Tuesday 21 June 2016

రామేశ్వర దేవాలయం: రామేశ్వరం


                                                           రామేశ్వర దేవాలయం:
                                                                    రామేశ్వరం

దేశంలోని చతుర్ధామాల్లోని మొదటి ధామంగా భావించబడుతుంది.
మొదటిది రామేశ్వరం, రెండవది ద్వారక, మూడవది పూరి జగన్నాధ్,
4వది-బదరీనాధ్ ధామం.
 ప్రతివారూ కనీసం ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించవలె.
మొదటగా కాశీ వెళ్ళి గంగాజలం తెచ్చి రామేశ్వరంలోని శ్రీ రామలింగేశ్వరుని అర్పించితేగాని జన్మసాఫల్యంగాదంటారు.

రామేశ్వర దేవాలయం పురాణకథ  :

రామాయణ కధాకాలంలో కధప్రకారం సీతమ్మవారిని లంకేశుడు చెరబట్టి
తీసికొని వెళ్ళిన తరువాత, అమ్మవారి జాడ కనుగొని లంకాధిపతి రావణుని సంహరించివేశాడు శ్రీరాముల వారు. రావణుడు బ్రాహ్మణుడు.
బ్రాహ్మణుని చంపినాడు గాన బ్రహ్మ హత్యాదోషము అంటింది శ్రీరాములవారికి.
అప్పుడు శివలింగ ప్రతిష్ఠ చేయవలసిందిగా సలహా యిచ్చారు
వెంటనే ప్రియభక్తుడైన వాయుపుత్రుడు హనుమంతుని హిమాలయాల్లోని
కైలాసగిరి యందున్న శివలింగమును తెమ్మని పంపారు.
వాయువేగ, మనోవేగాల్తో వెళ్ళాడు హనుమ. ముహుర్తం దగ్గర పడుతోంది.
హనుమ జాడలేదు. శ్రీరాముల సీతారాములు శివలింగ ప్రతిష్ఠ జరిపారు.
అంతలోనే హనుమ కైలాసగిరి నుండి వచ్చాడు శివలింగముతో. హనుమంతుని చిన్న బుచ్చకుండా అదిగూడా ప్రతిష్టించారు సీతారాములు మొదట హనుమతెచ్చిన లింగము పూజించబడింది. శ్రీరాముల వారిచేత ప్రతిష్టించబడినది, శ్రీరామ లింగేశ్వరుడని పిలుస్తారు శ్రీరామ భక్త హనుమాన్ తెచ్చినది శ్రీ కాశీవిశ్వేశ్వర లింగం.

2 వ ప్రాకారంలో అమ్మవారి దేవాలయం ఉంది. నూతనంగా అనేక విధముల అభివృద్ధి పరచబడింది. ఆలయ గోపురం, గొప్ప నందీశ్వరుని విగ్రహాలు సున్నంతో నిర్మించి రంగులు వేయబడియున్నవి.
3 వ ప్రాకారం:
 4000 అడుగుల పొడవు, 21 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుగలిగి
ఈ చివరినుండి ఆ చివరివరకు కనబడుతూ గాలికొరకు వెంటిలేషన్
ఏర్పాటుతో మండప స్థంభాలన్నీ చిత్రవిచిత్రాలైన శిల్పాలతో పొదిగియున్నది.
 రామలింగ విగ్రహములు, శ్రీ కోదండ రామస్వామి, నటరాజ మందిరం, సేతుమాధవ స్వామి ఆలయం, కోనేరు, ఇతర తీర్దాలు ప్రాకారంలోని విశేషాలు తూర్పువైపున సముద్రం, పడమటి వైపున గోపురాలు ఉన్నాయి.

దేవాలయంలో తీర్ధములు :
మహాలక్ష్మి, సావిత్రి, గాయత్రి, సరస్వతి, మాధవ, గంధమాదన, గవాక్ష, గవయ.
నల, నీల, శంక, శంకర, బ్రహ్మహత్యా విమోచన, సూర్య, చంద్ర, గంగ, యమున, గయ, శివ, సత్యామృత, సర్వతీర్ధము, కోటి తీర్ధము. ఇవి 1,2,3 ప్రాకారాల్లోనే అమరియున్నవి. ఆలయం వెలుపల, పరిసర ప్రదేశాల్లో మరో 21 తీర్ధాలున్నాయి. చాలావరకు గంధమాదన పర్వతానికి వెళ్ళివచ్చే దారిలో ఉన్నాయి.

రామేశ్వర పరిసరాల్లో దర్శించదగిన క్షేత్రాలు:-

గంధమాదన పర్వతము:

రామాయణ యుద్ధకాండంలో దీనికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. హనుమంతుడు లంకకు వెళ్ళటానికి, శ్రీరాములవారు తన వానర సైన్యమును నడిపించినది కూడ ఇక్కడి నుండే. శ్రీరాముల వారు రావణ వధానంతరం లింగప్రతిష్ఠను గూర్చి అలోచించినదిక్కడేనట. .
ఇంకా - ఏకాంత రామేశ్వరాలయం, నంబినాయకి అమ్మన్, సీతాగుండం, విల్లోరినీ తీర్ధము, భైరవతీర్ధం కోదండరాముని కోవెల మొదలగునవి దర్శించతగినవి.

ధనుష్కోటి:
ఇక్కడే రావణుని తమ్ముడు విభీషణుడు శరణుజొచ్చినచోటు. యుద్ధానంతరం వానరులు నిర్మించిన సేతువును పగుల గొట్టారట ఇక్కడ. శ్రీరాములవారు బాణముతో కొట్టగా వంతెన విచ్చిపోయి రత్నాకరము, మహొదధి, రెండున్నూ కలిసిపోయాయట. ధనుస్సుచే పగులగొట్టటంచేత ధనుష్కోటి అనే పేరు సార్ధకమయిందంటారు.