పనస పొట్టు "ఆవ " పెట్టి కూర
కావలిసిన పదార్థాలు
1. పనస పొట్టు 1/4 కేజీ
2. పచ్చి మిరపకాయలు 6
3. అల్లం చిన్న ముక్క
4. కరివేపాకు
5. చింత పండు రసం 2స్పూన్స్
6. ఆవ ముద్ద 1 స్పూను
పోపు దినుసులు
సెనగ పప్పు 2 స్పూన్స్
మినపప్పు 2 స్పూన్స్
ఆవాలు స్పూన్
జీలకర్ర 1స్పూన్
ఇంగువ కొద్దిగా
ఎండుమిరపకాయలు 3
తయారీ విధానము
ముందుగా పనస పొట్టు ని ఒక గ్లాసు నీళ్ళు పోసి
ఉడికించుకుని చల్లార బెట్టుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి
కొద్దిగా పసుపు వేసుకుని
పైన చెప్పిన పోపు దినుసులను వేసి
అవి దోరగా వేగాక
తరిగి పెట్టుకున పచ్చిమిర్చిచీలికలు, అల్లం ముక్కలు ,
కరివేపాకు వేసి అవి కూడా వేగాక
ఉడికించి చల్లార బెట్టుకున్న పనసపొట్టు నికూడా వేసి
కొంచెం సేపు మగ్గనిచ్చి
దాంట్లో చింత పండురసం , సరిపడీ నంత ఉప్పు వేసి
బాగా కలిసేలా కలిపి
తడి పోయేంత వరకు స్టవ్ మంట సిం లో పెట్టి మగ్గనివ్వాలి .
కూర బాగా చల్లారిన తరువాత
ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవముద్ద ను కలపాలి
గుమ్మడి కాయ వడియాలు కానీ ,
లేకపోతే వరిపిండి వడియాలను వేయించి
ఈ కూర లో కలుపుకోవాలి
ఘుమఘుమలాడే పనస పొట్టు కూర రెడీ.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.