నాన్నా//HAPPY FATHER'S DAY
నాన్నా,
నా దరహాసమే నీ ఉల్లాసమై ,
నా నవ్వులే నీ దరహాసమై ,
నా అల్లరే నీ ఆనందమై,
అడుగు నాదై (నా) ఆత్రుత నీదై ,
నీ అడుగులో నా అడుగు వేసి,
నా విజయం లో తొలి అడుగు నీవై,
నువ్వోడి నను గెలిపించి ,
నా విజయ నేత్రాల మెరుపులు,
నీ నేత్రాల ఆనంద భాష్పాలై,
సంతోషాలు కురిపించగా,
నను మురిపించి,
నను నడిపించి,
నా ఆశల పల్లకీ బోయీ వై ,
నా ప్రగతికి మార్గదర్శకుడివై,
హితుడివై,
స్నేహితుడివై ,
నా జీవితానికి దేవుడిచ్చిన వరమై,
వేయి వసంతాల వెన్నెల చల్లదనంలో,
శతకోటి మల్లెల పరిమళాల మనసుతో,
నువ్వే కావాలి
ప్రతి జన్మ లో నా " నాన్న " గా