కొబ్బరి కాయ పచ్చడి
కావలిసిన పదార్థాలు
1. కొబ్బరి కాయ 1
2. పచ్చి మిరపకాయలు 2
3. ఎండు మిరపకాయలు 8
4 సెనగ పప్పు 2స్పూన్స్
5. మినపప్పు 2 స్పూన్స్
6. ఆవాలు 1 స్పూన్
7. ధనియాలు 2స్పూన్స్
8. జీలకర్ర 1స్పూన్
9. ఇంగువ కొంచెం
10. బెల్లం చిన్న ముక్క
11. చింత పండు కొంచెం
12. పసుపు
13. కరివేపాకు
14. ఉప్పు
తయారీ విధానము
ముందుగా స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని
పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోర గా వేపుకోవాలి
ఇవి చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
కొబ్బరి కాయను కొట్టి చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
తరిగిన కొబ్బరి ముక్కలు , పసుపు ,
పచ్చిమిర్చి , చింత పండు , ఉప్పు , బెల్లం , వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
దీంట్లో ముందుగాగ్రైండ్ చేసిపెట్టుకున్న కారము పొడిని వేసి
బాగా కలిసేలా కలుపుకోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి
మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఇంగువ , కరివేపాకు , ఎండు మిరపకాయ , వేసివేపుకోవాలి
దీనిని తయారుచేసుకున్న పచ్చడి మీద వేసుకుంటే
ఘుమఘుమ లాడే కొబ్బరి కాయ పచ్చడి రెడీ
Subh's kitchen