Monday 13 June 2016

దొండ కాయ ,కొబ్బరి కోరు పల్లీ కారంకూర




                                                         దొండ కాయ  కొబ్బరి కోరు పల్లీ కారంకూర

కావలిసిన పదార్థాలు

1.  దొండ కాయలు పావు కేజి
2.  కొబ్బరి కోరు 2 స్పూన్స్
3. పల్లీలు 2 స్పూన్స్
4. ఉప్పు
5. పసుపు

కారమునకు :
1స్పూన్ సెనగ పప్పు
1 స్పూన్ మినపప్పు
1/2 స్పూన్ ఆవాలు
1/2 స్పూన్ జీలకర్ర
1 స్పూన్ ధనియాలు
5 ఎండుమిరపకాయలు

తయారీ విధానము
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి
పైన చెప్పిన సెనగపప్పు , మినపప్పు , ఆవాలు , జీలకర్ర ,
ధనియాలు , ఎండుమిరపకాయలు , వేసి దోరగా వేపుకుని ,
అవి చల్లారాక మెత్తగా పొడిలా గ్రైండ్ చేసుకోవాలి .

దొండకాయలను పొడుగ్గా సన్నగా చీలికలుగా తరుగుకోవాలి .
తరిగిన దొండకాయ చీలికలను ఒక బాణలి లో
4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దోరగా వేపుకోవాలి ,

స్టవ్ పైన వేరే బాణలి పెట్టి
అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి పల్లీలు వేసి
అవి దోరగా వేగాక

 కొబ్బరికోరు , పసుపు , కరివేపాకు , వేసి దోరగా వేపుకుని
ఈ మిశ్రమంలో దోరగా వేపుకున్న దొండకాయ చీలికలువేసి
 కాసేపు వేగనిచ్చి,
 సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి ,

కాసేపు మగ్గనిచ్చి ముందుగా తాయారు చేసి పెట్టుకున్న
కారము పొడిని కూడా వేసి బాగాకలిపి
కొంచెం సేపు వేగనిచ్చి

పైన కొత్తిమీర చల్లి తే
దొండకాయ కొబ్బరికోరు పల్లి కారము కూర రెడీ

Subha's kitchen