బంగాళదుంప వుల్లిముద్ద కూర
కావలిసిన పదార్థాలు
1. బంగాళ దుంపలు పావుకేజీ
2. ఉల్లిపాయలు 2
3. ఎండుమిరపకాయలు 5
4. ధనియాలు 2 స్పూన్స్
5. జీలకర్ర 1 స్పూన్
6. వెల్లుల్లి రెబ్బలు 3
7. ఉప్పు
8. కరివేపాకు
9. సెనగపప్పు అర స్పూన్
10. మినపప్పు కొద్దిగా
11. జీలకర్ర కొద్దిగా
12. ఆవాలు కొద్దిగా
తయారీ విధానము
బంగాళ దుంపలను తోక్కతీయకుండా
నాలుగు ముక్కలు గా చేసుకుని , కుక్కరు లో పెట్టి ,
ఉడికించు కోవాలి . ఇవి చల్లారాక, పైన ఉన్న తొక్క తీసుకోవాలి
పైన చెప్పిన ఎండుమిరపకాయలు , ధనియాలు ,
ఉల్లిపాయలు , వెల్లుల్లి, జీలకర్ర , ఉప్పు ,
వేసుకుని మెత్తగా ముద్దలా గ్రైండ్ చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని
పైన చెప్పిన పోపు దినుసులను వేసి అవి వేగాక
ముందుగా తయారు చేసి పెట్టుకున్నఉల్లి ముద్దను వేసి ,
అది పచ్చి వాసనపోయే దాక దోరగా వేపుకుని ,
అది ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని,
ముందుగా ఉడికించి తొక్క తీసి పెట్టుకున్న,
బంగాళ దుమ్పముక్కలను వేసి దోరగా వేపుకోవాలి ,
ఈ ముక్కలు దోరగా వేగాక
ముందుగావేయించిన ఉల్లి ముద్దను కూడా వేసి
అంతా కలిసేలా కలిపి కొంచెం సేపు మగ్గనిచ్చి
కొంచెము కొత్తిమీర పైన చల్లుకుంటే
బంగాళ దుంప వుల్లి ముద్ద కూర రెడీ
ఈ కూరను చపాతీ అన్నము మినపదోసే లలో బావుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi