బీట్ రూట్ పచ్చి బాటనీ కొబ్బరి కోరు కూర
కావలిసిన పదార్థాలు
1. బీట్ రూట్ పావు కేజీ
2. కొబ్బరికోరు ఒక చిన్న కప్పు
3. పచ్చిబతానీలు ఒక చిన్న కప్పుడు
4. పచ్చిమిర్చి
5. 3కరివేపాకు కొద్దిగా
6. గార్నిష్ కు కొద్దిగా కొత్తిమీర
పోపు దినుసులు ::సెనగపప్పు 1 స్పూన్
మినపప్పు 1 స్పూన్
ఆవాలు అర స్పూన్
జీలకర్ర అరస్పూన్
ఎండు మిరపకాయలు 2
తయారీ విధానం
ముందుగా బీట్ రూట్ మరియు పచ్చి బటానీలను
శుభ్రంగా కడుగుకోవాలి
బీట్ రూట్ పైన వున్నా తొక్క తీసి
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
కట్ చేసుకున్న బీట్ రూట్ ముక్కలను
పచ్చి బటానీలను ఒక గిన్నె లోకి తీసుకుని
సరిపడినంత ఉప్పు వేసుకుని
2 గ్లాసులు నీళ్ళు పోసి
కుక్కరు లో పెట్టి ఉడికించి చల్లారబెట్టుకోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి
అది వేడెక్కాక పైన చెప్పిన
సెనగపప్పు, మినపప్పు , ఆవాలు , జీలకర్ర ,
ఎండుమిరపకాయ ముక్కలు వేసి అవి దోరగా వేగిన తరువాత
కరివేపాకు , కొబ్బరికోరులను వేసి అవి కూడా వేగాక
ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు
పచ్చిబటా నీలను వేసి కాసేపు మగ్గనివ్వాలి
కూర అంతా పొడిగా అయ్యాక
స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
ఘుమ ఘుమ లాడే బీట్ రూట్ పచ్చి బటానీ కొబ్బరి కోరు కూర రెడీ
దీనిని వేడి అన్నం లోను చపాతీలలోకి బాగుంటుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi