విజయము సాధించే వారి లక్షణాలు
1. ఈ ప్రపంచములో గెలుపు సాధించిన వ్యక్తి నే సంఘము గుర్తించి గౌరవిస్తుంది
2. గెలుపు సాధించాలి అంటే ఎన్నో కష్టాలను ఎదురుకోవాలి
3. విజయము సాధించిన వ్యక్తులను గమనిస్తే ,వారికీ ఓకే గమ్యము ఉంటుంది .వారి పనులన్నీ
గమ్యము వైపే సాగుతాయి
4. వారిపై వారికి అంతులేని నమ్మకము ఉంటుంది
5. ఓక లక్ష్యమును నిర్దేశించు కున్న తరువాత అటు ఇటు జారి పోకుండా దాన్ని పూర్తి
చేయడానికి ప్రయత్నిస్తారు
6. ప్రారంభము నుంచే గొప్ప ఫలితాలని ఆశించరు
7. ప్రారంభము లో ఏ అంకిత భావము తో ఉన్నారో విజయాలు అందుకుంటూ కూడా అదే అంకిత
భావము తో పని చేస్తారు
8. లక్ష్యమును చేరుకొనే వరకు చిన్ని చిన్ని ఆనందాలు ను కోల్పోయినా అందుకు బాధపడరు
9. ఎన్ని ఒడిదుడుకులు వచ్చి నా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోరు
10. నిరంతరమూ కృషి పట్టుదల తో వారు అదృష్టాన్ని శాసించే స్థాయి కి ఎదగ గలిగారు
11. నాయకత్వము వహించే శక్తి ,పటిష్టమైన మానవ సంభందాలు నిర్మించుకొనే శక్తి వారి సొంతము.