Thursday, 9 June 2016

ఇంద్రకీలాద్రి) శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం.


                                  ఇంద్రకీలాద్రి) శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం.

      విజయవాడ లో ,ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గ అమ్మ వారి  దేవాలయము ,
                  భక్తుల పాలిట  కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఈ అమ్మ వారి ఆలయము
                                   దర్శించి తీరవలిసిన మహిమాన్వితమైన పుణ్య  క్షేత్రము .

" అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ,
చాల పె ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ,
తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ,
దుర్గ మా యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్"

ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత
కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారం 'బెజవాడ కనకదుర్గఅమ్మ"

ఈ గుడి క్షేత్ర పాలకుడు.. ఆంజనేయస్వామి.
అందుకే ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా హనుమను దర్శించుకొని..
ఆపై అమ్మవారిని..
మల్లేశ్వరస్వామివారిని దర్శించుకుని.. ఆశీస్సులు పొందుతుంటారు.

స్థలపురాణం:
మహిషాసురుడిని సంహరించిన అనంతరం
ఇంద్రాది దేవతల కోరికపై , పరమ పవిత్రమైన " ఇంద్రకీలాద్రి " మీద మహామహిమాన్వితమైన
మహిషాసుర మర్దిని రూపంలోనే స్వయంభువుగా వెలిసింది.
 ఉగ్ర స్వరూపిణిగా ఉన్న అమ్మవారిని ,
శంకరాచార్యులు దర్శించుకుని
శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చారని స్థలపురాణంలో ఉంది.

ఉపాలయాలు:
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంతో పాటు
మల్లేశ్వరాలయం,
క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం,
సుబ్రహ్మణ్యేశ్వరాలయం,
నటరాజస్వామి ఆలయం ఉన్నాయి.
అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను సందర్శించి భక్తితో పూజలు చేస్తారు.