" శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం "
అన్నవరం
" సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం.
లీలాయా వితతం విశ్వం యేన తస్మై నమోనమః. "
పంపానదీ తీరంలో " రత్నగిరిపై "
" నిత్య వ్రతాలతో " ,
" స్వామి వారి కళ్యాణముల " తో అలరారుతూ
,కోరిన వరాలనోసగే. " సత్య దేవుని " దివ్య సన్నిధి "
" శ్రీ అన్నవరం సత్యనారాణ దేవాలయం" గా ప్రసిద్ధిచెందింది.
సామూహిక సత్యనారాయణ వ్రతాలు , స్వామివారి కల్యాణములు
అత్యంత వైభవముగా , భక్తీ ,శ్రద్ద లతో, ఇక్కడ ఆచరింపబడతాయి.
వివాహం, గృహప్రవేశ మహొత్సవము సందర్భాలన్నింటికీ
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఒక ముఖ్య భాగంగా ఆచరించుతారు.
చాలామంది భక్తులు ఇక్కడే స్వామీ వారి సన్నిధి లో
వివాహము చేసుకుని ,
వ్రతము ఆచరించి , వెళుతూ ఉంటారు.
పురాణ కధనం :
మేరువు ఇద్దరు కుమారులు
భద్రుడు, రత్నకరుడుగా పేర్కునబడింది.
భద్రుడు పెద్దవాడు. రత్నాకరుడు చిన్నవాడు.
ఇద్దరు కూడా తమ పేరు చిరస్థాయిగా ఉండాలని
తపస్సు చేయ సంకల్పించినవారు.
భద్రుడే - భద్రగిరి, భద్రాచలంగాను,
రత్నాకరుడు - రత్నగిరిగాను శాశ్వతత్వాన్ని సాధించారు.
" ఓం నమో నారాయణాయ ,
హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక పరమేశ్వరీ పరమేశ్వర స్వరూప
ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామినే నమః."
ఇక్కడి స్వామి త్రిపాద్విభూతి మహానారాయణుడు.
నారాయణస్త్రంలో అలంకరించబిడిన వాడై,
ఈశ్వర సహిత
హిరణ్య గర్భాత్మకుడై తనదేవేరి
శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారి సమేతుడై
శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వెలసి
భక్తులకనుగ్రహం ప్రసాదిస్తున్నారు.
ఆలయం రెండతస్తులుగా ఉంటుంది.
ఆగమశాస్త్ర విధిగా క్రింది భాగంలో యంత్ర ప్రతిష్ఠ జరిగింది.
స్వామివారి దివ్య మంగళమూర్తిని రెండవ అంతస్థులో దర్శించగలము.
అన్నవరం కళ్యాణోత్సవాలు :
శ్రీ వారి దివ్య కళ్యాణోత్సవాలు వైశాఖ శుద్ధ దశమీ విశేషోత్సవాలకు తోడు,
ఉగాది, శ్రీరామనవమి, వినాయక చాతుర్థి - గణపతి నవరాత్రోత్సవాలు,
శరన్నవరాత్రులు, సంక్రాంతి, శుద్ధ ఏకాదశి, భీష్మైకాదశి వగయిరా
పర్వదినోత్సవాలు వైభవంగా జరుగుతాయి.
ప్రసాదము
: శ్రీ సత్యనారాయణ స్వామీ వారి ప్రసాదము గా ప్రసిద్ధి చెందిన ,
ఈ ప్రసాదమును స్వీకరించకుండా ఎవరు వెళ్ళరు . చక్కని రుచి తో పాటు ,
ఆత్య ద్భుతమైన , ఆధ్యాత్మిక అనుభునితిని కుడా , ప్రసాదిస్తుంది .
ప్రతి నిత్యమూ జరిగే అర్చనలు, పూజలు, భక్తుల నిత్య కళ్యాణం పచ్చ తోరణం
ఈ స్వామి వారి దివ్య సన్నిధి .
తప్పక దర్శించ వలిసిన పుణ్య క్షేత్రము .