శ్లోకం :
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ !
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ !!

స్నాన శ్లోకం :
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ !
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !!

భస్మ ధారణ శ్లోకం :
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !!

భోజనపూర్వ శ్లోకం :
బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ !
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !!

అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: !
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !!

త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే !
గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!

భోజనానంతర శ్లోకం :
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ !
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ !!

సంధ్యా దీప దర్శన శ్లోకం :
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ !
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఁస్తుతే !!

Saturday, 28 May 2016

ఆనపకాయ నువ్వుల పొడి కూర



                                                     ఆనపకాయ నువ్వుల పొడి కూర

కావలిసిన పదార్థాలు

ఆనప కాయ ముక్కలు  3
కప్పులు  కరివేపాకు
పోపు దినుసులు:  1స్పూన్ మినపప్పు  ,
అర స్పూన్ జీలకర్ర ,  అర స్పూన్ ఆవాలు ,
ఎండు మిరపకాయ1,

నువ్వుల పొడికి  : నూపప్పు  6 స్పూన్స్ ,
ఎండుమిరపకాయలు 2 .

 తయారీ విధానము :

ముందుగా ఆనప కాయముక్కలను కుక్కర్ లో ఉడికించు కుని చల్లార బెట్టుకోవాలి .

స్టవ్ వెలిగించి బాణలి పెట్టి,
 నూపప్పు , ఎండు మిరపకాయలను వేసి దోరగా వేపుకోవాలి  .
చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .

స్టవ్ బాణలి పెట్టి 3స్పూన్స్ ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపుదినుసులను వేసి  దోరగా వేగాక ,
కరివేపాకు , ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసి
కలిపి కొంతసేపు  మగ్గనిచ్చి  ,

తరువాతముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసి
కూరంతా కలిసేలా కలుపుకోవాలి  .

తరువాత సరిపడినంత ఉప్పు వేసి
బాగా కలిపి
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
ఆనపకాయ నువూల పొడి కూర రెడీ

Subha's Kitchen

మాగాయ పెరుగు పచ్చడి



                                                              మాగాయ పెరుగు పచ్చడి

 కావలిసిన పదార్థాలు :

1. మాగాయ 2కప్పులు
2. ఉల్లిపాయలు 3
3. పచ్చిమిరపకాయలు 2
4. మినపప్పు 1స్పూన్
5. ఆవాలు అర స్పూన్
6. జీలకర్ర అరస్పూన్
7. ఇంగువ కొంచెం
8. షుగర్ 3 స్పూన్స్
9.  పెరుగు 1 కుప్పు
10. కరివేపాకు
11. కొత్తిమీర

తయారీ విధానము

మాగాయను  ఒక బౌల్ లోకి తీసుకుని ,
దానికి పెరుగు షుగర్ వేసి బాగా కలుపుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 3స్పూన్స్ ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోరగా వేగాక
తరిగిపెట్టుకున్న ,
ఉల్లిపాయ ముక్కలు , పచ్చి మిర్చి చీలికలు,  కరివేపాకు ,
వేసి  , వాటిని బాగా వేగ నిచ్చి ,
ముందుగా తయారు చేసి పెట్టుకున్న
మాగాయ , పెరుగు మిశ్రం లో వేసి
బాగా కలుపుకొని
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
ఘుమఘుమ లాడే మాగాయ పెరుగు పచ్చడి రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi




Friday, 27 May 2016

అరటి కాయ ఆవముద్ద కూర



                                                           అరటి కాయ ఆవముద్ద కూర

కావలిసిన పదార్థాలు

1అరటి కాయలు 3
2. ఉల్లిపాయలు 2
3. పచ్చి మిరప కాయలు 3
4.  అల్లం చిన్న ముక్క
5. కరివేపాకు

పోపు  దినుసులు :
మినపప్పు 1 స్పూన్ , సెనగ పప్పు 1 స్పూన్  ,
ఆవాలు అర స్పూన్ , జీల కర్ర అరస్పూన్ ,
ఎండు మిరపకాయలు 2  , ఆవ ముద్ద 1 స్పూన్

తయారీ విధానము
 అరటి కాయలు  తొక్క తీసి కుక్కర్ లో  పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి  .
స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని
 మినపప్పు , సెనగపప్పు , ఆవాలు,  జీల కర్ర,  ఎండు మిరపకాయలను,
 వేసి అవి దోరగా వేగాక
తరిగి పెట్టుకున్న ఉల్లి పాయ ముక్కలు , పచ్చిమిర్చి చీలిక లు , కరివేపాకులను
వేసి అవి వేగాక
ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసి ,
కొంతసేపు మగ్గనిచ్చి ,
వాటి పైన పసుపు ,సరిపడినంత ఉప్పు వేసి ,
మెత్తగా కుమ్ముకోవాలి .
ఇది చల్లారాక
ఆవముద్ద వేసి కలుపుకుంటే
 అరటి కాయ ఆవముద్ద కూర రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadev



కొత్తిమీర పచ్చడి




                                                                     కొత్తిమీర  పచ్చడి

కావలిసినపదార్తాలు

1. కొత్తిమీర 1 కట్ట
2. పచ్చి మిరప కాయలు  4
3. ఉప్పు తగినంత
4.  పసుపు
5. చింతపండు కొంచెము
6. బెల్లము  1స్పూన్

తయారీ విధానము  :


కొత్తిమీర ను మట్టిలేకుండా కడుగుకొని
సన్నగా తరుగుకోవాలి  .

తరిగిపెట్టుకున్న కొత్తిమీర  , పచ్చి మిరపకాయలు  , పసుపు ,
ఉప్పు , చింతపండు , బెల్లం వేసి

బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కొత్తిమీర పచ్చడి రెడీ

దీనిని రవ్వ దోస , మినప దోస లకి   బావుంటుంది.


Subha's Kitchen


వంటింటి చిట్కాలు 100-110

                                                 
                                                           
                                                            వంటింటి చిట్కాలు 100-110

1. ఒకటి -గ్రాముల జీలకర్ర వేడి నిటి తో తీసుకుంటే
    కడుపు నొప్పి ఉబ్బరము తగ్గుతాయి

2. కొత్తిమీర నూని లో వెఇంచి వేడి అన్నము,లో కలుపుకు తింటే
    ఐరన్ వ్రుధి చెంది  , రక్త హీనత తగ్గుతుంది

3. పప్పు ధాన్యాలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది

4. కాళ్ళు కడుక్కుని భుజించడము  , పొడి కాళ్ళతో నిద్రించడము వలన
   దీర్ఘ జీవితము ను పొందుతారు

5. గొంతు మంట తగ్గాలంటే
    వేడి నీళ్ళలో పసుపు ఉప్పు వేసి నోరు  పుక్కిలించాలి

6. వేడి నీళ్ళలో పసుపు వేసి ఆవిరి పడితే
     జలుబు భారము , ముక్కు బిగదియడము  తగ్గుతుంది

7. పసుపు, ఉసిరి కలిపిన పొడిని తరచూ తీసుకుంటుంటే
    మధుమేహ వ్యాధి తగ్గడమే కాకుండా దానికి
    సంభందించిన సమస్యలు తగ్గుతాయి

8. పసుపు కి రక్తాన్ని శుభ్రము చేసే గుణము ఉంది

9. ఆహారము లో ధనియాలు విధిగా వాడితే
    నాడీ వ్యవస్థని  బాల సంపన్నము చేస్తాయి

10. ముదిరిన కొబ్బరి నీళ్ళు జీవము  పోసే ఔషధము 

Tuesday, 24 May 2016

అల్లం పచ్చడి


  అల్లం  పచ్చడి

కావలిసిన పదార్థాలు

1. అల్లం  100 గ్రాములు
2. పచ్చి మిర్ల్చి 6
3. సెనగ పప్పు 3స్పూన్స్
4. మినపప్పు 3 స్పూన్స్
5.  ఆవాలు 1 స్పూన్
6. మెంతులు అర స్పూన్
7. ధనియాలు  1 స్పూన్
8. జీలకర్ర 1 స్పూన్
9. ఎండు మిరపకాయలు 10
10. చింతపండు 50 గ్రాములు
11.  బెల్లం 100 గ్రాములు
12. ఉప్పు
13. పసుపు

తయారీ విధానము

చింత పండు  నీళ్ళలో  నానబెట్టుకోవాలి .
స్టవ్  వెలిగించి బాణలి పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని

సెనగపప్పు ,  మినపప్పు   , ఆవాలు.,   జీలకర్ర  ,
మెంతులు , దనియాలు , ఎండు మిరపకాయలు  ,
వేసి  వేపుకోవాలి .

 ఇవి వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి

 అదే బాణలిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి
 తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు , పచ్చిమిర్చి చీలికలు వేసి దోరగా వేపుకోవాలి  .

ఇవి  రెండు చల్లారాక
ముందుగా

వేపుకున్న పోపు దినుసులను మెత్తగా పొడి లాగ  గ్రైండ్  చఎసుకొవాలి
ఈ పొడిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి

తరువాత వేపుకున్న అల్లం పచ్చిమిర్చి  లను కూడా మెత్తగా గ్రైండ్  చేసుకుని ,

దాంట్లో
నానబెట్టుకున్న చింతపండు ని , ఉప్పుని , బెల్లం మిశ్రమాని వేసి ,
మెత్తగా గ్రైండ్ చేసుకుని తరువాత
ముందుగా గ్రైండ్ చేసిపెట్టుకున్న కారము పొడి ని కూడా వేసి
మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి

దీనిని  ఒక బౌల్ లోకి తీసుకుని
ఆవాలు , జీలకర్ర , ఎండు మిరపకాయ , కరివేపాకు వేసి , ఇంగువ ,
పోపు పెట్టుకుంటే
అల్లం పచ్చడి రెడీ అవుతుంది.

ఇడ్లీ  ,దోశ   , పెసరట్టు ఉప్మా , లలోకి  చాలా  బావుంటుంది .

Subha's Kitchen

Beetroot Biryani

                                               


                                                                 Beetroot Biryani
                                                               By: Deepu., U.S.A.,

1. Basmati rice -2 cups ( soak for 20 min)
2. Beetroot-medium-2( peel and cut into cubes)
3. Ginger-garlic paste-2 tsp
4. Onions sliced-2 medium
5. Green chillies-6
6. Mint(Pudina)
7. Cilantro (Kothmeera)
8. Water 3 cups
9. Oil-2 tbsp
10. Salt to taste

Whole garam masala:
Dal chini 1 inch
Shahjeera -1 tsp
Elachi- 4
Peppercorns- 8
Bay leaf-2
Star anise-2

Method:

-Heat oil in a deep bottom pan, add whole garam masala.

-Add onions and pinch of salt and fry until translucent.

-Add ginger- garlic paste, fry until raw smell is gone.

-Add chopped mint and cilantro.

-Add beet-root pieces, sauté for some time.

-Drain the rice and add it to the pan.

-Add water and check for taste.

-Cook on medium flame till rice is done.

-Garnish with cilantro and enjoy with raita.

Subha's Kitchen

Monday, 23 May 2016

వంటింటి చిట్కాలు 91-100


                                         వంటింటి చిట్కాలు 91-100


1. చక్కర కలిపిన  నీటిలో బంగారు వస్తువులను అరగంట ఉంచి తరువాత సబ్బు నీటి తో
     కడిగితే    కొత్తవాటి లా మెరుస్తాయి .

2. మందార ఆకు,లు ఉప్పు కలిపి ఇత్తడి వెండి  వస్తువులను తోమితే  తళ తళ  లడతాయి

3.  పాలలో కొంచెం వంట సోడా వేసి కాచితే విరగవు

4. బఠానిలను 8 గంటల పాటు నానబెడితే  విటమిన్స్ రెండు రెట్లు పెరుగుతాయి

5. గారి ల పిండి రుబ్బే టప్పుడు రెండు గరిట ల  అన్నము కలిపితే  గారెలు కరకరలాడుతూ వస్తాయి

6. పచ్చి మిరపకాయలను పిన్నీసు తో  4 లేక  5 చోట్ల గుచ్చి తే  వేఇంచి నప్పుడు పగిలి గింజలు మిదపడవు

7. కారెట్ జ్ఞాపక శక్తిని పెంచుతుంది

8. ధనియాలు పొడి ని కలుపుకున్న మజ్జిగ ని తాగితే కడుపునెప్పి తగ్గుతుంది

9. పెరుగు , మజ్జిగ వాడితే నోటి కేన్సర్ రాదు

10. పెరుగు కడుపులో గ్యాస్ ఫోరం కాకుండా మరియు కడుపు ఉబ్బరము కాకుండా నివారిస్తుంది 

గుత్తి వంకాయ మసాలా కర్రీ


గుత్తి వంకాయ మసాలా కర్రీ

కావలిసిన పదార్థాలు

1. గుత్తి వంకాయలు  పావు కేజీ
2  టొమాటోలు 3
3 కొబ్బరి కోరు 1కప్పు
4. అల్లం వెల్లుల్లి పేస్టు 1స్పూన్
5. లవంగాలు 2
6. గసగసాలు పావు స్పూన్
7. జీడిపప్పు పలుకులు 10
8.  ఉల్లిపాయలు 2
9. కారము 2స్పూన్స్
10. చింత పండు  నీళ్ళలో వేసి పిసికిన రసం  1  కప్పు

తయారీ  విధానము
ముందుగా స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి
 అల్లంవెల్లుల్లి పేస్టు ,  ఉల్లిపాయముక్కలు,   టమాటో ముక్కలు   కొబ్బరికోరు  ,
లవంగాలు ,  గసగసాలు ,  జీడిపప్పుపలుకులు,   కారము వేసి
బాగా దోరగా మగ్గనివ్వాలి  .
ఇది చల్లారాక  సరిపడినంత ఉప్పు వేసి
మెత్తగా రుబ్బుకోవాలి
వంకాయలను  గుత్తులుగా తరుగుకుని  స్టౌ మీద బాణలి పెట్టి వేడెక్కాక 4 స్పూన్స్ ఆయిల్ వేసి
వంకాయలు వేసి ,  కొద్దిగా పసుపు వేసుకుని కొతసేపు, వేగనిచ్చి ,
(వేగుతున్నప్పుడు గరిట తో కాకుండా పేన్ కుదిపి తే వంకాయ  ముక్కలు విడకుండా కాయలాగే ఉంటుది )
.తరువత మూత పెట్టి  మగ్గనివ్వాలిమగ్గాక ,
పైన చెప్పిన మసాలా ముద్దను , వంకాయల  పైన వేసుకుని కలుపుకుని కొంత సేపు
మగ్గనిచ్చి , తరువాత
 చింతపండు రసాన్ని వేసి బాగా  మగ్గ నివ్వాలి
 బాగా దగ్గర పడేమ్తవరకు మగ్గనిచ్చి
పైన జీడిపప్పు కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
ఘుమ ఘుమ లాడే గుత్తి వంకాయ మసాల కర్రీ రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi



Sunday, 22 May 2016

గుత్తి వంకాయ గ్రేవీ కూర


                                                               గుత్తి వంకాయ గ్రేవీ  కూర

కావలిసిన పదార్థాలు

1. గుత్తి వంకాయలు పావు కేజి
2. ఉల్లిపాయలు 2
3. నూపప్పు  3 స్పూన్స్
4. కొబ్బరికోరు చిన్న కప్పు
5. పల్లీలు 3స్పూన్స్
6.  ఎండు మిరపకాయలు 5
7. ఉప్పు
8. పసుపు

తయారీవిధానము

ముందుగా స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టుకుని పైన చెప్పిన
నూపప్పు , పల్లీలు , ఎండు మిరపకాయలను , వేసి దోరగా వేపుకోవాలి
అవి చల్లారాక  కొబ్బరి కోరు కుడా కలుపుకుని మెత్తగా ముద్దలాగ రుబ్బుకోవాలి
ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి
వంకాయ లు గుత్తులు గా తరుగు కోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి దోరగా వేగాక
వంకాయ గుత్తులు పసుపు
సరిపడినంత ఉప్పు వేసుకుని మగ్గనివ్వాలి
రుబ్బి పెట్టుకున్న ముద్దను వేసి కొంచెము నీళ్ళు పోసుకుని
 బాగా దగ్గర పడేమ్తవరకు వుడకనివ్వాలి
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే

ఘుమ ఘుమలాడే గుత్తివంకాయ గ్రేవీ  కూర రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi


Saturday, 21 May 2016

పెసర పుణుకుల మజ్జిగ పులుసు


               
                                                        పెసర పుణుకుల మజ్జిగ పులుసు

కావలిసిన పదార్థాలు
1. మజ్జిగ అర లీటరు
2. ఆనపకాయ ముక్కలు 1 కప్పు
3. వంకాయలు 2
4. బెండకాయలు 2
5. టమాటో 1
6. పచ్చిమిర్చి 2
7. సెనగపిండి 3స్పూన్స్
8. పసుపు  కొంచెము  ,
9. ధనియాల పొడి  1 స్పూన్
10. కొబ్బరి కోరు 4స్పూన్స్
11. ఉప్పు
12. కొత్తిమీర
13. కరివేపాకు.

పెసర పుణుకులకి :::
1.  పెసర  పప్పు  2 కప్పులు
2. ఉప్పు
3. నూని

తయారీ విధానము.  
ముందుగా పెసర పప్పు  నీళ్ళలో నానబెట్టుకోవాలి .
గంట సేపు నానితే సరిపోతుంది .
మెత్తగా రుబ్బుకోవాలి . తరువాత  తగినంత ఉప్పు కలుపుకోవాలి .

స్టవ్ వెలిగించి బాణలి లో ఆయిల్ పోసుకుని ,కాగాక
రుబ్బుకున్న ఈ పిండిని  చిన్న చిన్న పునుకులలాగా వేసుకోవాలి.

 కూరముక్కలను  ఒక  గిన్నె లో వేసుకుని ముక్కలకు సరిపడే నీళ్ళూ పోసి

స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి
 ముక్కలు ఉడికిన తరువాత బాగాచల్లారనివ్వాలి .

 ఒక గిన్నెలోకి మజ్జిగ తీసుకుని అందులో
పసుపు , ధనియాల పొడి
 ( శనగపప్పు 2స్పూన్స్ ,మినప పప్పు 2 స్పూన్స్ ,ధనియాలు 2 స్పూన్స్
మిరియాలు 2, , ఎండు  మిరపకాయ ఒకటి , వే ఇంచి  గ్రైండ్ చేసిన పొడి ),
కొబ్బరి కోరు , సెనగపిండి , ఉప్పు  వేసి
ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి .
దీంట్లో చల్లారిన కూరముక్కలను వేసి బాగా కలిపి
 స్టవ్ మీద పెట్టి  ఉడికించాలి
మంట సిం లో ఉండేలా చూసుకోవాలి  మధ్య మధ్య లో కలుపుతూ వుండాలి

ఆవాలు జీలకర్ర మెంతులు, ఎండు మిరపకాయ , పచ్చి మిరపకాయ  ,ఇంగువ కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి

వేగిన  పునుకులను పులుసులో వేసి ,
కొత్తిమీరతో గార్నిష్   చేసుకోవాలి
ఘుమఘుమ లాడే మజ్జిగ పులుసు రెడీ.

---Subha's Kitchen



Friday, 20 May 2016

వంటింటి చిట్కాలు 81-90

             

                                                               వంటింటి చిట్కాలు 81-90

1. వె ల్లుల్లి  ని  అడ్డంగా గిల్లితే తొక్కలు తొందరగా  వస్తాయి .

2. పప్పు ఉడికేటప్పుడు    కాస్త నెయ్యి వేస్తే తొందరగా ఉడికిపోతుంది  .

3. వడలు వేయడానికి పప్పు ని ఎక్కువ సేపు నననివ్వకూడదు .

4. నానబెట్టిన కొంచెం సేపటికల్లా రుబ్బి వడలు వేస్తే వడలు కరకరలాడతాయి .

5. మిగిలిన చపాతీలు తాజాగా ఉండాలంటే మూత గట్టిగా ఉంచిన గిన్ని లో ఉంచి
      ప్రెషర్ కుక్కర్ లో 3,4 నిమిశాలుండాలి .

6. బొంబాయి రవ్వ ఉత్తి మూకుడు లో వేసి వెయించి  సీసాలో పోసి పెట్టుకుంటే పురుగు పట్టదు .

7. స్టీలు స్పూన్  లను తడి లేకుండా  ఆరనిచ్చి  కాస్త సోడా బై కార్బోనేట్ చల్లి పొడి బట్ట తో గట్టిగా
   రుద్దితే    కొత్త దాని ల తళతళ లాడుతుంది .

8. దొండకాయలు కూర చేసేటప్పుడు ముందుగా ఉప్పు చల్లకూడదు ముక్కలు ఉడికిన తరువాతే చల్లాలి .

9. ఉల్లిపాయలు తరిగేందుకు అరగంట ముందు వాటిని పొలితిన్ కవర్ లో వేసి ఫ్రిజ్ లో పెడితే
   తరిగేటప్పుడు కళ్ళు మండవు .

10. నేరేడు పండ్లలో కాల్షియమ్ ఫొస్ఫొరొఉస్ ఇనుము విటమిన్ సి ,బి ,ఉండటం వలన శరీరాని
      కిచల్లదనము చేకూరుతుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi







Wednesday, 18 May 2016

టమాటో పెరుగు పచ్చడి


 టమాటో  పెరుగు పచ్చడి
కావలిసిన పదార్థాలు
1. టొమాటోలు  6
2. పచ్చిమిరపకాయలు 3
3. పెరుగు  3  కప్ లు
4. సెనగపప్పు 1స్పూన్
5.  మినపప్పు 1 స్పూన్
6. ఆవాలు అర స్పూన్
7. జీలకర్ర అర స్పూన్
8.  ఎండు మిరపకాయలు 2
9. ఉప్పు
10. కొత్తిమీర

తయారీ విధానము
టొమాటోలు  సన్నగా తరుగుకోవాలి .
పచ్చి మిరపకాయలు చీలికలుగా చేసుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
3 స్పూన్స్ ఆయిల్ వేసి
పైన చెప్పిన  పోపు దినుసులను వేసుకుని
అవి దోరగా వేగాక ,సన్నగా తరిగి పెట్టుకున్న
టమాటో ముక్కలు , పచ్చి మిర్చి చీలికలు
వేసి పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి
ఒక గిన్నెలోకి చిక్కని పెరుగు తీసుకుని
పసుపు
తగినంత ఉప్పు
వేసుకుని కలుపుకోవాలి .
ఈ పెరుగులో చల్లారిన టమాటో మిశ్రమాని కలిపి
పైన కొత్తిమీర చల్లుకోవాలి
ఘుమఘుమ లాడే టమాటో పెరుగుపచ్చడి రెడీ .

టమాటో మిశ్రమాన్ని చల్లారిన తరువాతనే
పెరుగులో కలుపుకోవాలి లేకపోతే పెరుగు విరిగినట్లు గా అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

వంటింటి చిట్కాలు 71-80


                                                               వంటింటి చిట్కాలు 71-80

1. నెయ్యి తాజాగా ఉండాలంటే దానిని నిలవ చేసే పాత్రలో చిన్న బెల్లము ముక్క వేస్తె తాజాగా ఉంటుంది


2. కంది పప్పు త్వరగా ఉడకాలంటే అందులో చిన్న కొబ్బరి ముక్క వేస్తె పప్పు మెత్తగా ఉడుకుతుంది


3. పంచదార డబ్బా చుట్టూ పసుపు చల్లితే చీమలు పట్టవు


4. నూని మారక పోవాలంటే గోధుమ పిండి రుద్ది ఉతికితే ఆ మరక పోతుంది


5. చింత పండు తో చేసే వంటకాలకు "  ఎండు మిరపకాయ " వాడితే వంట రుచి గా ఉంటుంది


6. నిమ్మ రసము తో చేసే వంటకాలకు " పచ్చి మిర్చి "  వాడితే వంట రుచి గా ఉంటుంది


7. జాడీ మూత బిగుసుకుని  రాకపోతే  కాస్త ఉప్పు నూని కలిపి రాయాలి , కొద్ది సేపటికి సులభము
    గా వస్తుంది


8. పప్పుల డబ్బా లో కొన్ని ఎండిన వేప ఆకులు వేస్తె పురుగులు పట్టవు


9. బిస్కట్ లను బియ్యము డబ్బా లో గాని , ఫ్రిడ్జ్  లో గాని నిలవ ఉంచితే మెత్త బడకుండా తాజా గా
    కరకర లాడతాయి


10. అన్నము చిమిడి పోతుంటే ఒక  స్పూన్ నూని  వేయాలి 

Tuesday, 17 May 2016

వంటింటి చిట్కాలు 61-70

                                               
                                                                


                                                          వంటింటి చిట్కాలు 61-70


1. ధనియాల పొడి ,సాంబారు పొడి,చారు పొడి, మొదలు మసాలా దినుసులలో కాస్త ఇంగువ ముక్క
    వేసి ఉంచితే ఎక్కువ రోజులు పాడవ   కుండా నిలువ ఉంటాయి .
2. బొబ్బట్ల పిండి లో ఒక చెంచాడు గోధుమ రవ్వ కలిపితే బొబ్బట్లు చిరిగి పోకుండా ఉంటాయి .
3. మిల్లు లో పట్టించిన ఏ పిండి నైనా పేపర్లలో బాగా ఆరబెట్టి బాగా ఆరిన తరువాతే డబ్బా లో
    వేసి ఉంచాలి .
4. మినపట్లు గాని దోశ లు గాని వేసేటప్పుడు ముందుగా పెనాన్ని వంకాయ ముచ్చిక తో గానీ వంకాయ
    ముక్క తో గానీ రుద్దితే మినపట్లు  పెనానికి అంటుకోకుండా వస్తాయి .
5. బెండకాయ కూర జిగురు పోవాలంటే అరగంట ముందే కడిగి  ఆర బెట్టాలి .
6. నూనె లో కొంచెము ఉప్పు కలిపితే గారెలు మోదిలైన  వంటకాలు ఎక్కువ నూనె పీల్చవు  .
7. గంజిలో ఉండే  విటమిన్లు కూడా మనం శరీరానికి అవసరమే దానిలో తగినంత ఉప్పు ,పంచదార   కలిపి త్రాగాలి .వడ  దెబ్బ తగలదు .
8. పాత్రలకు అడుగు భాగాన వరిపిండి ,ఉప్పు కలిపి రాస్తే సులువు గా  తోముకోవచ్చు .
9. నిమ్మ రసం క్రింద ఒలికి గచ్చు తెల్లగా అయితే దాని మీద దోస ముక్క తో గాని గుమ్మడి ముక్క తో
  గాని  రుద్దితే  తెలుపు పోతుంది .
10. ఎండా కాలంలో పాలు విరిగిపోకుండా ఉండాలంటే దానిలో  2, 3 వడ్ల గింజలు వెయ్యాలి .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi



Monday, 16 May 2016

వంటింటి చిట్కాలు 51-60

                                                     


                                                      వంటింటి చిట్కాలు  51-60


1. ఆకు కూరలని ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెడితే నిలవ ఉంటుంది . 

2. పచ్చి మిర్చి తొడిమలు తీసేసి గాలి తగలిని సీస లో వేసి కొంచెం పసుపు చల్లి చల్లని చోట నిలువ 
    చెయ్యాలి  

3. నిమ్మ కాయలను చల్లని నీటి లో ఉంచితే నిలువ ఉంటాయి కానీ రోజు నీళ్ళు మారుస్తూ ఉండాలి 

4. దోస కాయలను నేల మీద ఉంచి ఎ  బెసినైన మూత పెడితే ఎండి పోకుండా నిలువ ఉంటాయి 

5. కాకర కాయ త్వరగా పండి ఎండి పోతుంది దాన్ని , రెండు ముక్కలుగా తరిగి పెడితే నిలవ ఉంటుంది 

6. కారెట్ కి  మొదళ్ళు కోసి ఫ్రిడ్జ్ లో పెడితే నిల్వ ఉంటాయి

7. బియ్యం డబ్బాలో అడుగున వేపాకులు వేసి ఆ పైన బియ్యం పోస్తే పురుగులు పట్ట కుండా ఉంటాయి 

8. పంచదార డబ్బా లో కొన్ని లవంగాలు వేసి ఉంచితే చీమలు  పట్టకుండా ఉంటుంది 

9.ఎండి పోయిన నిమ్మ కాయల డిప్పలను బీరువా లో ఉంచితే పురుగులు రావు 

10.పూర్ణము పల్చ బడి ఉండ కి రాకుండా ఉంటె ఉంటే అందులో కాస్త పాల పిండి కలిపితే గట్టి
      బడుతుంది మరియు రుచి గా కూడా ఉంటుంది .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi


టమాటో పచ్చడి



                                                              టమాటో పచ్చడి
కావలిసిన పదార్థాలు

1.   టొమాటోలు  పావు  కేజీ
2. ఎండుమిరప కాయలు  100 గ్రాములు
3.  ఆవాలు 2స్పూన్స్
4. మెంతులు 2 స్పూన్స్
5.  చింతపండు  కొద్దిగా
6.   ఇంగువ  కొద్దిగా
7. కరివేపాకు  కొద్దిగా

తయారీ విధానము

స్టవ్ వెలిగించుకుని   బాణలి  లో 2స్పూన్స్ ఆయిల్  వేసుకుని
మిరపకాయలు ,
ఆవాలు  ,
ఇంగువ ,
మెంతులు
వేసి  దోరగా  వేఇంచుకోవాలి .
చల్లారాక  మెత్తగా పొడి లాగా చేసుకోవాలి  . 
టొమాటో  లను సన్నగా తరుక్కుని  
బాణలి లో  ఆయిల్ వేసుకుని   తరిగిన టమాటో  ముక్కలు
పసుపు  ,
చింత పండు వేసి బాగా మగ్గని వ్వాలి 
ముద్దలా దగ్గర  పడ్డా క
సరిపడేంత ఉప్పు  
పైన చెప్పిన కారము మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి 
ఇది బాగా దగ్గర పడ్డాక
ఇంగువ 
కొంచెము  నూని లో వేసి 
కాచి పోసుకోవాలి.
పైన వేఇంచిన కరివే పాకు  ,పోపు వేసి కలపాలి. 

ఘుమ ఘుమ లాడే టమాటో పచ్చడి రెడీ 

15 రోజులు నిలవ వుంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi


Sunday, 15 May 2016

వంటింటి చిట్కాలు 41-50

           
                                                 
                                                             వంటింటి చిట్కాలు 41-50

1. పెరుగు గిన్నె లో ఒక చిన్న కొబ్బరి ముక్క , లేదా ,చిన్న ఎండు మిరపకాయ,
    లేదా చిన్న విస్తరాకు ముక్క   వేసి ఉంచితే పులవదు,


2. వారానికి ఒకసారి తోటకూర , ములగాకు కూర  పొన్నగంటి కూ ర తినడము కంటికి మంచిది


3. ఇంగువ వేసిన వంటకాలలో వెల్లుల్లి వేస్తే నప్పదు


4. వెల్లుల్లి వేసిన వంటకాలలో ఇంగువ వేస్తె  నప్పదు


5. టమాటాలను  ఉప్పు నీటి లో వేసి ఉంచితే మర్నాడు ఉదయానికి ఫ్రెష్ గా ఉంటాయి


6. కాయ కూరలను పసుపు వేసిన నీటి లో తరిగితే వాటిలోని క్రిములు నశించి నీటి పైన తేలుతాయి


7. వెల్లుల్లిని కొంచెము  నూని రాసి ఎండపెడితే  దాని మీద పొరలును తేలికగా వలువ వచ్చు


8. వెల్లుల్లి ని ఖాలీ ముకుడి లో కాసేపు వేయిస్తే పొరలు తేలిక గా వస్తాయి


9. కూరలలో కొద్దిగా పాలు వేసి ఉడికిస్తే ఆకురలకు విపరీతమైన రుచి వస్తుంది


10. కరివేపాకు ని నీడలో గాలికు ఆర బెట్టి సీసా లో నిలవ చేసుకుంటే పాడవదు

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

" టమాటో రైస్ "

                                                         
                                                                 " టమాటో రైస్  "

కావలసిన పదార్థాలు  
1. టమాటోలు  6  
2. రైస్ 250 గ్రాములు 
3. అల్లం వెల్లుల్లి పేస్టు  2 స్పూన్స్
4.  జీడిపప్పు 
5.  లవంగాలు 
6. పచ్చి మిర్చి చీలికలు 4 
7.  ఆయిల్ 

తయారీ   విధానము 
ముందుగా రైస్  ఉడీకించుకుని  ప్లేట్ లో తడి లేకుండా  ఆరబెట్టుకోవాలి . 
స్టౌ మీద బాణలి పెట్టుకుని  ఆయిల్ వేసుకుని ,
లవంగాలు  ,
జీడి పప్పు వేసుకుని  ,వేఇంచుకొవాలి ,
వేగాక 
అల్లం వెల్లుల్లి పేస్టు , 
 పచ్చి మిర్చి చీలికలు వేసి 
వేగాక
తరిగిన టమాటో ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి . 
ఈ మిశ్రమాని ఆరబెట్టుకున్న రైస్  మీద వేసి , 
ఉప్పు  వేసి బాగా కలుపుకోవాలి  
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే  
ఘుమ ఘుమ లాడే టమాటో రైస్ రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

Friday, 13 May 2016

బొబ్బట్లు

       
                                               
                                                                           బొబ్బట్లు
కావలిసిన పదార్థాలు

1.  సెనగ పప్పు  250 గ్రాములు
2. బెల్లం 250 గ్రాములు
3. ఇలాచి  పొడి కొద్దిగా
4. మైదా పిండి  250  గ్రాములు
5. ఆయిల్

 తయారీ విధానము :
ముందుగా సెనగ పప్పు ను  ఉడక బెట్టుకుని  బాగా చల్లారనివ్వాలి .
మైదా పిండి ని  కొద్దిగా ఉప్పు  వేసుకుని  నీళ్ళూ పోసుకుని  పూరి పిండి మాదిరిగా  కలుపుకుని,
 ఆ పిండి పైన ఆయిల్ వేసుకుని బాగా మర్దిమ్చాలి.
ఈ పిండి ని బాగా నాననివ్వాలి.
ఎంత ఎక్కువ సేపు నానితే బొబ్బట్లు అంత బాగా మెత్తగా వస్తాయి.
చల్లారిన పప్పు ని మెత్త గారుబ్బుకుని ,
మెత్తని బెల్లము పొడి ,
ఇలాచీ పొడి ,
వేసుకుని బాగా కలుపుకోవాలి
ఈ మిశ్రమాన్ని  కావలిసిన. సైజు లో ఉండలుగా  చేసుకోవాలి
అరచేతికి ఆయిల్ రాసుకుని ,
నానిన మైదాపిండి ని  కొద్దిగా తీసుకుని,
పూరీ లా చేసుకుని  ,
దాంట్లో ముందుగా చేసి పెట్టుకున్న సెనగపప్పు పూర్ణాన్ని  పెట్టుకుని ఉండ లా చేసుకుని
అరిటాకు  గాని ప్లాస్టిక్ కవర్ గాని తీసుకుని
దాని మీద ఆయిల్  రాసుకుని
ఈ ఉండ ను పెట్టి చేతి తో  వత్తుకోవాలి
స్టవ్ మీద పెనం పెట్టి  కాల్చుకోవాలి
స్టవ్ మంట మీడియం లో ఉండేలా చూసుకోవాలి

ఘుమ ఘుమ లాడే బొబ్బట్లు రెడీ.
పాలల్లో వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటాయి.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.



Tuesday, 10 May 2016

పంచారామ క్షేత్రాలు

                                                     
                                                             పంచారామ క్షేత్రాలు

1. అమరారామము (అమరావతి)

2. సోమారామము (భీమవరం)

3. క్షీరారామము (పాలకొల్లు)

4. ద్రాక్షారామము (తూర్పు గోదావరి జిల్లా)

5. కుమారామము (  సామర్లకోట )

1. అమరారామము :

గుంటూరుకు సుమారు 27కి .మీ. దూరంలో పావన కృష్ణానది తీరమున ఇంద్ర ప్రతిష్టగా నిలచిన “శ్రీ అమరేశ్వర స్వామి” పంచారామాల్లో  మొదటిది. ఇచ్చట స్వామివారితో పాటు  “దేవేరి రాజ్యలక్ష్మీ” అమ్మవారి దర్శనము చేయవచ్చు. ఈ క్షేత్రము పూర్వకాలము నుండి సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాముగా పేరుగాంచినది.

2. సోమారామము :

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్దగల గునుపూడిలో “శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి” దేవాలయం ఉంది. ఈ క్షేత్రం పంచారామ క్షేత్రాలలో రెండవది. ఈ ఆలయము చంద్ర ప్రతిష్ట. గోధుమ , నలుపు వర్ణంలో గల సోమేశ్వర లింగము, పై  అంతస్తు లో “అమ్మవారు” ,  సోమేశ్వర లింగమునకు ప్రక్కన (కొంత దూరంలో)  “శ్రీ జనార్ధన స్వామి” వారు  వుంటారు.

3. క్షీరారామము :

పశ్చిమ గోదావరి జిల్లా లో గల పాలకొల్లులో “రామలింగేశ్వర లింగము” పంచారామాల్లో మూడవది. ఈ లింగము విష్ణు ప్రతిష్ట . స్వామి వారికి వెనుక భాగంలో మూడు చారులున్నాయి. ఇవి జటలని ప్రతీతి. ఈ లింగము తారకాసురుడు పూజించిన అమృత  లింగానికి శిరోభాగమని కొందరంటారు.

4. ద్రాక్షారామము :

తూర్పు గోదావరి జిల్లాలో గల ద్రాక్షారామము పంచారామాల్లో నాలుగవది. ఇక్కడ దక్ష ప్రజాపతి అనేక యజ్ఞాలు చేసెను కాబట్టి , ఈ పవిత్ర స్ధలమునకు ద్రాక్షారామమని పేరు వచ్చింది. దక్షిణ కాశీగ ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామాములో భీమేశ్వరలింగము 15 అడుగులు  పైగా ఎత్తుంటుంది. పై అంతస్తు నుండి అభిషేకదులు చేస్తారు .
ఇచ్చట అష్టాదశ శక్తి పీఠముల్లో ఒకటి అయిన “మాణిక్యాంబా దేవి” దర్శనము చేయవచ్చు .

5. కుమారామము :

తూర్పు గోదావరి జిల్లా , పెద్దాపురం తాలూక సామర్లకోట , ఉన్న “కుమార భీమేశ్వరుడు” కూడా చాలా ఎత్తయిన లింగము. ఈ లింగము పంచారామాల్లో చివరది. ఈ లింగము కుమార స్వామి ప్రతిష్ట. స్వామి వారితో బాటు  “బాల త్రిపురసుందరి” దేవిని  కూడా  దర్శనము చేయవచ్చు.
.

Sunday, 8 May 2016

నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం.

 
                                         
                                           నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం.

1.శుద్ధబ్రహ్మ పరాత్పర రామ
2.కాలాత్మక పరమేశ్వర రామ
3.శేషతల్ప సుఖనిద్రిత రామ
4.బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
5.చందకిరణ కులమండన రామ
6.శ్రీమద్దశరధనందన రామ
7.కౌసల్యాసుఖవర్ధన రామ
8.విశ్వామిత్రప్రియధన రామ
9.ఘోరతాటకఘాతక రామ
10.మారీచాదినిపాతక రామ
11.కౌశిక మఖసంరక్షక రామ
12.శ్రీ మదహల్యో ద్దారక రామ
13.గౌతమమునిసంపూజిత రామ
14.సురమునివరగణసంస్తుత రామ
15.నవికధావితమృదుపద రామ
16.మిధిలాపురజనమోదక రామ
17.విదేహమానసరంజక రామ
18.త్రయంబకకార్ముకభంజక రామ
19.సితార్పితవరమాలిక రామ
20.కృతవైవాహిక కౌతుక రామ
21.భార్గవదర్పవినాశక రామ
22.శ్రీ మాధయోద్యా పాలక రామ
23.ఆగణితగుణగణభూషిత రామ
24.అవనితనయాకామిత రామ
25.రాకాచంద్రసమానన రామ
26.పితృవాక్యాశ్రితకానన రామ
27.ప్రియగుహావినివేధితపద రామ
28.తత్ క్షాళితనిజమృదుపద రామ
29.భరద్వాజముఖానందక రామ
౩౦.చిత్రకూటాద్రినికేతన రామ
31.దశరధసంతతచింతిత రామ
32.కైకేయీతనయార్థిత రామ
౩౩.విరచితనిజపాదుక రామ
34.భారతార్పిత నిజపాదుక రామ
35.దండకవనజనపావన రామ
36.దుష్టవిరాధవినాశాన రామ
37.శరభoగసుతీక్షార్చిత రామ
38.అగస్త్యానుగ్రహవర్ధిత రామ
39.గృద్రాధిపగతిదాయక రామ
40.పంచవటీతటసుస్థిత రామ
41.శూర్పణఖార్తి విధాయక రామ
42.ఖరదూషణముఖసూదక రామ
43.సీతాప్రియహరిణానుగ రామ
44.మరిచార్తికృదాశుగా రామ
45.వినష్ట సేతాన్వేషక రామ
46. గృధ్రాధిపగతిదాయక రామ
47.శబరిదత్తఫలాశన రామ
48.కబంధభాహుచ్చేధన రామ
49.హనుమత్సేవితనిజపద రామ
50.నతసుగ్రివభిష్టద రామ
51.గర్వితవాలివిమోచక రామ
52. వానరదుతప్రేషక రామ
53.హితకరలక్ష్మణసంయుత రామ
54.కపివరసంతతసంస్మృత రామ
55.తద్గతి విఘ్నద్వంసక రామ
56.సీతాప్రాణాదారక రామ
57.దుష్టదశాన ధూషిత రామ
58. శిష్టహనూమద్భూషిత రామ
59.సీతూధితకాకావన రామ
60.కృతచూడామణిదర్శన రామ
61. కపివరవహనశ్వాసిత రామ
62.రావణధనప్రస్థిత రామ
63.వనరసైన్యసమావృత రామ
64.శొశితసరిధీశార్థిత రామ
65.విభిషణాభయదాయక రామ
66. సర్వతసేతునిభందక రామ
67.కుంబకర్ణ శిరశ్చెదక రామ
68.రాక్షససంఘవిమర్ధక రామ
69.ఆహిమహిరావణ ధారణ రామ
70.సంహ్రృతదశముఖరావణ రామ
71.విభావముఖసురసంస్తుత రామ
72.ఖస్థితధశరధవీక్షిత రామ
73.సీతాదర్శనమోదిత రామ
74.అభిషిక్త విభీషణ రామ
75.పుష్పకయానారోహణ రామ
76.భరధ్వజాభినిషేవణ రామ
77.భరతప్రాణప్రియకర రామ
78.సాకేత పురీభుషన రామ
79.సకలస్వీయసమానత రామ
80.రత్నలసత్పీఠాస్థిత రామ
81.పట్టాభిషేకాలంకృత రామ
82.పార్థివకులసమ్మానిత రామ
83.విభీషణార్పితరంగక రామ
84.కీశకులానుగ్రహకర రామ
85.సకలజీవసంరక్షక రామ
86.సమస్తలోకోద్ధారక రామ
87.అగణితమునిగాణసంస్తుత రామ
88.విశ్రుత రాక్షసఖండన రామ
89.సితాలింగననిర్వృత రామ
90.నీతిసురక్షితజనపద రామ
91.విపినత్యాజితజనకజ రామ
92.కారితలవణాసురవధ రామ
93.స్వర్గతశంబుక సంస్తుత రామ
94.స్వతనయకుశలవనందిత రామ
95.అశ్వమేధక్రతుదీక్షిత రామ
96.కాలావేదితసురపద రామ
97.ఆయోధ్యజనముక్తిద రామ
98.విధిముఖవిభుదానందక రామ
99.తేజోమయనిజరూపక రామ
100.సంసృతిబన్ధవిమోచక రామ
101.ధర్మస్థాపనతత్పర రామ
102.భక్తిపరాయణముక్తిద రామ
103.సర్వచరాచరపాలక రామ
104.సర్వభవామయవారక రామ
105.వైకుంఠలయసంస్ఠీత రామ
106.నిత్యనందపదస్ఠిత రామ
107.కరుణా నిధి జయ సీతా రామ
108.రామరామ జయరాజా రామ

రామ రామ జయసీతా రామ.....

తిరుమలలో పుణ్యతీర్థములు part 2


తిరుమలలో పుణ్యతీర్థములు part 2

1. స్వామి పుష్కరిణి :

స్వామి వారి ప్రధానాలయ సమీపంలో ఉండే ఈ పుష్కరిణి ఎంతో పవిత్రమైనది.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారు స్వయముగా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారని అంటారు. స్వామి వారిని దర్శించే ముందు ఇక్కడ స్నానం చేసి వెళ్ళడం ఒక ఆచారముగా చెప్పబడుతోంది.

2.ఆకాశ గంగ:
ప్రధానాలయం నుండి 5 కి.మీ. దూరం లో ఆకాశ గంగ తీర్థం ఉంది.
శ్రీవారి పాద పద్మముల నుండి ఈ తీర్థము ఉద్భవించిందని విశ్వాసం .

3.పాప వినాశనం :
ప్రధానాలయం నుండి 3 మైళ్ళ దూరములో పాప వినాశనం తీర్థము వున్నది.

4.తుంబుర తీర్థం :
ప్రధానాలయం నుండి 16 కి.మీ. దూరం లో తుంబుర తీర్థం ఉన్నది.

5.పాండవ తీర్థం :
పాండవ తీర్థం తిరుమల కొండ ఆదిలో నృసింహ కొండ అభిముఖంగా ఉంది. ఈ తీర్థమునకు పౌరాణిక ప్రాశస్త్యం కలదు. వనవాస సమయములో ధర్మరాజు, అర్జునుడు ఇక్కడ స్నానం ఆచరించారని అంటారు. ఈ తీర్థానికి గో గర్భ తీర్థమని పేరు కూడా ఉన్నది .

6.కుమారధార తీర్థం:
మహా విష్ణువు యొక్క భక్తుడొకరు తిరుమలలో తపమునాచరించగా , ఆ శ్రీ మహా విష్ణువు ప్రత్యక్షమై, అక్కడి తీర్థములో స్నానమాచరించమని చెప్తారు. అంతట ఆ భక్తుడు 16 ఏళ్ళ బాలుడిగా మారెను. అప్పటినుండి ఈ తీర్థమునకు కుమార తీర్థం అని పేరు వచ్చింది.
ఇక్కడికి చేరుకోవాలంటే అరణ్య మార్గం గుండా కొండలను అధిరోహించి వెళ్ళవలసి వుంటుంది.

7.చక్ర తీర్థం :
ప్రధానాలయం నుండి 2 కి.మీ. దూరంలో శిలాతోరణం ప్రాంగణంలో చక్ర తీర్థం వున్నది. సుదర్శన చక్రం పడిన ప్రాంతము కాబట్టి ఈ తీర్థమునకు చక్రతీర్థం అని పేరు వచ్చింది అని ఒక పురాణ కధనం.

వైకుంఠ తీర్థం
ప్రధానాలయం నుండి సుమారు 4 కి.మీ. దూరంలో వైకుంఠ తీర్థం వున్నది. రాముని వానరసేనలో వున్న వానరులకు ఇక్కడ వైకుంఠము కనిపించిందని, అందుకే వైకుంఠ తీర్థం అని పేరు వచ్చిందని అంటారు.

రామకృష్ణ తీర్థం
ప్రధానాలయం నుండి సుమారు 10 కి.మీ. దూరంలో రామకృష్ణ తీర్థం వున్నది.
ఈ తీర్థము వద్ద ఒక ముని తపస్సు చేసారని, వారి తపమునకు మెచ్చి శ్రీ మహా విష్ణువు ప్రత్యక్షమై మునిని ఆశీర్వదించి, ఈ తీర్థమునకు చేరుకోవడానికి శేషాచల అడవుల
గుండా కొండలు అధిరోహించి వెళ్ళ వలసి వుంటుంది.

శేష తీర్థం
ప్రధానాలయం నుండి సుమారు 7 కి.మీ. దూరంలో శేష తీర్థం వున్నది. ఆదిశేషువు ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని తన తోకతో చరచగా ఈ తీర్థం ఏర్పడిందని ఒక కధనం. 
ఇక్కడికి చేరుకోవడానికి అరణ్యం గుండా వెళ్ళవలసి వుంటుంది.

పసుపు తీర్థం
ప్రధానాలయం నుండి సుమారు 8 కి.మీ. దూరంలో పసుపు తీర్థం వున్నది.
ఈ పసుపు తీర్థం స్వర్గంలో వుండే పుణ్య తీర్థాలతో సమానము అని అంటారు.
ఈ తీర్థం తో స్వామివారికి ప్రత్యేకమైన అనుబంధము వుందని చెబుతారు. 
ఈ తీర్థమునకు చేరుకోవడానికి శేషాచల అడవుల గుండా కొండలు అధిరోహించి
వెళ్ళ వలసి వుంటుంది.

జపలి తీర్థం
ప్రధానాలయం నుండి సుమారు 7 కి.మీ. దూరంలో జపలి తీర్థం వున్నది. ఇక్కడ హనుమంతుని కోవెల వున్నది. జబలి అనే ఋషి ఇక్కడ పూజలు చేసారని, వారి వల్లనే ఈ తీర్థానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.

సీతమ్మ తీర్థం
చక్ర తీర్థానికి శిలా తోరణానికి మధ్య సీతమ్మ తీర్థం వున్నది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

Saturday, 7 May 2016

ఆంజనేయ స్వామికి ఇష్టమైన పుష్పాలు

                                                  ఆంజనేయ స్వామికి ఇష్టమైన  పుష్పాలు

వైశఖమాసి కృష్ణాయాం – దశమ్యాం మందవాసరే!
పూర్వాభాద్రాభ్య నక్షత్రే – వైధ్రుతౌ హనుమా నభూతే||

ఆంజనేయ స్వామి వసంతఋతువు,
 వైశాఖ మాసం
కృష్ణపక్షంలో,
దశమి తిథి,
శనివారం,
పూర్వాభాధ్రా నక్షత్రంలో,
మధ్యాహ్న కాలంలో
అంజనీదేవికి  జన్మించాడు. ఆంజనేయుడు అంజనాదేవి, కేసరుల ముద్దుబిడ్డ.

సదా రామనామామృతపాలన సేవితుడై గంధమాధశైలి యందు వసించు చిరంజీవి. ఆంజనేయ నామమహిమ అనితరమైనది.

అలాంటి మృత్యుంజయుడైన  ఆంజనేయ స్వామిని  పొన్నపువ్వు, మొగలి, పొగడ, నంధివర్ధనం, మందారం, కడిమి, గజనిమ్మ, పద్మం,  నల్లకలువ,మద్ది, సువర్ణ పుష్పం, గౌరీ మనోహరం, ఎర్ర గన్నేరు, కనకాంబరం, ములుగోరిట, మెట్ట తామర,పొద్దు తిరుగుడు, మంకెన, బండికెరి వెంద, అడవిమల్లె, కొండగోగు దింటెన,  సన్నజాజి, మల్లె, గులాబి, మోదుగ, సంపంగి, జిల్లేడు,చంద్ర కాంత,  సురపున్నాగ, కుంకుమ పువ్వు మొదలైనపుష్పాలు అంటే ఇష్టం.

అలాగే తులసి, మాచిపత్రి, ఎర్రకలువ, గోరింట, ఉత్తరేణి, పసుపు, అక్షింతలు,  తిరుమారేడు,నేరేడు, తమలపాకులు కూడా ఆంజనేయునికి ప్రీతికరమైనవి అని

, పైన  వివరించబడిన పుష్పాలు, పత్రాలతో స్వామివారి పూజిస్తే అనుకున్న కార్యాలు  దిగ్విజయంగా పూర్తవుతాయి అని పండితులు అంటున్నారు.

వరాహ స్వామి ఆలయం ////బేడి ఆంజనేయస్వామి ఆలయం

                                                         వరాహ స్వామి ఆలయం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రధానాలయానికి ఉత్తరాన, స్వామి పుష్కరిణి ఒడ్డున   శ్రీ వరాహ స్వామి ఆలయం వున్నది.

పురాణాల ప్రకారం
తిరుమల ఆది వరాహ క్షేత్రమని, వరాహ స్వామి వారి అనుమతితో శ్రీవేంకటేశ్వర స్వామి ఇచ్చట కొలువు దీరారని చెప్పబడుతోంది.

బ్రహ్మ పురాణం ప్రకారం, తిరుమలకి వచ్చిన భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించి,నైవేద్యము సమర్పించిన తరువాత శ్రీ వేంకటేశ్వర స్వామిని  దర్శనం చేసుకోవాలని చెప్పబడినది.

అత్రి సంహిత ప్రకారం, వరాహావతారాన్ని మూడు రూపాల్లో కొలుస్తారు.
–
 ఆది వరాహ
–
ప్రళయ వరాహ
–
 యజ్ఞ్న వరాహ

వైఖానస ఆగమం ప్రకారం, తిరుమలలోని వరాహ స్వామి ఆలయంలో వున్న మూర్తి ఆదివరాహ మూర్తిగా చెప్పబడుతోంది.

బేడి ఆంజనేయస్వామి ఆలయం:

బేడి ఆంజనేయస్వామి ఆలయం తిరుమల సన్నిధి వీధిలో , శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రధానాలయ మహా ద్వారమునకు ఎదురుగా వున్నది.

 శ్రీ వేంకటేశ్వర స్వామికి, శ్రీ వరాహ స్వామికి ప్రతిసారి నైవేద్యము సమర్పించిన తరువాత, ఆ ప్రసాదమును ఈ ఆలయం వద్దకు కూడా తీసుకు వస్తారు.

ప్రతి ఆదివారము ఈ ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకము నిర్వహిస్తారు.

బెండకాయ పల్లి ఫ్రై” ///రుచిలో////పోషకాల్లోఘనమైన బెండకాయ


                                                                 “బెండకాయ పల్లి ఫ్రై”
                                                  రుచిలో////పోషకాల్లోఘనమైన బెండకాయ

1. బెండకాయ జిగురులోని పాలీశాక్రైడ్లు జీర్ణక్రియ మెరుగుపడటానికి తోడ్పడతాయి. పేగుల కదలికలు సాఫీగా సాగేందుకూ దోహదం చేస్తాయి.
2. బెండకాయలో పీచుతో పాటు విటమిన్‌ సి, ఫోలేట్‌ వంటి పోషకాలు కూడా దండిగా ఉంటాయి.
3. ఒక కప్పు (100 గ్రాములు) బెండకాయ ముక్కల్లో.. 2.5 గ్రాముల పీచు, 16.3 మిల్రీగ్రాముల విటమిన్‌ సి, 46 మైక్రోగ్రాముల ఫోలేట్‌, 283 ఐయూల విటమిన్‌ ఏ, 40 మైక్రోగ్రాముల విటమిన్‌ కె ఉంటాయి. ఇంకా నియాసిన్‌, థైమిన్‌, విటమిన్‌ బీ6, మెగ్నీషియం, మాంగనీస్‌, బీటా కెరటిన్‌ వంటి పోషకాలూ లభిస్తాయి.
4. బెండకాయలో నీటిలో కరిగే రకానికి చెందిన పెక్టిన్‌ అనే పీచు ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ స్థాయులు తగ్గటానికి తోడ్పడుతుంది. ఫలితంగా గుండెజబ్బులనూ దూరంగా ఉంచుతుందన్నమాట.
5. బరువు తగ్గాలని అనుకునేవారు తరచుగా బెండకాయలను తినటం మంచిది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువ. 100 గ్రాముల బెండకాయల్లో 33 కేలరీలు మాత్రమే ఉంటాయి.
6. ఇక ఇందులోని పీచు చిన్నపేగుల్లోంచి రక్తం లోకి గ్లూకోజు త్వరగా చేరకుండా నియంత్రి స్తుంది. ఇలా రక్తంలో గ్లూకోజు మోతాదులు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడతాయి.
7. దీనిలోని విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంపొందించి జబ్బుల బారినపడకుండా కాపాడుతుంది.
8. అలాగే పీచు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడుతుంది.
9. ఈ బ్యాక్టీరియా కూడా రోగనిరోధక వ్యవస్థ పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది.
10. బెండకాయ గర్భిణులకూ మేలు చేస్తుంది. దీనిలోని ఫోలేట్‌ పుట్టబోయే పిల్లల్లో వెన్ను లోపాలు తలెత్తుకుండా కాపాడుతుంది. ఫోలేట్‌ మెదడు పనితీరునూ మెరుగు పరుస్తుంది. యాంటీఆక్సిడెంట్లు విశృంఖల కణాల దుష్ప్రభావాల బారిన పడకుండా చూస్తాయి.
11. క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయి. బెండకాయలో నీటిలో కరగని పీచు కూడా కొద్దిమొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణకోశ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలాశయ క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తుంది.


కావలసిన పదార్ధాలు–

బెండకాయలు – 1/2 కిలో

పచ్చిమిర్చ్చి–— 4
5
కరివేపాకు — 2 రెమ్మలు

పల్లీలు (వేరు శనగ పలుకులు) —
శనగ పిండి– 2 చెంచాలు

నూనె — 2 చెంచాాలు

ఉప్పు– తగినంత

విధానం
కడిగిన బెండకాయలను చిన్న ముక్కలుగా తరిగి ,
పేపర్ పైన అరగంట సేపు ఆరబెట్టు కోవాలి.
తరువాత, స్టవ్ వెలిగించుకుని ,
మూకుడు పెట్టి, రెండు చెంచాల నూనె వేసుకోవాలి.
నూనె వేడెక్కాక
కరివేపాకు, పచ్చి మిర్చి,
పల్లీలు,
బెండకాయ ముక్కలు ,
వేసి బాగా వేయించాలి. తరువాత ,
ఉప్పు వేసి బాగా కలిపి రెండు నిముషాల తరువాత  ,
శనగ పిండి
వేసి బాగా కలిపి , కూరను మైక్రో వేవ్ ఓవెన్ లో ఒక్కనిముషం వుంచి తీసుకోవాలి.
ఎంతో రుచికరముగా, కరకరలాడుతూ వుండే “బెండకాయ పల్లి ఫ్రై” రెడీ.

Subha's Kitchen

Friday, 6 May 2016

వంటింటి చిట్కాలు 31-40

                                             
                                                    వంటింటి చిట్కాలు 31-40

1. అన్నము తెల్లగా ఉండా లంటే బియ్యము కడిగే టప్పుడు అందులో కొద్దిగా నిమ్మ రసము పిండాలి

2. గుండ్రము గా లావుగా వుండే చేమ దుంపలు దురద ఉండదు

3. బత్తాయి ,కమలాలు వంటివి టిస్యు పేపర్  లో చుట్టి ఫ్రిడ్జ్ లో ఉంచితే ఎక్కువ కాలము నిలవ ఉంటాయి

4. కాగిన పాల మీద చిల్లుల పళ్ళెము మూత పెడితే మీగడ చక్కగా పేరుకుంటుంది

5. దోశల పిండి రుబ్బే టప్పుడు ఒక కప్పు సగ్గు బియ్యము వేసి రుబ్బితే అట్లు విరగ కుండా పల్చగా వస్తాయి

6. సేమ్యా ని ఉడికించే  టప్పుడు 2,3 చుక్కల నిమ్మ రసము పిండితే అంటుకుని ముద్దలా మారవు

7. కాకరకాయ ముక్కలను బియ్యము కడుగు నీళ్ళలో ఒక గంట ఉంచితే చేదు తగ్గుతుంది

8. రుచికి పచ్చి మిరపకాయలు శ్రేష్టము

9. ఆరోగ్యానికి ఎండు మిరపకాయలు శ్రేష్టము

10. డైనింగ్ టేబుల్ మధ్యలో పుదినా ఆకులు ఉంచితే ఆ వాసనకు ఈగలు,దోమలు చేరవు

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

ఓం దుర్గాదేవి నమోనమః


                                                              ఓం దుర్గాదేవి నమోనమః

1::ఓమ్ శ్రీమాతా బాలత్రిపురసుందరీ నమోనమః
2::ఓమ్ శ్రీమాతా గాయత్రీదేవి నమోనమః
3::ఓమ్ శ్రీమాతా అన్నపూర్ణేశ్వరీ నమోనమః
4::ఓమ్ శ్రీమాతా లలితాదేవి నమోనమః
5::ఓమ్ శ్రీమాతా లక్ష్మీదేవి నమోనమః
6::ఓమ్ శ్రీమాతా సరస్వతీదేవి నమోనమః
7::ఓమ్ శ్రీమాతా దుర్గాదేవి నమోనమః
8::ఓమ్ శ్రీమాతా మహిషాసురమర్ధిని నమోనమః
9::ఓమ్ శ్రీమాతా రాజరాజేశ్వరీ నమోనమః
10:ఓమ్ శ్రీమాతా చండికాదేవి నమోనమః
11:ఓమ్ శ్రీమాతా కాళికాదేవి నమోనమః
12:ఓమ్ శ్రీమాతా ప్రళయబంధినీ దుర్గ నమోనమః
13:ఓమ్ శ్రీమాతా చాముండేశ్వరీదేవి నమోనమః
14:ఓమ్ శ్రీమాతా పరాశక్తి దేవీ నమోనమః
15:ఓమ్ శ్రీమాతా సర్వదేవతా స్వరూపిణి నమోనమః
16:ఓమ్ శ్రీమాతా విజయేశ్వరీదేవి నమోనమః
17:ఓమ్ శ్రీమాతా విశాలాక్షీ నమోనమః    
18:ఓమ్ శ్రీమాతా అన్నాదేవి నమోనమః
19:ఓమ్ శ్రీమాతా పార్వతిదేవి నమోనమః
20:ఓమ్ శ్రీమాతా శూలినై నమోనమః
21:ఓమ్ శ్రీమాతా మూకాంబికే నమోనమః
22:ఓమ్ శ్రీమాతా సతీదేవి నమోనమః
23:ఓమ్ శ్రీమాతా పద్మవతిదేవి నమోనమః
24:ఓమ్ శ్రీమాతా అంబికాదేవి నమోనమః
25:ఓమ్ శ్రీమాతా పరమేశ్వరీదేవి నమోనమః
26:ఓమ్ శ్రీమాతా మహాగౌరీదేవి నమోనమః
27:ఓమ్ శ్రీమాతా భైరవిదేవి నమోనమః
28:ఓమ్ శ్రీమాతా రుద్రప్రియదేవి నమోనమః

శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం

     
                                                   
                                                                   శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం

జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతిప్రియే /
జయ మాత ర్మహలక్ష్మి సంసారార్ణవ తారిణీ //

మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ /
హరిప్రియే నమస్తుభ్యం దయానిధే //

పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే /
సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదాకురు //

జగన్నాత ర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే /
దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోస్తుతే //

నమః క్షీరార్ణవసుతే నమ స్తైలోక్యధారిణీ /
వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతమ్ //

రక్ష త్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే /
దరిద్రం త్రామిహం లక్ష్మీ కృపాం కురు మయోపరి //

సమస్త్రైలోక్య జననీ నమ స్తుభ్యం జగద్దితే /
అర్తిహంత్రి నమ స్తుభ్యం సమృద్దిం కురు మే సదా //

అబ్జవాసే నమ స్తుభ్యం చపలాయై నమో నమః /
చంచలాయై నమ స్తుభ్యం లలితాయై నమో నమః //

నమః ప్రద్యుమ్న జననీ మాతస్తుభ్యం నమో నమః /
పరిపాలయ మాం మాతః మాం తుభ్యం శరణాగతమ్ //

శరణ్యే త్వాం ప్రసన్నో 2 స్మి కమలే కమలాలయే /
త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే //

పాండిత్యం శోభతే నైవ నశోభంతి గుణా కరే /
శీలత్వం నైవ శోభతే మహాలక్ష్మీ త్వయా వినా //

తావ ద్విరాజతే రూపం తావ చ్చీలం విరాజతే /
తావద్గుణా నరణాం చ యావ ల్లక్ష్మీః ప్రసీదతి //

లక్ష్మిత్వయాలంకృత మానవా యే /
పాపై ర్విముక్తా నృపలోక మాన్యాః //

గుణై ర్విహీనా గుణినో భవంతి /
దుశ్శీలనః శీలవతాం పఠిష్టః //

లక్ష్మీ ర్భూషయతే రూపం లక్ష్మీ ర్భూషయతే కులమ్ /
లక్ష్మీ ర్భూషయతే విద్యాం సర్వా లక్ష్మీ ర్విశిష్యతే //

లక్ష్మీ త్వద్గుణ కీర్తనేన కమలా భూర్గ్యాత్యలం జిహ్మాతాం /
రుద్రాద్యా రవిచంద్ర దేవపతయా వక్తుంచ నైవ క్ష్మాః /
అస్మాభి స్తవ రూప లక్షణ గుణాన్వక్తుం కథం శకృతే /
మాత ర్మాం పరిపాహి విశ్వజననీ కృత్వా మహేష్టం ధ్రువమ్ //

దీనార్తి భీతం భ్వతాప పీడితాం ధనై ర్విహీనం తవ పార్శ్వ మాగతమ్ /
కృపానిధిత్వా న్మను లక్Sమి నత్వరం ధనప్రదానాద్దననాయకం కురు //

మాం విలోక్య జననీ హరిప్రియే నిర్దనం తవ సమీప మాగతమ్ /
దేహి మే ఝుడతి లక్ష్మీ కరాంబుజం వస్త్ర కాంచన వరాన్న మద్బుతమ్ //

త్వమేవ జననీ లక్ష్మీ పితా లక్ష్మీ త్వమేవ చ /
భ్రాతా త్వం చ సభా లక్ష్మీ విద్యా లక్ష్మీ త్వమేవచ //

త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి /
త్రాహి త్రాహి జగన్మాతః దారిద్ర్యా త్యాపి వేగతః //

నమస్తుభ్యం జగద్దాత్రి నమ స్తుభ్యం నమో నమః /
ధర్మాధారే నమ స్తుభ్యం నమ సాంపత్తి దాయినీ //

దారిద్ర్యార్ణవ మగ్నో - హం నిమగ్నో -హం రసాతలే /
మజ్జంతం మాం కరే ధృత్వా తూద్దర త్వం రమే ద్రుతమ్ //

కిం లక్ష్మి బహునోక్తేన జల్పితేన పునః పునః /
అనన్యే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే //

ఏత చ్చ్రుత్వాగస్థ్యైవాక్యం హృష్యమాణా హరిప్రియా /
ఉవా చ మధురాం వాణీం తుష్టాహం తవ సర్వదా //

య త్త్వ యోక్త మిదం స్తోత్రం యః పఠిష్యతి మానవః /
శృణోతి చ మహాభాగః తస్యాహం పశవర్తినీ //

నిత్యం పఠతి యో భక్త్యా త్వలక్ష్మీ స్తస్య నశ్యతి /
ఋణం చ నశ్యతే తీవ్రం వియోగం నైవ పశ్యతి //

యః పఠే త్ప్రాత రుత్థాయ శ్రద్దా భక్తి సమన్వితః /
గృహే త్స్య సదా తుష్టా నిత్యం శ్రీః పతినా సహ //

పుత్త్రవాన్ గుణవాన్ శ్రేష్ఠో భోగభక్తా చ మానవః /
ఇదం స్తోత్రం మహా పుణ్యం లక్ష్మ్యాగస్థ్య ప్రకీర్తితమ్ /

విష్ణు ప్రసాద జననం చతుర్వర్గ ఫలప్రదమ్ //

రాజద్వారే జయశ్చైవ శత్రో పరాజయః /
భూత ప్రేత పిశాచినాం వ్యాఘ్రాణాం న భయం తథా //

న శస్త్రానల తోయౌఘా ద్బయం తస్య ప్రజాయతే /
దుర్వృత్తానాం చ పాపానం బహు హానికరం పరమ్ //

మందురా కరిశలాసు గవాం గోష్ఠే సమాహితః /
పఠే త్తద్దోష శాంత్యర్థం మహా పాతక నాశనమ్ //

సర్వ సౌఖ్యకరం నౄణా మాయు రారోగ్యదం తథా /
అగస్త్య మునిన ప్రోక్తం ప్రజానాం హిత కామ్యయా //

Thursday, 5 May 2016

వంటింటి చిట్కాలు 20-30

                               
                 

 వంటింటి చిట్కాలు 20-30


1. ఏ పదార్థము ఐన ఎక్కువ గా ఉడికితే C  విటమిన్ విరిగిపోతుంది 

2. ఉడుకుతున్న కేబేజీ లో ఒక  బ్రెడ్ ముక్క వెస్తే దుర్వాసన పోతుంది 

3. కాలి ఫ్లవర్ కూరలో కాసిని పాలు పోసి ఉడికిస్తే కుర తెల్ల గానూ రుచి గాను ఉంటుంది 

4. వేపుడు కుర్ల ను దింపే ముందు కొంచెం చెనగ పిండి జల్లితే ముక్కలు విడివిడి గా క్రిస్పి గా వస్తాయి 

5. అప్పడాలు కాల్చే ముందు వాటికీ రెండు ప్రక్కలా నెయ్యి రాస్తే నూని లో వేయించిన
    అప్పడాలులా ఉంటాయి 

6. ఏవైనా పచ్చి పదార్ధాలు తింటే కొంచెం బెల్లము ముక్క తినాలి 

7. జామ తినగానే కాస్త ఉప్పు, జీలకర్ర చప్పరించాలి 

8. ఖర్జూరాలు తింటే వెంటనే వేడి నీళ్ళు తాగాలి 

9. పులుసు లో కాస్త వరిపిండి వేయక పొతే అది పుల్ల నీళ్ళు లా తయారు అవుతుంది 

10. దోశల కోసం పిండి రుబ్బే టప్పుడు , కాసిని మెంతులు వేస్తె దోశలు సువాసన భరితము గానూ 

       మరియు  మెత్తగాను ఉంటాయి

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

ఉల్లి పాయ పులుసు "

           
                                     
                                                               "   ఉల్లి పాయ పులుసు "

కావలిసిన పదార్థాలు

1. ఉల్లి పాయలు  4
2. టమాటో 1
3. బెండకాయ లు 2
4. వంకాయ 1
5. పచ్చి మిరపకాయలు 2
6. కరివే పాకు
8.  వెల్లుల్లి 2 రెబ్బలు
9. ఆవాలు పావు స్పూన్
10. మెంతులు పావు  స్పూన్
11.  జీలకర్ర పావు స్పూన్
12.  ఎండు మిరపకాయలు 2
13. ఇంగువ కొద్దిగా
14.   చింత పండు నిమ్మ  కాయంత
15.  బెల్లము కొద్దిగా

తయారీ విధానము
చింత పండు ను ఒక గిన్నేలో  నీళ్ళూ పోసి నానబెట్టుకోవాలి ,
స్టవ్ వెలిగించుకుని  బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ,
పైన  చెప్పిన పోపు దినుసులను వేసి వేగాక,
ఉల్లి , టమాటో , వంకాయ  , బెండకాయ ముక్కలను ,
వెల్లుల్లి రెబ్బలను వేసి  దోరగా  వేగనివ్వాలి .
ఇప్పుడు నానబెట్టిన  చింతపండు ను ,
నానబెట్టిన  నీళ్ళలో  నుండి పిప్పిని తీసి వేసి ,
 వేగిన ఉల్లిపాయ మిశ్రమాని వేసి ,
పసుపు  , ఉప్పు,   బెల్లము సరిపడునంతగా  వేసి స్టవ్  మీద పెట్టాలి ,
ఒక 5 నిమిషాలు  మరిగాక,
ఒక 2స్పూన్స  వరి పిండిని  చిన్న కప్పులోకి తీసుకుని
నీళ్ళు పోసి ఉండలు లేకుండా  కలుపుకుని  ,
దానిని స్టవ్ మీద  మరుగుతున్న  పులుసులో
కలిపుకుని  కొంత సేపు  మరగనివ్వాలి ,
15 నిమిషాలు  మరిగాక స్టవ్  ఆఫ్  చేస్తే
ఉల్లిపాయ పులుసు రెడీ  .
దీనిని  ,
కందపొడి , కంది పచ్చడి  లేక పాటోలి తో తింటే బాగుంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi











Wednesday, 4 May 2016

వంటింటి చిట్కాలు 11-20

                                                   



                                                        వంటింటి చిట్కాలు 11-20


11. దుంప కూరలలో అల్లం వాడడము వలన సులువు గా జీర్ణము అవుతాయి

12. అరటి పువ్వుకు పసుపు వేసి దంచితే కమిలి నల్లబడకుండా ఉంటుంది

13. కారెట్ ,గుమ్మడి బంగాళదుంప లను తోక్కతోనే వండాలి లేకపోతె " విటమిన్స్"  పోతాయి

14. కాబేజీ ,కాలి ఫ్లవర్ ఉడికించేటప్పుడు టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తె వాటినించి వచ్చే
      దుర్వాసనలు పోతాయి

15. బంగాళదుంప లు  మెత్తబడితే తరిగే ముందు 40 నిమిషాలు పాటు ఫ్రిడ్జ్ లో గాని ఐస్ నీళ్ళలో
      గానీ ఉంచితే గట్టిబడతాయి

16. వంకాయలు వడలి పొతే 2-3గంటల పాటు చల్లని నీళ్ళలో ఉంచితే తాజా గా మారతాయి

17. వంకాయ ముక్కలని బియ్యపు నీళ్ళలో కి తరిగితే నల్ల బడకుండా , కసరు ఎక్కకుండా ఉంటాయి

18. ఉడుకుతున్న వంకాయల్లో కి కాసిని పాలు ,చిటెకెడు పసుపు వేస్తె కసరు ఎక్కకుండా ఉంటాయి

19. ముత పెట్టకుండా ఉడికించే పదార్ధాలలో  A  విటమిన్ పోతుంది

20. నీళ్ళు ఎక్కువ పోసి  ఉడికించితె  B  విటమిన్ పోతుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi



వంటింటి చిట్కాలు 1-10

                                                       

 వంటింటి చిట్కాలు

1. కాయ కూరలలొ  ఇంగువ వాడడము వలన సువాసనగా ఉంటాయి 


2. ఆకు కూ రలలో చెంచాడు షుగర్ వేయడము వలన రుచి వస్తుంది 


3. ఉల్లి ముక్కల మిద కాస్త షుగర్ చల్లితే త్వరగా వేగుతాయి 


4. కుర వేడిగా ఉండగా ఆవ పెడితే చేదు వస్తుంది 


5. ఆవ పెట్టాక కుర మిద మూత పెట్టక పొతే ఆ ఘాటు పోతుంది 


6. కూరగాయల తొక్కలని  పీలర్ తో తీస్తే పోషక పదార్ధాలు పోవు 


7. ఉల్లి పాయాలని నీళ్ళ లో వేసి తరువాత తరిగితే కళ్ళ మంటలు ,కళ్ళలో నీళ్ళు కారడము ఉండదు 


8. కంద పెండలము వంటివి తరిగే టప్పుడు ,చింత పండు నీళ్ళలో చేయి తడుపుకుంటే చేతులు 

     దురద ఎక్కవు 


9. చేతులకు కాస్త పసుపు పట్టించు కుంటే పనస కాయ తరిగినప్పుడు చేతులకు పీచు జిడ్డు అంటుకోవు 


10. కాకర ముక్కల మిద కొంచెము ఉప్పు జల్లి కుదిపితే చేదు తగ్గుతుంది,

      కాని కాకరకాయ చేదు గా తింటేనే ఆరోగ్యము

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi