కరకరలాడే బంగాళ దుంపల వేపుడు
కావలసిన పదార్థాలు
1. బంగాళ దుంపలు పావుకేజీ
2. ఆయిల్ 7 స్పూన్స్
3. ఉప్పు రుచికి సరిపడ
4. కారము రుచికి సరిపడ
5. సెనగపిండి 2 స్పూన్స్
తయారీ విధానము
ముందుగా బంగాళ దుంపలను శుభ్రంగా కడిగి
పైన వున్న తొక్క తీసి
చిన్న ముక్కలుగా కట్ చేసుకుని
ఉడికింఛి చల్లారబెట్టుకోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి
వేడెక్కాక ఉడికించి చల్లారబెట్టుకున్న
బంగాళదుంప ముక్కలను వేసి బాగా వేగనివ్వాలి
మధ్య మధ్య లో ఆయిల్ వేసి , అట్లకాడతో కలుపుతూ ఉండాలి
ఈముక్కలు దోరగా వేగాక
2 స్పూన్స్ సెనగపిండిని వేసి
(సెనగపిండిని వేయడము వలన ముక్కలు విడివిడి గా ,
పొడిగా ఉండి క్రిస్పి గా వేగుతాయి )
కాసేపు వేగనిచ్చిన తరువాత
సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి,
కారము వేసి బాగాకలిపి
కొద్దిసేపు స్టవ్ మీద వుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
కరకరలాడే బంగాలదుంపల వేపుడు రెడీ
Subh's Kitchen