" కళాతపస్వి "
కళామ తల్లి మణి హారానికి. " దాదా సాహెబ్ ఫాల్కే ",
సినీ ప్రపంచ చరిత్రలో అపురూపమైన ఘనత తెలుగు వారి గర్వకారణము డా .శ్రీ. K.విశ్వనాధ్ గారికి రావడము , తెలుగు జాతి యావత్తు సంతోష , సంబరాలతో పండగ చేసుకుంటోంది .
డా .శ్రీ. K.విశ్వనాధ్ గారికి శుభాభి వందనలతో .....
తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ కళాతపస్వి డా .శ్రీ. K.విశ్వనాధ్ గారు కలమునుండి విరిసిన వెండితెర పారిజాతాలు ఎన్నో అన్నీ అద్భుత ద్రుశ్యకావ్యాలే.యావత్ ప్రపంచము గర్వించే విధంగా సినిమాలు తీయడంలో ఆయన దర్శకత్వ ప్రతిభ అనిర్వచనీయం .
సంస్కృతీ , సంప్రదాయాలకు నిలయం ఆ "విశ్వనాధుని " సినిమాలు .సినీచరిత్రలో తనదంటూ ప్రత్యేక శైలి , సినిమా పేరు చూడగానే ఇది విశ్వనాథ గారి సినిమా అంటారు.
తెలుగు సొగసుల పారిజాతాలు వెండితెర శిల్పాలు అయిన ఈ "కళా తపస్వి "చిత్రాలు , మన సంస్కృతి , సంప్రదాయాలకు నిలువుటద్దాలు .ఆయన ప్రతి సినిమా వైవిధ్యంగా కళలకు పీఠం వేస్తూ సంస్కృతీ సంప్రదాయాలకు పట్టం కడుతూ ఒక ప్రత్యేక శైలి లో ఉంటాయి .
కవులకు స్వేఛ,కళలకు నిలయము శ్రీ విశ్వనాధ్ గారి కళత్మక ,సృజనాత్మక ,వెండి తెర శిల్పాలు ఆయన చిత్రాలు.
సినిమా ఆయన తపస్సు ,ఆయన సినిమాలో చేయాలని అనుకోని నటులు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. ప్రతి సినిమా ఒక "సువర్ణ కమలమే" .తెలుగు వారి సినీ సౌరభాన్ని జగత్ విఖ్యాతము చేసిన మహానుభావుడు "కళాతపస్వి "Dr.sri.K.విశ్వనాథ్" గారు .
చెన్నై లోఒక స్టూడియోలో sound designer గా పని చేస్తూ , తన సినీ జీవితంఆయన పయనము దర్శకత్వము వైపుకి మళ్ళింది. ఆదుర్తి సుబ్బా రావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా తొలి అడుగు
వేశారు .
కె బాలచందర్ గారు , మరియు బాపు గార్ల దగ్గర పని చేయడానికి బాగా ఇష్ట పడేవారు .ఆత్మ గౌరవం '
డా. అక్కినేని.నాగేశ్వరరావు గారు నటించిన. చిత్రానికి తొలి సారిగా దర్శ కత్వం వహించారు. ఆ చిత్రానికి best feature film నంది అవార్డ్ లభించింది.
ఆ తరువాత వరుసగా చెల్లెలి కాపురం, శారద, ఓ సీత కధ ,జీవన జ్యోతి వరుస హిట్లే. 'సిరిసిరిమువ్వ' చిత్రమునుంచి విశ్వనాథ్ గారి ప్రతిభ విఖ్యాతం అవ్వడం ప్రారంభం అయ్యింది. అక్కడినుండి ఆయన సినిమాలు కళలకు ప్రాధాన్యాన్నిస్తూ నడిచాయి .
అలా మొదలైన ఆయన దర్సకత్వ పరిమళాలు దశదిశలా వ్యాపించాయి. ఇంకా వ్యాపిస్తునే ఉన్నాయి .
చిరంజీవి, కమల్ హాసన్, మమ్ముట్టి, వెంకటేష్ అగ్రనటులు నటించి తమ నటనా కౌశలానికి మెరుగులుదిద్దుకున్నారు. ఆయన తో చేసిన సినిమాలు ,తమ కీర్తి కిరిటాలలో కలికి తురాయి లు అని అంటారు.
సాహిత్యానికి ఆయన పెద్ద పీట వేస్తారు .పాటలన్నీ కళాత్మక హృదయం తో తీసినవే.
అద్భుతమైన సాహితీ సంపద మనకు కనిపిస్తుంది.
కవులకు పూర్తిస్వేచ్చ నిస్తారు. తన మనసులోని భావాలకు తగ్గట్టు గా మలుచుకుని దృశ్య కావ్యం గా మలుస్తారు. అందుకే ఆయనసినిమాలోని పాట లన్ని అప్పటికి, ఇప్పటికి మనోరంజకాలే.
శ్రీ విశ్వనాద్ గారు , శ్రీ వేటూరి సుందర రామ మూర్తి గారు కాంబినేషన్ లో వచ్చిన,పాటలు అద్భుతాలు
సృస్టించాయి.
సిరివెన్నెలలో పరిచయం చేసిన మహాకవి శ్రీసీతారామ శాస్త్రి గారు ఆ సినిమానే తమ ఇంటి పేరుగా మార్చేసుకున్నారు .
J.V. సోమయాజులు గారు శంకరాభరణం "శంకరశాస్త్రి " అయ్యారు .
కమల్ హాసన్ గారు' స్వాతిముత్యం', చిరంజీవి గారు 'స్వయంకృషి' , ఇలా ఎందరో ఆయన సినిమాలను తమ జీవితంలో భాగంగా మార్చేసుకున్నారు.
పాశ్చాత్యసంగీత పోకడలతో మన సంగీతం నిర్లక్ష్యమునకు గురి అవుతుంది
దాన్ని మనం కాపాడుకోవాలి , అని తీసిన "శంకరాభరణం " మన సంగీత సాహిత్య విలువలకు నిలువుటద్దం.
పలు సామాజిక అంశాలను కూడా అద్భుతంగా సృసించారు శ్రీ విశ్వనాధ్ గారు.
సప్త పది, సిరివెన్నెల, సూత్రధారులు, శుభ లేఖ ,శృతి లయలు, శుభసంకల్పం , ఆపద్భాందవుడు, స్వయంకృషి, స్వర్ణ కమలం ఇలా ఆయన కలం నుండి జాలు
వారిన సువర్ణ కమలాలు ఎన్నో.
నృత్యం ప్రాధాన్యంగా తీసిన సినిమాలు అత్యధికంగా ప్రజాదరణ పొందాయి .
1995 లో నటుడిగా తన పరిచయం 'శుభ సంకల్పం ' లో జరిగింది. కేవలం
దర్శకత్వ ప్రతిభే కాక నటన లోని ప్రతిభ కూడా చాలా సినిమాలు చేయడానికి కారణమైంది.
స్వరాభిషేకం, పాండురంగడు, నరసింహ నాయుడు, లక్ష్మి నరసింహ, సంతోషం, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే , లాంటి సినిమాల్లో తమ నటనా చాతుర్యాన్ని చూపించారు.
1992లొ భారత ప్రభుత్వం వారు 'పద్మ శ్రీ ' అవార్డు , 1992 లో రఘుపతి వెంకయ్య
అవార్డు. for life time achievement. ఇచ్చి సత్కరించారు.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల కిరీటంలో మన కళాతపస్వి
ఓ కలికి తురాయి
కానీ ఎన్ని చెప్పిన ఒక్క మాట మాత్రం చెప్పకుండా ముగించలేము శ్రీ విశ్వనాధ్ గారిని ఈ ఆవార్డు తో సత్కరించారు అనడము తొ పాటు ,
శ్రీ విశ్వనాధ్ గారిని సత్కరించుకొని ,ఈ ఆవార్ద్ కు కూడా గౌరవము పెరిగిందని అనడములో అతిశయొక్తి లేదు
గురుభ్యోనమః🙏🙏🙏