Saturday 18 June 2016

చక్కెర పొంగలి

                                                                 


కావలసిన పదార్థాలు
1.  బియ్యం 1 గ్లాసు
2. పెసరపప్పు అర గ్లాసు
3.  పంచదార  1 గ్లాసు
4. ఏలకులపొడి కొద్దిగా
5. కిస్మిస్ 10 పలుకులు
6. జీడిపప్పు 10 పలుకులు
7. కొబ్బరి ముక్కలు ఒక చిన్న కప్పు
8.  నెయ్యి ఒక చిన్న కప్పు
9. చిక్కని పాలు ఒక కప్పు

తయారీ విధానం
ముందుగా బియ్యం , పెసరపప్పు  శుభ్రంగా కడుక్కుని
మూడు  గ్లాసులు నీళ్ళు పోసుకుని
కుక్కరులోపెట్టి ఉడికించుకోవాలి
కుక్కరు విజిల్స్ 5 రానివ్వాలి
స్టవ్ మీద బాణలి పెట్టి 5 స్పూన్స్ నెయ్యి వేసి
కిస్మిస్,  జీడిపప్పు పలుకులు , కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేపుకోవాలి.
స్టవ్ పైన వేరే బాణలి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసి ,
ముందుగా  ఉడీకించుకున్న పెసరపప్పు , అన్నాన్ని ,
చిక్కని పాలు ని  మరియు  పంచదారను ఈ బాణలిలో వేసి ,
కొద్దిగా ఉడకనిచ్చి న తరువాత,
 కొద్దిగా  ఇలాచీ ( ఏలకులు ) పొడి,
ముందుగా వేపుకుని పెట్టుకున్న కిస్మిస్ ,
జీడిపప్పుపలుకులు కొబ్బరి ముక్కలను వేసి ,
బాగా కలిపి ,
మిగిలిన నెయ్యి ని కూడా వేసి ,
కలిపి దగ్గర పడేంత వరకు వుంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి .
ఘుమ ఘుమ లాడే చక్కెర  పొంగలి రెడీ.

* దీనిలో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే పొంగలి అంత రుచిగా వుంటుంది

** బియ్యం లోనీళ్ళ కొలత గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు పోసుకోవాలి
    ఇక్కడ పప్పు బియ్యం కలిపి ఒకటిన్నర గ్లాసులు కాబట్టి
    మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi