Sunday, 12 June 2016

శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ర్యాలి

     
           

                                                  శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ర్యాలి
                                           శ్రీ మహావిష్ణువు ముందువైపు పురుషరూపంలోనూ ,
                                 వెనుకనుంచి చూస్తే స్త్రీ రూపంలోనూ దర్శనమిచ్చే  ఆలయం ఇది.

      తూర్పు గోదావరి జిల్లాలో రావులపాలెంకి 6 కి. మీ. ల దూరంలో ఆత్రేయపురం మండలంలో కలదు.

             11 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్నిచోళరాజులు పరిపాలిస్తూండేవాళ్ళు. అప్పుడు ఇక్కడంతా
              దట్టమైన అరణ్యాలు వుండేవి. చోళ రాజులలో ఒకరైన రాజా విక్రమదేవుడు ఒకసారి ఈ
               ప్రాంతానికి వేటకు వచ్చాడు. కొంతసేపు వేటాడిన తర్వాత అలసిన రాజు ఒక చెట్టుకింద
             పడుకుని నిద్రపోయాడు. ఆ నిద్రలో మహావిష్ణువు ఆయన కలలో కనబడి, తన విగ్రహం
            ఆ ప్రాంతాల్లో వుందని దానిని తీసి ఆలయ నిర్మాణం చేసి పూజలు జరిపించమని చెప్పాడు.
                  ఆ విగ్రహాన్ని కనుగొనటానికి ఒక చెక్క రధాన్ని ఆ ప్రాంతంలో లాగుకుని వెళ్తుంటే
             ఆ రధశీల ఎక్కడ రాలి పడిపోతుందో ,అక్కడ తవ్విస్తే విగ్రహం కనబడుతుందని చెప్పాడు.
       విక్రమదేవుడు భగవతాదేశాన్ని పాటించి ఈ ప్రాంతంలో విగ్రహాన్ని కనుగొని ఆలయాన్ని కట్టించాడు.

       ప్రకృతి సౌందర్యం మధ్య కొలువైవున్న ఈ ఆలయంలోని స్వామి సౌందర్యం వర్ణనాతీతం. ఐదు
       అడుగుల ఎత్తైన సాలిగ్రామ శిల ఇది. మకరతోరణంమీద దశావతారాలు, నారద, తుంబురులు,
       ఆదిశేషు, పొన్నచెట్టు, గోవర్ధనగిరి, మహర్షులు,

         అన్నీ ఆవిగ్రహం చుట్టూ వున్నాయి. ఆ విగ్రహంయొక్క గోళ్ళు కూడా చాలా సజీవంగా
కనిపిస్తాయి  వెనుకవైపునుంచి చూస్తే పద్మినీజాతి స్త్రీ అలంకరణఇక్కడ స్వామి పాదాల దగ్గర చిన్న .         గుంటలో ఎప్పుడూ నీరు వుంటుంది.ఎన్నిసార్లు తీసినా ఆ నీరు అలాగే వూరుతూ వుంటుంది.
తప్పక దర్శించ వలసిన పుణ్య క్షేత్రము .