చన మసాలా కర్రీ
కావలసిన పదార్థాలు
1. కాబులీ సెనగలు 1 ప్యాకెట్
2. టమాటోలు 3
3. ఉల్లిపాయలు 5
4. పచ్చిమిర్చి 3
5. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్
6. చనా మసాలా పొడి 2 స్పూన్స్
7. కారం 1 స్పూన్
8. పసుపు
9. ఉప్పు
10. పెరుగు 2 స్పూన్స్
11. కొత్తిమీర
12. పల్లీలు 2స్పూన్స్
13. జీడిపప్పు 2 స్పూన్స్
తయారీ విధానం
కాబులీ సెనగలను ఒక రోజు ముందుగా నీళ్ళలో నానబెట్టుకోవాలి .
అంటే ఇవాళ కూర చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి .
ముందు రోజు నానబెట్టిన వీటినిశుభ్రం గా కడిగి
కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకుని కుక్కరులో పెట్టి ఉడికించాలి
కుక్కరు విజిల్స్ 10 లేక 11 విజిల్స్ రానివ్వాలి
దీనివలన సెనగలు మెత్తగా ఉడుకుతాయి .
టమాటో లని 3 వుల్లిపాయలని సన్నగా తరుగుకోవాలి
వీటిని స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 2స్పూన్స్ ఆయిల్ మగ్గ బెట్టుకోవాలి
ఇవి చల్లారాక మెత్తగా పేస్టు లాగ గ్రైండ్ చేసుకోవాలి
పల్లీలను జీడిపప్పులను దోరగా వేపుకుని మెత్తని పొడి లాగ గ్రైండ్ చేసుకోవాలి
2 ఉల్లిపాయలను సన్నగా తరుగుకోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టుకుని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని
అల్లం వెల్లుల్లి పేస్టు వేసి అది పచ్చి వాసన పోయే దాక వేయించి
సన్నగా తరుగు కున్న ఉల్లి పాయముక్కలను కూడా వేసి
అవి దోరగా వేగిన తరువాత
గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఉల్లి మిశ్రమాన్ని వేసి
అది పచ్చి వాసన పోయే దాక మగ్గిన తరువాత
ముందుగా ఉడికించి పెట్టుకున్న సెనగలు , పసుపు ,
సరిపడినంత ఉప్పు , కారము చనా మసాలాపొడి వేసి
బాగా కలిపి ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగాఉడకనివ్వాలి
పెరుగు వేసి బాగా కలిపి
పల్లీ జీడిపప్పుపేస్టు ను వేసి బాగా కలిపి
కొంచెం సేపు ఉడకనిచ్చి
కూరఅంతా బాగా దగ్గర పడిన తరువాత
పైన కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
ఘుమఘుమ లాడే చనా మసాలా కర్రీ రెడీ
ఇది పూరీ చపాతి లలోకి బాగుంటుంది
Subha's Kitchen