Wednesday, 29 June 2016

కొబ్బరి అన్నము ( coconut rice )


                                                       కొబ్బరి అన్నము ( coconut rice )

కావలిసిన పదార్థాలు
1. బియ్యం 4 గ్లాసులు
2. పచ్చిబఠాణీలు ఒక పాకెట్
3. కొబ్బరి కోరు 3కప్పులు
4. అల్లము వెల్లుల్లి పేస్టు 2 స్పూన్స్
5. పచ్చిమిర్చి 6
6.జీడిపప్పు 12 పలుకులు
7. లవంగాలు 4
8. మిరియాలు 4
9. కొత్తిమీర
10. ఉప్పు రుచుకి సరిపడా
11. ఆయిల్ 6 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి
 గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని
కుక్కరులోపెట్టి ఉడికించుకోవాలి.
 ఉడికించుకున్న అన్నాన్ని ఒక ప్లేటులోకి తీసుకుని చల్లార్చుకోవాలి .
పచ్చి బఠానీలను కూడా ఉడికించుకోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగా తరుగుకోవాలి ,
స్టవ్ మీద బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి
పైన చెప్పిన లవంగాలు , మిరియాలు ,
జీడిపప్పులు వేసి అవి దోరగా వేగాక ,
ముందుగా తయారు చేసి పెట్టుకున్న
అల్లం వెల్లుల్లి  అల్లము వెల్లుల్లి పేస్టు   మిశ్రమాన్ని వేసి
అది పచ్చి వాసన పోయేదాకా వేపుకుని,
 పచ్చిమిర్చి చీలికలు , బఠానీలు ,
కొబ్బరి కోరు లను వేసి దోరగా వేగనివ్వాలి
దోరగా వేసిన ఈ మిశ్రమాన్ని ,
ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నం లో వేసి
సరిపడినంత ఉప్పును కూడా వేసి
బాగా కలుపుకోవాలి ,
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
వేడి వేడి ఘుమ ఘుమ లాడే కొబ్బరి అన్నం రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi


Saturday, 25 June 2016

వంకాయ చిక్కుడుకాయ అల్లం పెట్టి కూర


                                                  వంకాయ చిక్కుడుకాయ అల్లం పెట్టి కూర

కావలసిన పదార్థాలు

1. వంకాయలు పావుకేజీ
2. చిక్కుడుకాయలు  100గ్రాములు
3. పచ్చిమిర్చి  4
5. అల్లం చిన్న ముక్క
6. కరివేపాకు కొద్దిగా
7. కొత్తిమీర

పోపు దినుసులు

సెనగపప్పు 1 స్పూన్
మినపప్పు 1 స్పూన్
ఆవాలు అర స్పూన్
జీలకర్ర అర స్పూన్
ఎండుమిరపకాయలు 2
పసుపు కొద్దిగా
వరి పిండి కొద్దిగా
ఉప్పు రుచికి సరిపడ
చింత పండు గుజ్జు కొద్దిగా

తయారీ విధానం

వంకాయలను , చిక్కుడు కాయలను శుభ్రం గా కడుక్కుని
వంకాయలను చిన్నముక్కలుగాను,

చిక్కుడుకాయలను ఈనెలు తీసి రెండు ముక్కలు గాను
తరుగుకుని 1 గ్లాసు నీళ్లు పోసి
కుక్కరులో పెట్టి ఉడికించుకోవాలి

 చల్లారాక ఈ ముక్కలను చిల్లుల పళ్లెం లోవోడెయ్యాలి
అల్లం,  పచ్చిమిర్చి,  కొత్తిమీరలను కలిపి
మెత్తగాగ్రైండ్ చేసుకోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి
 పైన చెప్పిన పోపు దినుసులను వేసి
 అవి దోరగా వేగాక
అల్లం , పచ్చిమిర్చి , కొత్తిమీరపేస్టు , కరివేపాకును వేసి
అవి కూడా వేగాక
ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న
వంకాయ చిక్కుడుకాయ ముక్కలు , పసుపు ,ఉప్పు ,
చింత పండు గుజ్జు ,వరి పిండి ,
వేసి కూర అంతా కలిసేలా కలిపి
నీరంతా పోయేలా కొద్దిసేపు మగ్గనిచ్చి
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
ఘుమ ఘుమ లాడే
వంకాయ చిక్కుడుకాయ  అల్లం పెట్టి కూర రెడీ .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi


దధ్యోజనం


                                                                    దధ్యోజనం

కావలసిన పదార్థాలు

1.  బియ్యం  2 గ్లాసులు
2. కమ్మని పెరుగు 3 కప్పులు
3. ఉప్పు రుచికి సరిపడ
4. పచ్చిమిర్చి  5
5. అల్లం చిన్న ముక్క
6. కరివేపాకు
7.కొత్తిమీర

పోపు దినుసులు
పల్లీలు 2 స్పూన్స్
సెనగపప్పు 1 స్పూన్
మినపప్పు 1 స్పూన్
ఆవాలు అర స్పూన్
జీలకర్ర అర స్పూన్
ఎండుమిరపకాయలు  2
ఇంగువ కొద్దిగా

తయారు విధానం
అల్లం చిన్న ముక్కలు గాను ,
పచ్చిమిర్చిని చీలికలుగాను తరుగుకోవాలి

బియ్యాన్ని శుభ్రం గా కడిగి
గ్లాసుబియ్యానికి  రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని
కుక్కరులో పెట్టి ఉడికించాలి

ఉడికిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని
చల్లారనివ్వాలి

స్టవ్ మీద బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి
ముందుగా పల్లీలను వేసి ,
అవి వేగాక పైన చెప్పిన పోపు దినుసులను వేసి
అవి దోరగా వేగాక పచ్చిమిర్చి చీలికలు ,
అల్లం ముక్కలు ,
కరివేపాకు లను వేసి దోరగా వేగనివ్వాలి

పెరుగును తీసుకుని ఉడికించి చల్లారబెట్టుకున్నఅన్నం లో వేసి
కలుపుకోవాలి

ముందుగా వేపుకుని పెట్టుకున్న పోపు ను
సరిపడఉప్పును వేసి బాగా కలుపుకుని ,

కొత్తి మీర తో గార్నిష్ చేసుకుంటె

ఘుమ ఘుమ లాడే దధ్యోజనం రెడీ అవుతుంది

అన్నం చల్లారాక పెరుగు కలుపుకోవాలి లేకపోతే పెరుగు విరిగినట్లు అవుతుంది
దబ్బకాయ నంచుకు తింటాయి గొప్ప రుచిగా ఉంటుంది
పెరుగు పులుపు లేకుండా కమ్మటిది అయితే దధ్యోజనం చాలా రుచిగా ఉంటుంది .

Subha's Kitchen

Friday, 24 June 2016

చింతపండు ఆవ పులిహోర



                                                           " చింతపండు ఆవ పులిహోర "

కావలసిన పదార్థాలు

1. బియ్యం 4గ్లాసులు
2. చింతపండు నిమ్మకాయంత
3.   పచ్చిమిరపకాయలు 5
4. అల్లం చిన్న ముక్క
5. కరివేపాకు కొద్దిగా
6. ఆవముద్ద 2 స్పూన్స్

పోపు దినుసులు

సెనగపప్పు 2 స్పూన్స్ ,
మినపప్పు 2 స్పూన్స్ ,
ఆవాలు 1 స్పూన్
ఎండుమిరపకాయలు 3
పల్లీలు 3స్పూన్స్ ,
ఇంగువ కొద్దిగా
పసుపు  అర స్పూన్
ఉప్పు రుచికి సరిపడ
ఆయిల్ 5 స్పూన్స్

తయారీ విధానం

ముందుగా చింత పండును కొద్దిగా నీళ్లు పోసి
ఒక గిన్నె లోనాన బెట్టుకోవాలి

బియ్యాన్ని శుభ్రం గా కడిగి ఒక గ్లాసు బియ్యానికి
 రెండు గ్లాసుల నీళ్లు పోసుకుని

 ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్కరు లో పెట్టి ఉడికించుకోవాలి
 అన్నం ఉడికిన తరువాత
 ఒక బేసిను లోకి తీసుకుని చల్లార నివ్వాలి

పచ్చి మిర్చిని చీలికలుగాను ,
అల్లాన్ని చిన్న ముక్కలు గాను తరుగుకోవాలి .
నానబెట్టుకున్న చింతపండును
 పిప్పులు లేకుండా మెత్తని గుజ్జు లా తీసుకుని
ఉడికించుకోవాలి .

స్టవ్ మీద బాణలి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి
ముందుగా పల్లీలను వేసి అవి వేగాక
 పైన చెప్పిన పోపుదినుసులను వేసి
అవి దోరగా వేగాక ,
తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ,
అల్లం ముక్కలు , కరివేపాకులను  వేసి దోరగా వేగనివ్వాలి

ఇప్పుడు చల్లారిన అన్నం మీద పసుపు ,
ఆయిల్  , ఉప్పు వేసి బాగా కలపాలి
తరువాత పోపుమిశ్రమాన్ని
ఉడికించి పెట్టుకున్న చింత పండు మిశ్రమాన్నివేసి
 బాగా కలిసేలా కలుపు  కోవాలి

చివరగా ముందే నూరి పెట్టుకున్న ఆవ ముద్దను
కొద్దిగా ఆయిల్ ను వేసి
అంత కలిసేలా కలుపుకుంటె
ఘుమ ఘుమ లాడే
చింత పండు ఆవ పులిహోర రెడీ

Subha's Kitchen


Tuesday, 21 June 2016

రామేశ్వర దేవాలయం: రామేశ్వరం


                                                           రామేశ్వర దేవాలయం:
                                                                    రామేశ్వరం

దేశంలోని చతుర్ధామాల్లోని మొదటి ధామంగా భావించబడుతుంది.
మొదటిది రామేశ్వరం, రెండవది ద్వారక, మూడవది పూరి జగన్నాధ్,
4వది-బదరీనాధ్ ధామం.
 ప్రతివారూ కనీసం ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించవలె.
మొదటగా కాశీ వెళ్ళి గంగాజలం తెచ్చి రామేశ్వరంలోని శ్రీ రామలింగేశ్వరుని అర్పించితేగాని జన్మసాఫల్యంగాదంటారు.

రామేశ్వర దేవాలయం పురాణకథ  :

రామాయణ కధాకాలంలో కధప్రకారం సీతమ్మవారిని లంకేశుడు చెరబట్టి
తీసికొని వెళ్ళిన తరువాత, అమ్మవారి జాడ కనుగొని లంకాధిపతి రావణుని సంహరించివేశాడు శ్రీరాముల వారు. రావణుడు బ్రాహ్మణుడు.
బ్రాహ్మణుని చంపినాడు గాన బ్రహ్మ హత్యాదోషము అంటింది శ్రీరాములవారికి.
అప్పుడు శివలింగ ప్రతిష్ఠ చేయవలసిందిగా సలహా యిచ్చారు
వెంటనే ప్రియభక్తుడైన వాయుపుత్రుడు హనుమంతుని హిమాలయాల్లోని
కైలాసగిరి యందున్న శివలింగమును తెమ్మని పంపారు.
వాయువేగ, మనోవేగాల్తో వెళ్ళాడు హనుమ. ముహుర్తం దగ్గర పడుతోంది.
హనుమ జాడలేదు. శ్రీరాముల సీతారాములు శివలింగ ప్రతిష్ఠ జరిపారు.
అంతలోనే హనుమ కైలాసగిరి నుండి వచ్చాడు శివలింగముతో. హనుమంతుని చిన్న బుచ్చకుండా అదిగూడా ప్రతిష్టించారు సీతారాములు మొదట హనుమతెచ్చిన లింగము పూజించబడింది. శ్రీరాముల వారిచేత ప్రతిష్టించబడినది, శ్రీరామ లింగేశ్వరుడని పిలుస్తారు శ్రీరామ భక్త హనుమాన్ తెచ్చినది శ్రీ కాశీవిశ్వేశ్వర లింగం.

2 వ ప్రాకారంలో అమ్మవారి దేవాలయం ఉంది. నూతనంగా అనేక విధముల అభివృద్ధి పరచబడింది. ఆలయ గోపురం, గొప్ప నందీశ్వరుని విగ్రహాలు సున్నంతో నిర్మించి రంగులు వేయబడియున్నవి.
3 వ ప్రాకారం:
 4000 అడుగుల పొడవు, 21 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుగలిగి
ఈ చివరినుండి ఆ చివరివరకు కనబడుతూ గాలికొరకు వెంటిలేషన్
ఏర్పాటుతో మండప స్థంభాలన్నీ చిత్రవిచిత్రాలైన శిల్పాలతో పొదిగియున్నది.
 రామలింగ విగ్రహములు, శ్రీ కోదండ రామస్వామి, నటరాజ మందిరం, సేతుమాధవ స్వామి ఆలయం, కోనేరు, ఇతర తీర్దాలు ప్రాకారంలోని విశేషాలు తూర్పువైపున సముద్రం, పడమటి వైపున గోపురాలు ఉన్నాయి.

దేవాలయంలో తీర్ధములు :
మహాలక్ష్మి, సావిత్రి, గాయత్రి, సరస్వతి, మాధవ, గంధమాదన, గవాక్ష, గవయ.
నల, నీల, శంక, శంకర, బ్రహ్మహత్యా విమోచన, సూర్య, చంద్ర, గంగ, యమున, గయ, శివ, సత్యామృత, సర్వతీర్ధము, కోటి తీర్ధము. ఇవి 1,2,3 ప్రాకారాల్లోనే అమరియున్నవి. ఆలయం వెలుపల, పరిసర ప్రదేశాల్లో మరో 21 తీర్ధాలున్నాయి. చాలావరకు గంధమాదన పర్వతానికి వెళ్ళివచ్చే దారిలో ఉన్నాయి.

రామేశ్వర పరిసరాల్లో దర్శించదగిన క్షేత్రాలు:-

గంధమాదన పర్వతము:

రామాయణ యుద్ధకాండంలో దీనికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. హనుమంతుడు లంకకు వెళ్ళటానికి, శ్రీరాములవారు తన వానర సైన్యమును నడిపించినది కూడ ఇక్కడి నుండే. శ్రీరాముల వారు రావణ వధానంతరం లింగప్రతిష్ఠను గూర్చి అలోచించినదిక్కడేనట. .
ఇంకా - ఏకాంత రామేశ్వరాలయం, నంబినాయకి అమ్మన్, సీతాగుండం, విల్లోరినీ తీర్ధము, భైరవతీర్ధం కోదండరాముని కోవెల మొదలగునవి దర్శించతగినవి.

ధనుష్కోటి:
ఇక్కడే రావణుని తమ్ముడు విభీషణుడు శరణుజొచ్చినచోటు. యుద్ధానంతరం వానరులు నిర్మించిన సేతువును పగుల గొట్టారట ఇక్కడ. శ్రీరాములవారు బాణముతో కొట్టగా వంతెన విచ్చిపోయి రత్నాకరము, మహొదధి, రెండున్నూ కలిసిపోయాయట. ధనుస్సుచే పగులగొట్టటంచేత ధనుష్కోటి అనే పేరు సార్ధకమయిందంటారు. 

బీట్ రూట్ పచ్చి బాటనీ కొబ్బరి కోరు కూర



                                               బీట్ రూట్ పచ్చి బాటనీ కొబ్బరి కోరు కూర

కావలిసిన పదార్థాలు

1. బీట్ రూట్ పావు కేజీ
2. కొబ్బరికోరు  ఒక చిన్న కప్పు
3. పచ్చిబతానీలు ఒక చిన్న కప్పుడు
4. పచ్చిమిర్చి
5. 3కరివేపాకు  కొద్దిగా
6. గార్నిష్ కు కొద్దిగా కొత్తిమీర

పోపు దినుసులు ::సెనగపప్పు 1 స్పూన్
మినపప్పు 1 స్పూన్
ఆవాలు అర స్పూన్
జీలకర్ర అరస్పూన్
ఎండు మిరపకాయలు 2

తయారీ విధానం
ముందుగా బీట్ రూట్ మరియు పచ్చి బటానీలను
శుభ్రంగా కడుగుకోవాలి
బీట్ రూట్  పైన వున్నా తొక్క తీసి
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
కట్ చేసుకున్న బీట్ రూట్ ముక్కలను
పచ్చి బటానీలను ఒక గిన్నె లోకి తీసుకుని
 సరిపడినంత ఉప్పు వేసుకుని
 2 గ్లాసులు నీళ్ళు పోసి
 కుక్కరు  లో పెట్టి ఉడికించి చల్లారబెట్టుకోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి
అది వేడెక్కాక పైన చెప్పిన
సెనగపప్పు,  మినపప్పు , ఆవాలు , జీలకర్ర ,
ఎండుమిరపకాయ ముక్కలు  వేసి అవి దోరగా వేగిన తరువాత
కరివేపాకు , కొబ్బరికోరులను వేసి అవి కూడా వేగాక
ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు
పచ్చిబటా నీలను  వేసి కాసేపు మగ్గనివ్వాలి
కూర అంతా పొడిగా అయ్యాక
స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
ఘుమ ఘుమ  లాడే బీట్ రూట్ పచ్చి బటానీ కొబ్బరి కోరు కూర రెడీ
దీనిని వేడి అన్నం లోను చపాతీలలోకి బాగుంటుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi


Monday, 20 June 2016

కాలీ ఫ్లవర్ ఆవ కాయ



                                                            కాలీ ఫ్లవర్ ఆవ కాయ

కావలసిన పదార్థాలు

1. కాలీ ఫ్లవర్ లు 2
2. ఆయిల 3 కప్పులు
 ( నువ్వుల పప్పు నుని  ఐతే చాల బాగుంటుంది )
3.  నిమ్మకాయలు 3
4. కారము  మిక్స్ తయారీకి
కారము  2 కప్పులు  ,
ఆవపొడి  2 కప్పులు ,
ఉప్పు 1 కప్పు
కారము 2 కప్పులు

తయారీ విధానం

ఆవపొడి తయారీకి

ఆవాలను ఎండ లో పెట్టి బాగా ఎండనిచ్చి
గ్రైండ్ చేసుకోవాలి
 కారము ఆవపొడి సమానం గా తీసుకోవాలి
 ఒక పెద్ద ప్లేటులో కారము 2 కప్పులు
ఆవపొడి 2 కప్పులు
ఉప్పు 1 కప్పు వేసి
*(ఈ మూడు కలిపిన గుండ కూడా దొరుకుతుంది )

అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి
కాలీ ఫ్లవర్ ను శుభ్రం గా కడిగి
తడి లేకుండా ఆరబెట్టుకోవాలి

కొలత కారము ఒక కప్పు తీసుకుంటే
 కాలీ ఫ్లవర్ గుత్తులు కప్పున్నర తీసుకోవాలి

పైన చెప్పిన కొలతలు ప్రకారం ముక్కలు ,
కారం మిక్స్ తీసుకుని బాగా కలిసేలా కలుపుకుని
ఆయిల్ నిమ్మరసం వేసి
అంతా కలిసేలా కలుపుకుంటే

కాళీ ఫ్లవర్ ఆవకాయ రెడీ అవుతుంది
ఇది ఒక 20 రోజుల పాటు నిలువ వుంటుంది
రైస్ లోకి చపాతీలోకి సెట్ దోసె మినప దోసె రవ్వ దోసె లలోకి బాగుంటుంది

Subha's Kitchen

కరకరలాడే బంగాళ దుంపల వేపుడు


                                                   కరకరలాడే బంగాళ దుంపల వేపుడు

కావలసిన పదార్థాలు

1.   బంగాళ దుంపలు పావుకేజీ
2. ఆయిల్ 7 స్పూన్స్
3.  ఉప్పు  రుచికి సరిపడ
4. కారము రుచికి సరిపడ
5.  సెనగపిండి 2 స్పూన్స్

తయారీ విధానము

ముందుగా బంగాళ దుంపలను శుభ్రంగా కడిగి
 పైన వున్న తొక్క తీసి
చిన్న ముక్కలుగా కట్ చేసుకుని
ఉడికింఛి చల్లారబెట్టుకోవాలి

స్టవ్ మీద బాణలి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి
వేడెక్కాక ఉడికించి చల్లారబెట్టుకున్న
బంగాళదుంప ముక్కలను వేసి బాగా వేగనివ్వాలి

మధ్య మధ్య లో  ఆయిల్ వేసి , అట్లకాడతో కలుపుతూ ఉండాలి
ఈముక్కలు దోరగా వేగాక

 2 స్పూన్స్ సెనగపిండిని వేసి
 (సెనగపిండిని  వేయడము వలన ముక్కలు విడివిడి గా ,
 పొడిగా ఉండి  క్రిస్పి గా వేగుతాయి )

కాసేపు వేగనిచ్చిన తరువాత
 సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి,
 కారము  వేసి బాగాకలిపి

కొద్దిసేపు స్టవ్ మీద వుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి

కరకరలాడే బంగాలదుంపల వేపుడు రెడీ

Subh's Kitchen

Sunday, 19 June 2016

కాలీ ఫ్లవర్ పచ్చి బటానీ కూర


                                                     కాలీ ఫ్లవర్  పచ్చి బటానీ  కూర

కావలసిన పదార్థాలు
1. కాలీ ఫ్లవర్ 1
2. పచ్చి బటానీలు 1 ప్యాకెట్
3. పచ్చిమిర్చి 3
4. కరివేపాకు
5. కొత్తిమీర
పోపు దినుసులు
సెనగపప్పు 1 స్పూన్
మినపప్పు 1 స్పూన్
ఆవాలు అర స్పూన్
జీలకర్ర అర స్పూన్
ఎండు మిరపకాయలు 2
పసుపు కొద్దిగా
ఉప్పు రుచికి సరిపడా
తయారీ విధానం
ముందుగా కాలీఫ్లవర్ ను శుభ్రం చేసుకుని
ఉప్పు నీళ్ళలో వేసుకుని కడుగు కోవాలి .
పచ్చి బటానీలను కూడా శుభ్రం గా కడుగుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
కడిగిన కాలీ ఫ్లవర్ మరియు బటానీ  వేసి
ఒక గ్లాసు నీళ్ళు పోసి
 కొద్దిగా ఉప్పు వేసి
ఉడికించి చల్లరబెట్టుకోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి
వేడెక్కాక కొద్దిగా పసుపు , పైన చెప్పిన పోపు దినుసులను వేసి
అవి దోరగా వేగాక
కరివేపాకు , పచ్చి మిర్చి చీలికలు వేసి,
 అవి వేగాక
ఉడికించి పెట్టుకున్న కాలీ ఫ్లవర్ , బటాఆనీలను వేసి
అవి కొంత సేపు మగ్గిన తరువాత
స్టవ్ నుండి దింపి
 కొత్తి మీర తో గార్నిష్ చేసుకుంటే
ఘుమ ఘుమ లాడే కాలీ ఫ్లవర్ పచ్చి బటా నీ కూర రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi








నాన్నా//HAPPY FATHER'S DAY


                                                       నాన్నా//HAPPY FATHER'S DAY

నాన్నా,
నా దరహాసమే  నీ ఉల్లాసమై  ,
నా నవ్వులే  నీ  దరహాసమై  ,
నా  అల్లరే  నీ ఆనందమై,
అడుగు  నాదై (నా)  ఆత్రుత  నీదై ,
నీ అడుగులో నా అడుగు వేసి,
నా విజయం లో తొలి అడుగు నీవై,
నువ్వోడి  నను గెలిపించి  ,
నా విజయ నేత్రాల  మెరుపులు,
నీ నేత్రాల  ఆనంద భాష్పాలై,
సంతోషాలు  కురిపించగా,
నను మురిపించి,
నను నడిపించి,
నా ఆశల పల్లకీ  బోయీ వై ,
నా ప్రగతికి  మార్గదర్శకుడివై,
హితుడివై,
స్నేహితుడివై ,
నా జీవితానికి దేవుడిచ్చిన  వరమై,
వేయి వసంతాల  వెన్నెల చల్లదనంలో,
శతకోటి  మల్లెల  పరిమళాల  మనసుతో,
నువ్వే  కావాలి
ప్రతి జన్మ లో నా  "  నాన్న " గా

Saturday, 18 June 2016

చక్కెర పొంగలి

                                                                 


కావలసిన పదార్థాలు
1.  బియ్యం 1 గ్లాసు
2. పెసరపప్పు అర గ్లాసు
3.  పంచదార  1 గ్లాసు
4. ఏలకులపొడి కొద్దిగా
5. కిస్మిస్ 10 పలుకులు
6. జీడిపప్పు 10 పలుకులు
7. కొబ్బరి ముక్కలు ఒక చిన్న కప్పు
8.  నెయ్యి ఒక చిన్న కప్పు
9. చిక్కని పాలు ఒక కప్పు

తయారీ విధానం
ముందుగా బియ్యం , పెసరపప్పు  శుభ్రంగా కడుక్కుని
మూడు  గ్లాసులు నీళ్ళు పోసుకుని
కుక్కరులోపెట్టి ఉడికించుకోవాలి
కుక్కరు విజిల్స్ 5 రానివ్వాలి
స్టవ్ మీద బాణలి పెట్టి 5 స్పూన్స్ నెయ్యి వేసి
కిస్మిస్,  జీడిపప్పు పలుకులు , కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేపుకోవాలి.
స్టవ్ పైన వేరే బాణలి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసి ,
ముందుగా  ఉడీకించుకున్న పెసరపప్పు , అన్నాన్ని ,
చిక్కని పాలు ని  మరియు  పంచదారను ఈ బాణలిలో వేసి ,
కొద్దిగా ఉడకనిచ్చి న తరువాత,
 కొద్దిగా  ఇలాచీ ( ఏలకులు ) పొడి,
ముందుగా వేపుకుని పెట్టుకున్న కిస్మిస్ ,
జీడిపప్పుపలుకులు కొబ్బరి ముక్కలను వేసి ,
బాగా కలిపి ,
మిగిలిన నెయ్యి ని కూడా వేసి ,
కలిపి దగ్గర పడేంత వరకు వుంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి .
ఘుమ ఘుమ లాడే చక్కెర  పొంగలి రెడీ.

* దీనిలో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే పొంగలి అంత రుచిగా వుంటుంది

** బియ్యం లోనీళ్ళ కొలత గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు పోసుకోవాలి
    ఇక్కడ పప్పు బియ్యం కలిపి ఒకటిన్నర గ్లాసులు కాబట్టి
    మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi





చిక్కుడుకాయ బెల్లం కూర


                                                           చిక్కుడుకాయ బెల్లం కూర

కావలిసిన పదార్థాలు

1. చిక్కుడుకాయలు  పావుకేజీ
2.  బెల్లం ఒక చిన్న కప్పు
3. కరివేపాకు
4. వరి  పిండి 1 స్పూన్

పోపు దినుసులు

సెనగపప్పు 1 స్పూన్
మినపప్పు 1 స్పూన్
ఆవాలు అర స్పూన్
జీలకర్ర అర స్పూన్
ఎండు మిరపకాయలు 2
ఉప్పు రుచికి సరిపడ
పసుపు కొద్దిగా

తయారీవిధానం

ముందుగా చిక్కుడు కాయలను శుభ్రంగా కడిగి
ఈనెలు తీసుకుని రెండు ముక్కలుగా చేసుకుని
కుక్కరులో  పెట్టి ఉడికించుకోవాలి

స్టవ్ మీద బాణలి పెట్టి  3స్పూన్స్ ఆయిల్ వేసుకుని
పైన చెప్పిన సెనగ పప్పు , మినపప్పు , ఆవాలు , జీల కర్ర ,
ఎండు మిరపకాయలను వేసి అవి వేగాక

ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు
పసుపు , సరిపడినంత ఉప్పు,
 బెల్లం , వరిపిండి , కరివేపాకులను వేసి
బాగా కలిపి

బెల్లం అంతా ముక్కలకు పట్టేంత వరకు మగ్గనివాలి .
నీరంతా పోయి కూర దగ్గర పడ్డాక
స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఘుమ ఘుమ లాడే చిక్కుడు కాయ బెల్లం కూర రెడీ

చిక్కుడు గింజలు  కొంచెం ఎక్కువగా ఉంటే  చాల బాగుంటుంది .

దీనిని వేడి వేడి అన్నం లో తింటే ఎంతో రుచిగా వుంటుంది

Subha's Kitchen

Friday, 17 June 2016

చేమ దుంపల వేపుడు



చేమ దుంపల వేపుడు

కావలిసిన పదార్థాలు

1. చేమ దుంపలు పావుకేజీ
2. ఉప్పు
3. కారము రుచికి సరిపడినంత
4. సెనగ పిండి 2 స్పూన్స్
5. ఆయిల్ 8 స్పూన్స్

తయారీవిధానం :

ముందుగా చేమ దుంపలను బాగా కడిగి
సరిపడినంత నీళ్ళు పోసి
కుక్కరులో పెట్టి ఉడికించు కోవాలి

ఇవి చల్లారాక వీటి పైన వున్నతొక్క తీసి
చాకు తో చిన్న ముక్కలు గా కట్ చేసుకోవాలి

స్టవ్ మీద బాణలి పెట్టి
 4 స్పూన్స్ ఆయిల్ వేసి
ఉడికించి కట్ చేసి పెట్టుకున్న చేమ దుంపలను వేసి
బాగా వేగ నివ్వాలి .
మధ్య మధ్యలో అట్లకాడ తో కలుపుతూ వుండాలి .
ఆయిల్ కూడా వేస్తూ వుండాలి
కొంచెం దోరగా వేగిన తరువాత

2 స్పూన్స్ సెనగ పిండి వేసి మరి కొద్ది సేపు వేగనిచ్చి
తరువాత సరిపడినంత ఉప్పు వేసి
బాగా కలిపి

తరువాత కారము 1 స్పూన్  వేసి
చేమ దుంప లకి ఉప్పు కారము అంటే లా కలిపి
స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర కర లాడే చేమ దుంపల వేపుడు రెడీ.
వేడివేడి అన్నంలోకి చాలాబాగుంటుంది .

Subha' Kitchen

కేరట్టు కొబ్బరి కోరు కూర



                                                               కేరట్టు కొబ్బరి కోరు కూర

కావలసిన పదార్థాలు :

1. కేరట్లు పావు కేజీ
2. కొబ్బరి కోరు ఒక కప్పు
3 పచ్చిమిర్చి 4 .
4. కరివేపాకు

పోపు దినుసులు

సెనగ పప్పు 1 స్పూన్
మినపప్పు 1 స్పూన్
ఆవాలు అరస్పూన్
జీలకర్ర అరస్పూన్
ఎండు మిరపకాయలు 2

తయారీవిధానం

ముందుగా కేరట్లను బాగా కడిగి
చిన్న ముక్కలుగా  తరిగి

కుక్కరులో పెట్టి ఉడికించుకుని
చల్లారబెట్టుకోవాలి

స్టవ్ మీద బాణలి పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసి
పైన చెప్పిన సెనగ పప్పు,  మినపప్పు ,
ఆవాలు , జీలకర్ర , ఎండు మిరపకాయలను ,
వేసి అవి దోరగా వేగాక

తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు , కరివేపాకు వేసి

అవి వేగాక కొబ్బరికోరును కూడా వేసి
అదికూడా దోరగా వేగినతరువాత
ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న కేరట్టు ముక్కలను.  కుడా వేసి

 కాసేపు మగ్గనిచ్చి సరిపడినంత ఉప్పు వేసి
కూర అంతా కలిసేలా కలుపుకుని

కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
కేరట్టు కొబ్బరి కోరు కూర రెడీ

Subha's Kitchen


శ్రీకృష్ణ భగవానుని మందిరం///ఉడిపి


   
                                                   శ్రీకృష్ణ భగవానుని మందిరం///ఉడిపి

 ఇక్కడ   13వ శతాబ్దం నాటి
మధ్వాచార్యుల వారిచే ప్రతిష్టించబడిన
బహు సుందర రూపమైన
బాలకృష్ణ స్వామి విగ్రహము కలదు.
స్వామి భక్తసులభుడై కనకదాసు
అను భక్తుని కరుణించటానికి
తూర్పు ముఖంగా ఉండే స్వామి
పశ్చిమాభిముఖుడైనాడని ఒక భక్తుని కధ.
స్వామిని కనకదాసు ఎక్కడ నుండి చూచాడో
అక్కడ మండపం కట్టించి దానికి
కనకదాస మండపం అని పేరు పెట్టారుట.
స్వామిని అర్చించటానికి ఆచార్యులవారు
8 మఠములు ఏర్పరిచారని
అందులో ఉండే యతీశ్వరులే
రెండు సంవత్సరాల కొకరుగా
వంతుల వారీగా అర్చన చేయటానికి
నియోగించబడినట్లుగా చెప్తారు.
మారేటప్పుడు పర్యాయోత్సవమని చేస్తారు.

దర్శనీయ స్థలాలు

పవిత్ర వాదిరాజ స్వామివారి సోదెమఠము,
శ్రీకృష్ణ మఠము -
విమానగిరి దుర్గాలయం -
 కోటిలింగాలు గల కోటీశ్వర క్షేత్రం.

మూకాంబికా క్షేత్రం

ఉడిపికి ఈశాన్యంగా 80 కి.మీ. దూరంలో ఉన్న పుణ్యక్షేత్రం. మూకాంబికా దుర్గాదేవి అవతార విశేషమే స్వయంగా ఉద్భవించిన శివలింగము  ఉడిపి వెనుక మహతేజస్సుతో విరజిల్లే దుర్గాదేవిని శ్రీశంకరాచార్యుల వారు స్వయంగా ప్రతిష్టించినది. నవరాత్రుల్లో మహాసంరంభమైన ఉత్సవాలు జరుగుతాయి. 

Thursday, 16 June 2016

ఆలయాలు ///పూజా విధానాలు కొన్ని



                                                    ఆలయాలు ///పూజా విధానాలు కొన్ని

1. తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా,ఒకదాని తర్వాత మరొకటి
కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున
తీసుకొనరాదు.

2 శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి
తర్పణం,అమ్మవారికి కుమ్కుమపూజ ఇష్టం .ఇవి చేస్తే మంచి జరుగుతుంది.

3. దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం ,
స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి
వేడుకోవాలి.

4. పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు.
వారు మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.

5. యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడేనిలబడి
వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు.
మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు,హనుమంతుడు ఫోటోలు ఉండరాదు.
లక్ష్మీ దేవి కూర్చునిఉన్న ఫోటోగాని,విగ్రహంగాని ఉండాలి.నిలబడి ఉన్నది
వాడరాదు.

6. శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.

7. తులసి దళములను పూజ చేయునపుడు దలములుగానే వెయ్యాలి.

8. ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు(మరియు)గౌరిమాత
ఆలయం, మంగళవారం) ఆంజనేయస్వామి,సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు,
బుధవారం వినాయకుడు మరియు అయ్యప్పస్వామి ఆలయాలు, గురువారం
సాయిబాబా, దత్తాత్రేయ,వెంకయ్యస్వామి మొదలగు గురువుల ఆలయాలు,


శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాలు
మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట
మంచిది.

9. ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు
వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని
తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,
వెంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని   దర్శించి తరువాత
మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము
దర్శించాలి.

 10. నవ విధ భక్తి మార్గములు: శ్రవణం (వినటం), కీర్తనం(పాడటం),
 స్మరణము(మనసులోజపించుట), పాద సేవనము, అర్చన(పూజ), నమస్కారము,
 దాస్యము(సేవ), సఖ్యము, ఆత్మనివేదనము(మనోనిగ్రహముతో సమర్పించుట)వీటిలో
ఏ పద్ధతి ఐనను దేవునికి ప్రీతికరము.

11. జపములు మూడు రకములు.అవి: (ఏ) వాచకజపము:అందరికి వినపడేలా
     బిగ్గరగా చేసేది. (బి) ఉపామ్సుజపం:ఎవరికి వినపడకుండా పెదాలను
      కదుపుతూ   చేసేది. (సి) మానసజపం: ఎవరికి వినపడకుండా ,
      పెదాలు కదపకుండా, మనసులో చేసేది. అన్ని జపాలలో కెల్లా
      మానసజపం ఉత్తమం,వాచకజపం సామాన్యం,ఉపంసుజపం మధ్యమం.


.

Wednesday, 15 June 2016

చన మసాలా కర్రీ


                                                                    చన మసాలా కర్రీ

కావలసిన పదార్థాలు

1. కాబులీ సెనగలు 1 ప్యాకెట్
2. టమాటోలు 3
3. ఉల్లిపాయలు 5
4. పచ్చిమిర్చి 3
5. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్
6. చనా మసాలా పొడి 2 స్పూన్స్
7. కారం 1 స్పూన్
8. పసుపు
9. ఉప్పు
10. పెరుగు 2 స్పూన్స్
11. కొత్తిమీర
12. పల్లీలు 2స్పూన్స్
13. జీడిపప్పు 2 స్పూన్స్

తయారీ విధానం

కాబులీ సెనగలను ఒక రోజు ముందుగా నీళ్ళలో నానబెట్టుకోవాలి .
 అంటే ఇవాళ కూర చేసుకోవాలి  అనుకుంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి .

ముందు రోజు నానబెట్టిన వీటినిశుభ్రం గా కడిగి
కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకుని కుక్కరులో పెట్టి ఉడికించాలి

 కుక్కరు విజిల్స్ 10 లేక 11 విజిల్స్ రానివ్వాలి
దీనివలన సెనగలు మెత్తగా ఉడుకుతాయి .

టమాటో లని 3  వుల్లిపాయలని సన్నగా తరుగుకోవాలి
వీటిని స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 2స్పూన్స్ ఆయిల్ మగ్గ బెట్టుకోవాలి
 ఇవి చల్లారాక మెత్తగా పేస్టు లాగ గ్రైండ్ చేసుకోవాలి

పల్లీలను  జీడిపప్పులను దోరగా వేపుకుని మెత్తని పొడి లాగ గ్రైండ్ చేసుకోవాలి
 2 ఉల్లిపాయలను సన్నగా తరుగుకోవాలి

స్టవ్ మీద బాణలి పెట్టుకుని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని
అల్లం వెల్లుల్లి పేస్టు  వేసి అది  పచ్చి వాసన పోయే దాక వేయించి
సన్నగా తరుగు కున్న ఉల్లి పాయముక్కలను కూడా వేసి
అవి దోరగా వేగిన  తరువాత

గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఉల్లి మిశ్రమాన్ని వేసి
అది పచ్చి వాసన పోయే దాక   మగ్గిన తరువాత
ముందుగా ఉడికించి పెట్టుకున్న సెనగలు , పసుపు ,
సరిపడినంత  ఉప్పు   , కారము చనా మసాలాపొడి వేసి
బాగా కలిపి ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగాఉడకనివ్వాలి

పెరుగు  వేసి బాగా కలిపి
పల్లీ   జీడిపప్పుపేస్టు ను  వేసి బాగా కలిపి
కొంచెం సేపు ఉడకనిచ్చి
కూరఅంతా బాగా దగ్గర పడిన తరువాత

పైన కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
ఘుమఘుమ లాడే చనా మసాలా కర్రీ రెడీ
ఇది పూరీ చపాతి లలోకి  బాగుంటుంది  

Subha's Kitchen





" శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం " అన్నవరం


                                           " శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం "
                                                                            అన్నవరం

                                      "  సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం.
                                            లీలాయా వితతం విశ్వం యేన తస్మై నమోనమః.  "

పంపానదీ తీరంలో "  రత్నగిరిపై "
" నిత్య వ్రతాలతో " ,
" స్వామి వారి కళ్యాణముల " తో అలరారుతూ
,కోరిన వరాలనోసగే.  " సత్య దేవుని " దివ్య సన్నిధి "
 " శ్రీ అన్నవరం సత్యనారాణ దేవాలయం" గా  ప్రసిద్ధిచెందింది.

సామూహిక  సత్యనారాయణ వ్రతాలు , స్వామివారి కల్యాణములు
అత్యంత వైభవముగా , భక్తీ ,శ్రద్ద  లతో, ఇక్కడ ఆచరింపబడతాయి.
వివాహం,  గృహప్రవేశ మహొత్సవము సందర్భాలన్నింటికీ
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఒక ముఖ్య భాగంగా ఆచరించుతారు.
చాలామంది భక్తులు ఇక్కడే  స్వామీ వారి సన్నిధి లో
వివాహము చేసుకుని ,
వ్రతము ఆచరించి , వెళుతూ ఉంటారు.

పురాణ  కధనం :

మేరువు ఇద్దరు కుమారులు
భద్రుడు, రత్నకరుడుగా పేర్కునబడింది.
 భద్రుడు పెద్దవాడు. రత్నాకరుడు చిన్నవాడు.
ఇద్దరు కూడా తమ పేరు చిరస్థాయిగా ఉండాలని
తపస్సు చేయ సంకల్పించినవారు.
భద్రుడే - భద్రగిరి, భద్రాచలంగాను,
రత్నాకరుడు - రత్నగిరిగాను శాశ్వతత్వాన్ని సాధించారు.

                                     " ఓం నమో నారాయణాయ ,
     హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక పరమేశ్వరీ పరమేశ్వర స్వరూప
      ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామినే నమః."


 ఇక్కడి స్వామి త్రిపాద్విభూతి మహానారాయణుడు.
నారాయణస్త్రంలో అలంకరించబిడిన వాడై,
ఈశ్వర సహిత
హిరణ్య గర్భాత్మకుడై తనదేవేరి
శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారి సమేతుడై
శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వెలసి
భక్తులకనుగ్రహం ప్రసాదిస్తున్నారు.

ఆలయం రెండతస్తులుగా ఉంటుంది.
ఆగమశాస్త్ర విధిగా క్రింది భాగంలో యంత్ర ప్రతిష్ఠ జరిగింది.
స్వామివారి దివ్య మంగళమూర్తిని రెండవ అంతస్థులో దర్శించగలము.

అన్నవరం కళ్యాణోత్సవాలు :

శ్రీ వారి దివ్య కళ్యాణోత్సవాలు వైశాఖ శుద్ధ దశమీ విశేషోత్సవాలకు తోడు,
ఉగాది, శ్రీరామనవమి, వినాయక చాతుర్థి - గణపతి నవరాత్రోత్సవాలు,
శరన్నవరాత్రులు, సంక్రాంతి, శుద్ధ ఏకాదశి, భీష్మైకాదశి వగయిరా
పర్వదినోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ప్రసాదము

: శ్రీ  సత్యనారాయణ స్వామీ వారి ప్రసాదము గా ప్రసిద్ధి చెందిన ,
ఈ ప్రసాదమును స్వీకరించకుండా ఎవరు వెళ్ళరు . చక్కని  రుచి తో పాటు ,
ఆత్య ద్భుతమైన , ఆధ్యాత్మిక  అనుభునితిని కుడా , ప్రసాదిస్తుంది .

ప్రతి నిత్యమూ జరిగే అర్చనలు, పూజలు, భక్తుల నిత్య కళ్యాణం  పచ్చ తోరణం
ఈ స్వామి వారి దివ్య సన్నిధి .

తప్పక  దర్శించ వలిసిన పుణ్య క్షేత్రము .


Tuesday, 14 June 2016

సరస్వతి శ్లోకము


                                                                 సరస్వతి శ్లోకము

సరస్వతి శ్లోకమును నిత్యమూ ఉదయము , సాయంత్రము చదువుకుంటే ,

ధారణ శక్తి , వాక్చాతుర్యము ,

జ్ఞానము  వృ ద్ది  చెందుతాయి ....


" శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ సుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ "



మిక్స్డ్ వెజిటబుల్ గ్రేవీ కర్రీ



                                                             మిక్స్డ్ వెజిటబుల్  గ్రేవీ కర్రీ

కావలసిన పదార్థాలు

1. బంగాళ దుంపలు 2
2. కేరట్ లు 2
3. పచ్చి బటానీలు చిన్న కప్పు
4. పచ్చి మిర్చి 2
5 ఉల్లిపాయలు 5 .
6. టమాటోలు  4
7. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్
8. గరం మసాలా పొడి  2 స్పూన్స్
9.   కారం  1స్పూన్
10. పసుపు
12. ఉప్పు
13. పల్లీలు  2 స్పూన్స్
14. జీడిపప్పు  2 స్పూన్స్
15.  పెరుగు 2 స్పూన్స్
16. కొత్తిమీర

తయారీ విధానము

3  ఉల్లిపాయలను టమాటో లను మెత్తగా పేస్టు లాగ గ్రైండ్ చేసుకోవాలి
2  ఉల్లిపాయలను సన్నగా తరుగుకోవాలి
    పచ్చిమిర్చిని సన్నగా చీలికలుగా చేసుకోవాలి

బంగాళ దుంప , కేరట్టులను , చిన్న ముక్కలు గా తరుగుకుని
కుక్కరు లో పెట్టి ఉడికించు కోవాలి .

పల్లీలు , జీడిపప్పులను , దోరగా వేపుకుని
చల్లారాక మెత్తని పొడి లాగ గ్రైండ్ చేసుకోవాలి .

స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక
 తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసి
అది పచ్చి వాసన పోయే దాక  వేపుకుని
అది వేగిన తరువాత

తరిగినఉల్లిపాయ ముక్కలు వేసి
అవి కూడా వేగిన తరువాత

గ్రైండ్ చేసి  పెట్టుకున్న ఉల్లి పాయ టమాటో ముద్దను ,
పచ్చి మిర్చి చీలికలను వేసి పచ్చి వాసన పోయేదాకా మగ్గ నివ్వాలి .
ఇది మగ్గాక ఉడికించి పెట్టుకుపెట్టుకున్న బంగాళదుంప ,కేరట్టు ,
పచ్చి బతానీలు,  వేసి కలిపి

తరువాత కొద్దిగా  కారము  , పసుపు , సరిపడినంత ఉప్పు ,
గరం మసాలాపొడి వేసి
కూరంతా కలిసేలా కలిపి బాగా వుడకనివ్వాలి
తరువాత పెరుగుకూడా వేసి కలపాలి
పల్లీ జీడిపప్పుల పొడిని కూడా వేసి బాగా కలిపి

 మరల పావు
గంటసేపు వుడకనివ్వాలి
కూరంతా బాగా దగ్గర పడ్డాక

కొత్తిమీర తో గార్నిష్ చేసు కుంటే
మిక్స్డ్ వెజె ట బుల్ కర్రీ రెడీ
దీనిని చపాతీ  దోశ లలోకి  చేసుకుంటే చాలాబాగుంటుంది

Subha's kitchen

Monday, 13 June 2016

దొండ కాయ ,కొబ్బరి కోరు పల్లీ కారంకూర




                                                         దొండ కాయ  కొబ్బరి కోరు పల్లీ కారంకూర

కావలిసిన పదార్థాలు

1.  దొండ కాయలు పావు కేజి
2.  కొబ్బరి కోరు 2 స్పూన్స్
3. పల్లీలు 2 స్పూన్స్
4. ఉప్పు
5. పసుపు

కారమునకు :
1స్పూన్ సెనగ పప్పు
1 స్పూన్ మినపప్పు
1/2 స్పూన్ ఆవాలు
1/2 స్పూన్ జీలకర్ర
1 స్పూన్ ధనియాలు
5 ఎండుమిరపకాయలు

తయారీ విధానము
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి
పైన చెప్పిన సెనగపప్పు , మినపప్పు , ఆవాలు , జీలకర్ర ,
ధనియాలు , ఎండుమిరపకాయలు , వేసి దోరగా వేపుకుని ,
అవి చల్లారాక మెత్తగా పొడిలా గ్రైండ్ చేసుకోవాలి .

దొండకాయలను పొడుగ్గా సన్నగా చీలికలుగా తరుగుకోవాలి .
తరిగిన దొండకాయ చీలికలను ఒక బాణలి లో
4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దోరగా వేపుకోవాలి ,

స్టవ్ పైన వేరే బాణలి పెట్టి
అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి పల్లీలు వేసి
అవి దోరగా వేగాక

 కొబ్బరికోరు , పసుపు , కరివేపాకు , వేసి దోరగా వేపుకుని
ఈ మిశ్రమంలో దోరగా వేపుకున్న దొండకాయ చీలికలువేసి
 కాసేపు వేగనిచ్చి,
 సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి ,

కాసేపు మగ్గనిచ్చి ముందుగా తాయారు చేసి పెట్టుకున్న
కారము పొడిని కూడా వేసి బాగాకలిపి
కొంచెం సేపు వేగనిచ్చి

పైన కొత్తిమీర చల్లి తే
దొండకాయ కొబ్బరికోరు పల్లి కారము కూర రెడీ

Subha's kitchen

" ఏకబిల్వం శివార్పణం”. మారేడు దళాలు


                                                                   మారేడు దళాలు

                            " ఏకబిల్వం శివార్పణం” అని మారేడు దళము తో శివుని పూజిస్తారు.

పవిత్రమగు ఈశ్వర పూజకు ఈ “బిల్వపత్రము” సర్వశ్రేష్ఠమైనది
మరియు అతి పవిత్రమైనది. శివార్చన లకు మూడు రేకులతోనున్న
పూర్తి బిల్వదళముననే ఉపయోగించవలెను.

ఒకసారి కోసిన బిల్వపత్రములు, సుమారు
15 రోజులవరకు పూజార్హత కల్గియుండును.
వాడిపోయినను దోషములేదు,

కాని మూడురేకులు మాత్రము తప్పనిసరిగా ఉండవలెను.
ఏకబిల్వ పత్రంలోని మూడు రేకులలో
 ఎడమవైపునది బ్రహ్మ అనియు,
కుడీవైపునది విష్ణువనియు,
మధ్యనున్నది సదాశివుడనియు,
పురాణములలో తెలియుచున్నది.

మరియు బిల్వదళములోని ముదుభాగమునందు
అమృతమును,
వెనుక భాగమున
యక్షులును వుండుటచేత,
బిల్వపత్రము యొక్క ముందుభాగమును
శివునివైపు వుంచి పూజించాలి.

శ్లో!!  బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం!
అఘోర పాపసమ్హారం ఏకబిల్వం శివార్పణం!

బిల్వపత్రము యొక్క దర్శనంవలన పుణ్యము లభించును,
వాటిని స్పృశించుట వలన సర్వపాపములు నశించును.

ఒక బిల్వపత్రమును శివునికి భక్తిశ్రధ్ధలతో అర్పించుటవలన,
పాపములు నిర్మూలమగును.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/




Sunday, 12 June 2016

శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ర్యాలి

     
           

                                                  శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ర్యాలి
                                           శ్రీ మహావిష్ణువు ముందువైపు పురుషరూపంలోనూ ,
                                 వెనుకనుంచి చూస్తే స్త్రీ రూపంలోనూ దర్శనమిచ్చే  ఆలయం ఇది.

      తూర్పు గోదావరి జిల్లాలో రావులపాలెంకి 6 కి. మీ. ల దూరంలో ఆత్రేయపురం మండలంలో కలదు.

             11 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్నిచోళరాజులు పరిపాలిస్తూండేవాళ్ళు. అప్పుడు ఇక్కడంతా
              దట్టమైన అరణ్యాలు వుండేవి. చోళ రాజులలో ఒకరైన రాజా విక్రమదేవుడు ఒకసారి ఈ
               ప్రాంతానికి వేటకు వచ్చాడు. కొంతసేపు వేటాడిన తర్వాత అలసిన రాజు ఒక చెట్టుకింద
             పడుకుని నిద్రపోయాడు. ఆ నిద్రలో మహావిష్ణువు ఆయన కలలో కనబడి, తన విగ్రహం
            ఆ ప్రాంతాల్లో వుందని దానిని తీసి ఆలయ నిర్మాణం చేసి పూజలు జరిపించమని చెప్పాడు.
                  ఆ విగ్రహాన్ని కనుగొనటానికి ఒక చెక్క రధాన్ని ఆ ప్రాంతంలో లాగుకుని వెళ్తుంటే
             ఆ రధశీల ఎక్కడ రాలి పడిపోతుందో ,అక్కడ తవ్విస్తే విగ్రహం కనబడుతుందని చెప్పాడు.
       విక్రమదేవుడు భగవతాదేశాన్ని పాటించి ఈ ప్రాంతంలో విగ్రహాన్ని కనుగొని ఆలయాన్ని కట్టించాడు.

       ప్రకృతి సౌందర్యం మధ్య కొలువైవున్న ఈ ఆలయంలోని స్వామి సౌందర్యం వర్ణనాతీతం. ఐదు
       అడుగుల ఎత్తైన సాలిగ్రామ శిల ఇది. మకరతోరణంమీద దశావతారాలు, నారద, తుంబురులు,
       ఆదిశేషు, పొన్నచెట్టు, గోవర్ధనగిరి, మహర్షులు,

         అన్నీ ఆవిగ్రహం చుట్టూ వున్నాయి. ఆ విగ్రహంయొక్క గోళ్ళు కూడా చాలా సజీవంగా
కనిపిస్తాయి  వెనుకవైపునుంచి చూస్తే పద్మినీజాతి స్త్రీ అలంకరణఇక్కడ స్వామి పాదాల దగ్గర చిన్న .         గుంటలో ఎప్పుడూ నీరు వుంటుంది.ఎన్నిసార్లు తీసినా ఆ నీరు అలాగే వూరుతూ వుంటుంది.
తప్పక దర్శించ వలసిన పుణ్య క్షేత్రము .

Saturday, 11 June 2016

బంగాళదుంప వుల్లిముద్ద కూర


                                                       బంగాళదుంప వుల్లిముద్ద కూర

కావలిసిన పదార్థాలు

1. బంగాళ దుంపలు పావుకేజీ
2. ఉల్లిపాయలు 2
3. ఎండుమిరపకాయలు 5
4. ధనియాలు 2 స్పూన్స్
5. జీలకర్ర 1 స్పూన్
6. వెల్లుల్లి రెబ్బలు 3
7. ఉప్పు
8. కరివేపాకు
9. సెనగపప్పు అర స్పూన్
10. మినపప్పు కొద్దిగా
11. జీలకర్ర కొద్దిగా
12. ఆవాలు కొద్దిగా

తయారీ విధానము
బంగాళ దుంపలను తోక్కతీయకుండా
నాలుగు ముక్కలు గా చేసుకుని , కుక్కరు లో  పెట్టి ,
ఉడికించు కోవాలి . ఇవి చల్లారాక,  పైన ఉన్న తొక్క తీసుకోవాలి
పైన చెప్పిన ఎండుమిరపకాయలు , ధనియాలు ,
 ఉల్లిపాయలు , వెల్లుల్లి,  జీలకర్ర , ఉప్పు ,
వేసుకుని మెత్తగా ముద్దలా గ్రైండ్ చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని
పైన చెప్పిన పోపు దినుసులను వేసి అవి వేగాక
ముందుగా తయారు చేసి పెట్టుకున్నఉల్లి ముద్దను వేసి ,
అది పచ్చి వాసనపోయే దాక దోరగా వేపుకుని ,
అది ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని,
 ముందుగా ఉడికించి తొక్క తీసి పెట్టుకున్న,
బంగాళ దుమ్పముక్కలను వేసి దోరగా వేపుకోవాలి ,
ఈ ముక్కలు దోరగా వేగాక
ముందుగావేయించిన ఉల్లి ముద్దను కూడా వేసి
అంతా కలిసేలా కలిపి కొంచెం సేపు మగ్గనిచ్చి
కొంచెము కొత్తిమీర పైన చల్లుకుంటే
బంగాళ దుంప వుల్లి ముద్ద కూర రెడీ
ఈ కూరను చపాతీ అన్నము మినపదోసే లలో బావుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం///Sri Venkateswara Suprabhatam)



                                                            శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
                                                      (Sri Venkateswara Suprabhatam)

కౌసల్యా సుప్రజా రామా పూర్వాసంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికమ్
ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు
మాతస్సమస్త జగతాం మధు కైటభారే
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని
శ్రితజన ప్రియదానశీలే శ్రీ వేంకటేశదయితే తవ సుప్రభాతమ్
తవ సుప్రభాత మరవిందలోచనే
భవతు ప్రసన్న ముఖ చంద్రమండలే
విధి శంకరేంద్ర వనితాభి రర్చితే
వృషశైలనాథ దయితే దయానిధే
అత్ర్యాది సప్తఋషయ స్సముపాస్య సంధ్యాం
ఆకాశసింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాదయుగ మర్చయితుం
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్
పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యః
త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి
భాషాపాటి: పఠతి వాసరశుద్ధిమారాత్ శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్
ఈషత్ప్రపుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాది సుమనోహర పాలికానాం
ఆయాతి మందమనిల స్సహ దివ్యగంధై: శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్
ఉన్మీల్య నేత్రయుగ ముత్తమ పంజరస్థా: పాత్రావశిష్ట కదళీఫల పాయసాని
భుక్త్యా సలీల మథ కేళిశుకాః పఠంతి శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్
తంత్రీప్రకర్ష మధురస్వనయా విపంచ్యా గాయ త్యనంతచరితం తవ నారదో పి
భాషా సమగ్ర మసకృత్కరచరు రమ్యం శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్
భ్రుంగావళీ చ మకరంద రసాను విద్ద ఝుంకారగీత నినదై:
సహసేవనాయ నిర్యా త్యుపాంతసరసీ కమలోదరేభ్యః
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమయోషాగణేన వరదధ్ని విమధ్యమానే
ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషా: రోషాత్కలిం
విదధతే కుకుభశ్చ కుంభాః శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్
పద్మేశమిత్ర శతపత్ర గతాళీవర్గాః హర్తుం శ్రియం కువలయస్య నిజంగాలక్ష్మ్యా భేరీ
నినాదమివ భిభ్రతి తీవ్రనాదం శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్
శ్రీమా న్నభీష్ట వరదాఖిల లోకభందో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీ దేవతా గృహ
భుజాంతర దివ్యమూర్తే శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతమ్
శ్రీ స్వామి పుష్కరిణికా ప్లవ నిర్మలాంగః ద్వారే
వాసంతి వరవేత్ర హతోత్తమాంగా: శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
శ్రీ శేషశైల గరుడాచాల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రిముఖ్యామ్
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
సేవాపరాః శివ సురేశ కృశానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాదినాథా:
బద్దాంజలిప్రవిలస న్నిజ శీర్షదేశాః శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
దాటీఘ తే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాదిరాజాః
స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యసౌరి స్వర్భానుకేటు దివిష త్పరిషత్ప్రదానః శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
త్వత్పాదధూళిభరితస్ఫురితో త్తమాంగా: స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః కల్పాగమాకలనయాకులతాం లభంతే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
త్వద్గోపురాగ్ర శిఖరాని నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః
మర్త్యామనుష్యభువనే మతిమాశ్రయంతే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
శ్రీ భూమి మాయక దాయాది గుణామృతాబ్దే దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే
శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్థన చక్రపాణే
శ్రీ వత్సచిహ్నశరణాగత పారిజాత శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతా కుచాంబురుహ కుట్మలలోల దృష్టే
కల్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్ స్వామిన్
పరస్వథ-తపోధన రామచంద్ర శేషాంశరామ
యదునందన కల్కి రూప శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియత్సరిత హేమఘటేషు పూర్ణమ్
ధృత్వాద్యవైదిక శిఖామణయః ప్రహృష్టాః తిష్టంతి వేంకటపతే తవ సుప్రభాతమ్
భాస్వానుదేతి వికచాని సరోరుహాణి సంపూరయంతి నినదై: కకుభో
విహంగాః శ్రీవైష్ణవాఃసత్ స్త మర్థిత మంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్
బ్రహ్మూదయ స్సురవరా స్సమహర్షయస్తే
సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః
ధామాంతికే తవ హి మంగళవస్తు హస్తాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
లక్ష్మీనివాసనిరవద్య గుణైకసింధో సంసార సాగర సముత్తరనైక సేతో వేదాంత
వేద్య నిజవైభవ భక్తభోగ్య శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
ఇత్థం వృషాచలపతే రిహ సుప్రభాతం
యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః తేషాం ప్రభాత సమయే
స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమం ప్రసూతే
శ్రీ వేంకటేశ్వర సుభ్రభాతం సమాప్తం
-.

Friday, 10 June 2016

నిత్య ప్రార్థన ///// శుక్లాంబర ధరం విష్ణుం,


                                                                     
                                                                        నిత్య ప్రార్థన

1.శుక్లాంబర ధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజమ్|
ప్రసన్న వదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోప శాన్తయే||

2.అగజానన పద్మార్కం, గజానన మహర్నిశం |
అనేకదం తం భక్తానాం, ఏక దన్త ముపాస్మహే||

3.వాగర్థావివ సంపృక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే|
జగతః పితరౌ వన్దే, పార్వతీపరమేశ్వరౌ||

4.ఆపదా మపహర్తారం,
దాతారం సర్వ సంపదామ్|
లోకాభిరామం శ్రీరామం,
మోక్షదం తం  నమా మ్యహమ్||

5.బుద్ధి ర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతా|
అజాడ్యం వాక్పటుత్వంచ,హనుమత్స్మరణా ద్భవేత్||

6.శ్రీవత్సాంకం మహోరస్కం, వనమాలా విరాజితమ్|
శంఖచక్ర ధరం దేవం, కృష్ణం వన్దే జగద్గురుమ్||

7.సరస్వతి! నమస్తుభ్యం, వరదే కామరూపిణి!
విద్యారంభం కరిష్యామి, సిద్ధి ర్భవతు మే సదా ||

8.పద్మపత్ర విశాలాక్షీ  పద్మకేసర వర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ  సా మాం పాతు సరస్వతీ
భగవతీ భారతీ  నిశ్శేష జాడ్యాపహా ! ||

9.గురవే సర్వలోకానాం, భిషజే భవరోగిణామ్|
నిధయే సర్వ విద్యానాం, దక్షిణామూర్తయే నమః||

10.జ్ఞానానన్దమయం దేవం, నిర్మల స్ఫటికాకృతిమ్|
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే||

11.గురు ర్బ్రహ్మా గురు ర్విష్ణుః, గురు ర్దేవో మహేశ్వరః|
గురు స్సాక్షా త్పరంబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః||

12.కృష్ణద్వైపాయనం వ్యాసం, సర్వలోక హితే రతమ్|
వేదాబ్జ భాస్కరమ్ వన్దే,శమాది నిలయం మునిమ్||

Thursday, 9 June 2016

మెంతి మజ్జిగ


                                                                      మెంతి మజ్జిగ

కావలిసిన పదార్థాలు
1.  మజ్జిగ  పావు లీటరు
2.  పచ్చి మిర్చి
3.  కరివేపాకు
4. ఆవాలు అర స్పూన్
5. మెంతులు అర స్పూన్
6. జీలకర్ర అర స్పూన్
7. వాము కొద్దిగా
8. ఇంగువ కొద్దిగా
9. ఎండు మిరపకాయలు 2
10. పసుపు
11. ఉప్పు రుచికి సరిపడా

తయారీ విధానం
ఒక గిన్నెలోకి పావు లీటరు మజ్జిగ ను తీసుకుని
అందులో పసుపు ,
సరిపడినంత ఉప్పు ,
చీలికలుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి
బాగా కలుపుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
2స్పూన్స్ ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపుదినుసులను ,
కరివేపాకు లను వేసి అవి దోరగా  వేగాక
ముందుగా తయారు చేసి పెట్టుకున్న
మజ్జిగ లో వేసి కలుపుకోవాలి
పైన కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
ఘుమ ఘుమ లాడే
మెంతి మజ్జిగ రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi




ఇంద్రకీలాద్రి) శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం.


                                  ఇంద్రకీలాద్రి) శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం.

      విజయవాడ లో ,ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గ అమ్మ వారి  దేవాలయము ,
                  భక్తుల పాలిట  కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఈ అమ్మ వారి ఆలయము
                                   దర్శించి తీరవలిసిన మహిమాన్వితమైన పుణ్య  క్షేత్రము .

" అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ,
చాల పె ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ,
తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ,
దుర్గ మా యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్"

ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత
కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారం 'బెజవాడ కనకదుర్గఅమ్మ"

ఈ గుడి క్షేత్ర పాలకుడు.. ఆంజనేయస్వామి.
అందుకే ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా హనుమను దర్శించుకొని..
ఆపై అమ్మవారిని..
మల్లేశ్వరస్వామివారిని దర్శించుకుని.. ఆశీస్సులు పొందుతుంటారు.

స్థలపురాణం:
మహిషాసురుడిని సంహరించిన అనంతరం
ఇంద్రాది దేవతల కోరికపై , పరమ పవిత్రమైన " ఇంద్రకీలాద్రి " మీద మహామహిమాన్వితమైన
మహిషాసుర మర్దిని రూపంలోనే స్వయంభువుగా వెలిసింది.
 ఉగ్ర స్వరూపిణిగా ఉన్న అమ్మవారిని ,
శంకరాచార్యులు దర్శించుకుని
శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చారని స్థలపురాణంలో ఉంది.

ఉపాలయాలు:
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంతో పాటు
మల్లేశ్వరాలయం,
క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం,
సుబ్రహ్మణ్యేశ్వరాలయం,
నటరాజస్వామి ఆలయం ఉన్నాయి.
అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను సందర్శించి భక్తితో పూజలు చేస్తారు.

Tuesday, 7 June 2016

అల్లం నిలవ పచ్చడి


                                                                   అల్లం నిలవ పచ్చడి

కావలిసిన పదార్థాలు
1.  అల్లం పావుకేజీ
2. చింతపండు  పావు కేజీ
3. కారము పావు కేజీ
4. ధనియాలు 50 గ్రాములు
5. బెల్లము పావుకేజీ
6. 100గ్రాములు ఆవాలు
7.   50 గ్రాములు మెంతులు
8. ఇంగువ
9. జీలకర్ర  50 గ్రాములు

తయారీ విధానం
ముందుగా చింతపండు ను ఒక గిన్నె లోకి తీసుకుని
 అది నానేలా నీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలి .
నానిన చింతపండును చిక్కగా  పిప్పిలు లేకుండా గుజ్జు లా తీసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి పైన చెప్పిన ధనియాలు ,
ఆవాలు ,మెంతులు ,జీలకర్ర ,ఇంగువ ,
వేసి దోరగా వేపుకుని అవి చల్లారాక
మెత్తగా పొడి లా గ్రైండ్ చేసుకోవాలి .
అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకుని
అవి దోరగావేపుకోవాలి.
 చల్లారాక దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
గుజ్జులా తీసుకున్న చింత పండుని
ఒక 5 నిముషాలు ఉడికించుకుని
దీనిలో అల్లం ముద్ద ,పసుపు ,సరిపడినంత ఉప్పు వేసి ,
కొంత సేపు మగ్గనిచ్చి ,
ముందుగా తయారు చేసి పెట్టుకున్న
ధనియాలు ,ఆవాలు ,మెంతులు ,జీలకర్ర పొడిని ,
వేసి కలపాలి .
తరువాత  కారము పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి .
స్టవ్ మీదబాణలి పెట్టి అందులో బెల్లము వేసి ,
కొంచెము నీళ్ళు పోసి ,పాకము రానిచ్చి
అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న
అల్లము  మిశ్రమాన్ని వేసి
బాగా కలిపి దగ్గర పడెంతవరకు ఉంచి
స్టవ్ మీద నుండి దింపెయ్యాలి .
అల్లం నిలవ పచ్చడి రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

Monday, 6 June 2016

టమాటో మునగకాడ ఉల్లిపాయ కూర



                                                    టమాటో మునగకాడ ఉల్లిపాయ కూర

కావలిసిన పదార్థాలు

1. టమాటోలు  ఎర్రనివి 6
2. ఉల్లిపాయలు 4
3. మునగ కాడలు 2
4. పచ్చిమిర్చి 2
5. కరివేపాకు
6. కొత్తి మీర

పోపుదినుసులు
సెనగపప్పు 1
స్పూన్ మినపప్పు 1
జీలకర్ర ఆర స్పూన్
ఆవాలు అర స్పూన్
ఎండు  మిరపకాయ 1
ఉప్పు  
కారము
 కొద్దిగా పసుపు

తయారీ విధానము
ముందుగా టమాటో  , ఉల్లిపాయలు , మునగాకాడ లను ,
చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను వేసి అవి దోరగా వేగాక
తరిగిపెట్టుకున్న కూర ముక్కలను ,
కరివేపాకు , కారము ,ఉప్పు ,పసుపు వేసి
బాగా కలిపి కొంచెము నీళ్ళు పోసి మగ్గనివాలి
నీరంతా పోయి కూరంతా దగర పడేంత వరకు
స్టవ్ మీద వుంచి దగ్గర పడ్డాక
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
టమాటో ఉల్లిపాయ మునగకాడ కూర రెడీ
 ఈ  కూరను అన్నంలోకి చపాతీలోకి రవ్వ దోసె లోకి బాగుంటుంది

Subha's Kitchen

Sunday, 5 June 2016

పనస పొట్టు ఆవ పెట్టి కూర



                                                             పనస పొట్టు   "ఆవ " పెట్టి కూర

కావలిసిన పదార్థాలు

1. పనస పొట్టు 1/4 కేజీ
2. పచ్చి మిరపకాయలు  6
3. అల్లం  చిన్న ముక్క
4. కరివేపాకు
5. చింత పండు రసం 2స్పూన్స్
6.  ఆవ ముద్ద 1 స్పూను

పోపు దినుసులు

సెనగ పప్పు 2 స్పూన్స్
మినపప్పు 2 స్పూన్స్
ఆవాలు   స్పూన్
జీలకర్ర 1స్పూన్
ఇంగువ కొద్దిగా
ఎండుమిరపకాయలు  3

తయారీ విధానము
ముందుగా పనస పొట్టు ని ఒక గ్లాసు నీళ్ళు పోసి
ఉడికించుకుని చల్లార బెట్టుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి
కొద్దిగా పసుపు వేసుకుని
పైన చెప్పిన పోపు దినుసులను వేసి
అవి దోరగా వేగాక
తరిగి పెట్టుకున పచ్చిమిర్చిచీలికలు,  అల్లం ముక్కలు ,
కరివేపాకు వేసి అవి కూడా వేగాక
ఉడికించి చల్లార బెట్టుకున్న పనసపొట్టు నికూడా వేసి
కొంచెం సేపు మగ్గనిచ్చి
దాంట్లో చింత పండురసం , సరిపడీ నంత ఉప్పు వేసి
బాగా కలిసేలా కలిపి
తడి పోయేంత వరకు స్టవ్ మంట సిం లో పెట్టి మగ్గనివ్వాలి .
కూర బాగా చల్లారిన తరువాత
ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవముద్ద ను కలపాలి
గుమ్మడి కాయ వడియాలు  కానీ ,
లేకపోతే వరిపిండి వడియాలను  వేయించి
ఈ కూర లో కలుపుకోవాలి
ఘుమఘుమలాడే పనస పొట్టు కూర రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.






విజయము సాధించే వారి లక్షణాలు

 
                                 

                                                  విజయము సాధించే వారి లక్షణాలు

1. ఈ ప్రపంచములో గెలుపు సాధించిన వ్యక్తి నే సంఘము గుర్తించి గౌరవిస్తుంది

2. గెలుపు సాధించాలి అంటే ఎన్నో కష్టాలను ఎదురుకోవాలి

3. విజయము సాధించిన వ్యక్తులను గమనిస్తే ,వారికీ ఓకే గమ్యము ఉంటుంది .వారి  పనులన్నీ
    గమ్యము వైపే సాగుతాయి

4. వారిపై వారికి అంతులేని నమ్మకము ఉంటుంది

5. ఓక లక్ష్యమును నిర్దేశించు కున్న తరువాత అటు ఇటు జారి పోకుండా దాన్ని పూర్తి
    చేయడానికి    ప్రయత్నిస్తారు

6. ప్రారంభము నుంచే గొప్ప ఫలితాలని ఆశించరు

7. ప్రారంభము లో ఏ అంకిత భావము తో ఉన్నారో విజయాలు అందుకుంటూ కూడా అదే అంకిత
    భావము తో పని చేస్తారు

8. లక్ష్యమును చేరుకొనే వరకు చిన్ని చిన్ని ఆనందాలు ను కోల్పోయినా  అందుకు బాధపడరు

9. ఎన్ని ఒడిదుడుకులు వచ్చి నా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోరు

10. నిరంతరమూ కృషి పట్టుదల తో వారు అదృష్టాన్ని శాసించే స్థాయి కి ఎదగ గలిగారు

11. నాయకత్వము వహించే శక్తి ,పటిష్టమైన మానవ సంభందాలు నిర్మించుకొనే శక్తి వారి సొంతము. 

Saturday, 4 June 2016

దబ్బకాయ పొక్కింపు


దబ్బకాయ పొక్కింపు

కావలిసిన పదార్థాలు
1. నార దబ్బ కాయలు  2
2. పసుపు
3. ఉప్పు
4. ఎండు మిరపకాయలు పావుకేజీ
5. ఆవాలు 3 స్పూన్స్
6. ఇంగువ
7. ఆయిల్  1 స్పూన్
8. జీలకర్ర
9. మెంతులు 3 స్పూన్స్
10. బెల్లం

తయారీవిదానము
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి
పైన చెప్పిన ఎండుమిరపకాయలు ,
ఆవాలు , మెంతులు , జీలకర్ర , ఇంగువ
వేసి దోరగా వేపుకోవాలి
ఇవి చల్లారాక్
మెత్తగా పొడి లా గ్రైండ్ చేసుకోవాలి .
దబ్బ కాయలను చిన్న ముక్కలుగా తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి దీంట్లో
 తరిగిన దబ్బ కాయ ముక్కలు ,  కొంచెము బెల్లము ,
పసుపు , సరిపడినంత ఉప్పు వేసి ,
ఒక గ్లాసు నీళ్ళు పోసి ,
బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి
బాగా దగ్గర పడ్డాక ,
ముందుగా తయారు చేసి పెట్టుకున్న కారము  పొడిని
వేసి బాగా కలుపుకోవాలి,
ఒక బాణలిలో కొంచెము ఆయిల్ ,
ఇంగువవేసి వేడెక్క నివ్వాలి
దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న దబ్బ కాయ కారపు మిశ్రమాని వేసి
 కలుపుకుంటే
ఘుమఘుమ లాడే దబ్బ కాయ పొక్కింపు రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

పెసర పప్పు పులుసు


                                                                 పెసర పప్పు పులుసు

కావలిసినపదార్థాలు :

1. పెసర పప్పు 2 కప్పులు
2. ఉల్లిపాయలు 3
3. టమాటోలు 2
4. బెండకాయలు2
5.  మునగకాయలు 2
6. పచ్చిమిర్చి 3
7. వంకాయలు 2
8. పసుపు
9. ఉప్పు
10. చింతపండు
11. నిమ్మకాయంత  బెల్లం 1 స్పూన్
12.  కరివేపాకు

పోపుకి
అర స్పూన్ ఆవాలు ,అర స్పూన్ మెంతులు ,
అర స్పూన్ జీలకర్ర, ఇంగువ వెల్లుల్లి రెబ్బలు 2 ,
ఎండుమిరపకాయలు  2

తయారీవిధానం
చింత పండుని ఒక గిన్నెలోకి తీసుకుని
దాంట్లో 2 గ్లాసుల నీళ్ళు పోసి నానబెట్టాలి .

స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి

పైన చెప్పిన పొపుదినుసులను వేసి
 అవి వేగాక

మునగ కాడలు తప్ప
మిగిలిన అన్ని కూర ముక్కలను వేసి వేపుకోవాలి .

పెసర పప్పుని శుభ్రంగా కడుక్కుని
దాంట్లో తరిగి పెట్టుకున్న మునగ కాడలు
2 గ్లాసుల నీళ్ళు పోసి బాగా మెత్తగా వుడకనివ్వాలి .

పప్పు మెత్త గా ఉడికిన తరువాత

ముందుగా వేపుకుని పెట్టుకున్న కూరముక్కలు
ఉప్పు , పసుపు , చింత పండు రసం వేసి బాగా కలిపి వుడకనివ్వాలి .
మధ్య మధ్య లో కలుపుతూ వుండాలి

బాగా మరిగాక
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
పెసర పప్పు పులుసు రెడీ 
ఇది అన్నం లోకి , రవ్వదోసె లోకి,  చపాతీ లోకి , బావుంటుంది

Subha's Kitchen

Friday, 3 June 2016

బీర కాయ కారం పెట్టి కూర

                                                           
                                                               బీర కాయ కారం  పెట్టి కూర


కావలిసిన పదార్థాలు

1. బీర కాయలు పావు కేజీ
2. ఉల్లిపాయలు 2
3. కొత్తిమీర

కారం పొడి తయారీకి

1. సెనగ పప్పు 3 స్పూన్స్
2. మినపప్పు 3 స్పూన్స్
3. ఆవాలు 1 స్పూన్                                                
4. జీలకర్ర 1 స్పూన్
5. ధనియాలు 2స్పూన్స్
6. ఎండుమిరపకాయలు 8
7. ఉప్పు
8. పసుపు

తయారీ విధానం

ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 2స్పూన్ ఆయిల్ వేసుకుని ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోరగా వేపుకోవాలి

ఇవి చల్లారాక తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి,
 ఉల్లిపాయలను సన్నగా తరుగుకోవాలి

బీరకాయలను కూడా పైన వున్న పొట్టు తీసివేసి
సన్నగా ,తరుగు కోవాలి

ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 3స్పూన్స్ ఆయిల్ వేసి
తరిగిపెట్టుకున్న వుల్లిపాయముక్కలను వేసి ,

అవి దోరగా వేగాక

తరిగిపెట్టుకున్న బీరకాయ ముక్కలు , పసుపు,  కొద్దిగా ఉప్పు వేసి ,
కొంచెం సేపు మగ్గనిచ్చి న తరువాత ,

ముందుగా తయారుచేసి పెట్టుకున్న కారము పొడి వేసి,
 బాగా కలిపి
 దాంట్లో చిన్న గ్లాస్ నీళ్ళు పోసి
బాగా ఉడకనివ్వాలి

కూర  అంతాబాగా దగ్గర పడ్డాక
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
బీర కాయ కారం కూర రెడీ

Subha's Kitchen

కొబ్బరి కోరు శనగ పప్పు పచ్చడి



                                                          కొబ్బరి కోరు శనగ  పప్పు  పచ్చడి

కావలసిన పదార్థాలు

1. ముదురుకొబ్బరి  కోరు  2 కప్పులు
2.  పుట్నాల పప్పు 2 కప్పులు ( శనగ  పప్పు )
3. పచ్చి మిర్చి  6. 
4. ఉప్పు

పోపుకి
నూని  రెండు స్పూన్స్
1స్పూన్ మినపప్పు ,
 అర స్పూన్ ఆవాలు ,
అర స్పూన్ జీల కర్ర ,
 ఎండు మిరప కాయ 1 ,
కరివేపాకు

తయారీ విధానము
ముందుగా కొబ్బరి కోరు , పుట్నాల పప్పు,  పచ్చి మిర్చి
తగినంత  ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్  చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
 ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను
కరివేపాకు  వేసి దోరగా వేపుకోవాలి
దీనిని తయారు చేసుకున్న పచ్చడి మీద వేసుకుంటే
ఘుమఘుమ లాడే కొబ్బరి కోరు పుట్నాల పప్పు పచ్చడి రెడీ
దీనిని ఇడ్లీ రవ్వ దోసె  మినప దోసె పెసరట్టు ఉప్మా లలోకి బావుంటుంది

తక్కువ సమయము లో తయారయ్యే రుచి కరమైన చట్ని
ఇది ప్రయత్నించి చూడండి

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.

Thursday, 2 June 2016

కొబ్బరి కాయ పచ్చడి



                                                                 కొబ్బరి కాయ పచ్చడి

కావలిసిన పదార్థాలు

1.  కొబ్బరి కాయ 1
2. పచ్చి మిరపకాయలు 2
3. ఎండు మిరపకాయలు 8
4  సెనగ పప్పు 2స్పూన్స్
5.  మినపప్పు 2 స్పూన్స్
6. ఆవాలు 1 స్పూన్
7. ధనియాలు 2స్పూన్స్
8. జీలకర్ర 1స్పూన్
9. ఇంగువ  కొంచెం
10. బెల్లం చిన్న ముక్క
11. చింత పండు కొంచెం
12.  పసుపు
13.  కరివేపాకు
14. ఉప్పు

తయారీ విధానము
 ముందుగా స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టి  2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని
పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోర గా వేపుకోవాలి
ఇవి చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి

కొబ్బరి కాయను కొట్టి చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
తరిగిన కొబ్బరి ముక్కలు  , పసుపు ,
పచ్చిమిర్చి  , చింత పండు , ఉప్పు , బెల్లం , వేసి మెత్తగా గ్రైండ్  చేసుకోవాలి

దీంట్లో ముందుగాగ్రైండ్ చేసిపెట్టుకున్న కారము పొడిని వేసి
బాగా కలిసేలా కలుపుకోవాలి

స్టవ్ మీద బాణలి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి
మినపప్పు  , ఆవాలు , జీలకర్ర , ఇంగువ , కరివేపాకు , ఎండు మిరపకాయ , వేసివేపుకోవాలి
దీనిని తయారుచేసుకున్న పచ్చడి  మీద వేసుకుంటే

ఘుమఘుమ లాడే కొబ్బరి కాయ పచ్చడి రెడీ

Subh's kitchen