చిక్కుడుకాయ బెల్లం కూర
కావలిసిన పదార్థాలు
1. చిక్కుడుకాయలు పావుకేజీ
2. బెల్లం ఒక చిన్న కప్పు
3. కరివేపాకు
4. వరి పిండి 1 స్పూన్
పోపు దినుసులు
సెనగపప్పు 1 స్పూన్
మినపప్పు 1 స్పూన్
ఆవాలు అర స్పూన్
జీలకర్ర అర స్పూన్
ఎండు మిరపకాయలు 2
ఉప్పు రుచికి సరిపడ
పసుపు కొద్దిగా
తయారీవిధానం
ముందుగా చిక్కుడు కాయలను శుభ్రంగా కడిగి
ఈనెలు తీసుకుని రెండు ముక్కలుగా చేసుకుని
కుక్కరులో పెట్టి ఉడికించుకోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టి 3స్పూన్స్ ఆయిల్ వేసుకుని
పైన చెప్పిన సెనగ పప్పు , మినపప్పు , ఆవాలు , జీల కర్ర ,
ఎండు మిరపకాయలను వేసి అవి వేగాక
ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు
పసుపు , సరిపడినంత ఉప్పు,
బెల్లం , వరిపిండి , కరివేపాకులను వేసి
బాగా కలిపి
బెల్లం అంతా ముక్కలకు పట్టేంత వరకు మగ్గనివాలి .
నీరంతా పోయి కూర దగ్గర పడ్డాక
స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఘుమ ఘుమ లాడే చిక్కుడు కాయ బెల్లం కూర రెడీ
చిక్కుడు గింజలు కొంచెం ఎక్కువగా ఉంటే చాల బాగుంటుంది .
దీనిని వేడి వేడి అన్నం లో తింటే ఎంతో రుచిగా వుంటుంది
Subha's Kitchen