కేరట్టు కొబ్బరి కోరు కూర
కావలసిన పదార్థాలు :
1. కేరట్లు పావు కేజీ
2. కొబ్బరి కోరు ఒక కప్పు
3 పచ్చిమిర్చి 4 .
4. కరివేపాకు
పోపు దినుసులు
సెనగ పప్పు 1 స్పూన్
మినపప్పు 1 స్పూన్
ఆవాలు అరస్పూన్
జీలకర్ర అరస్పూన్
ఎండు మిరపకాయలు 2
తయారీవిధానం
ముందుగా కేరట్లను బాగా కడిగి
చిన్న ముక్కలుగా తరిగి
కుక్కరులో పెట్టి ఉడికించుకుని
చల్లారబెట్టుకోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసి
పైన చెప్పిన సెనగ పప్పు, మినపప్పు ,
ఆవాలు , జీలకర్ర , ఎండు మిరపకాయలను ,
వేసి అవి దోరగా వేగాక
తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు , కరివేపాకు వేసి
అవి వేగాక కొబ్బరికోరును కూడా వేసి
అదికూడా దోరగా వేగినతరువాత
ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న కేరట్టు ముక్కలను. కుడా వేసి
కాసేపు మగ్గనిచ్చి సరిపడినంత ఉప్పు వేసి
కూర అంతా కలిసేలా కలుపుకుని
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
కేరట్టు కొబ్బరి కోరు కూర రెడీ
Subha's Kitchen