" మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన "
ఆరోజు రఘవయ్య గారు ఆలస్యముగా ఇంటికి వచ్చారు .
" ఏమండీ ఇంత ఆలస్యము అయింది ఈ వేళ "ఆంటూ మంచినీళ్ళు అందించింది
ఆయన భార్య అన్నపూర్ణ .
"ఈ వేళ అమ్మాయి కి మంచి సంబంధము వచ్చింది .బాగా కలిగిన కుటుంబము .అబ్బాయి బిజినెస్ చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు . ఒక్కడే కొదుకు.
అన్ని బాగున్నాయి అని "రేపే పెళ్ళి చూపులకు రమ్మని ఆహ్వానించి " వస్తున్నాను. అన్నాడు..
"ఇంత సడన్ గా పెళ్ళి చూపులు అంటే ఎలా . "అన్నీ చూసుకోవాలిగా ." ఆన్నది అన్నపూర్ణ .
"మంచి సంభంధాలు అస్తమాను దొరకవు ,"కాస్త కష్ట పడదాము . "అమ్మాయి జీవితము స్థిర పడుతుంది . "
ఇంతకీ పిల్లలు ఏరి ? వాళ్లకి చెప్పాలి . అంటూ పిలిచాడు
వాళ్లూ ఇంకా భోజనము చేయలేదు మీ గురించి ఎదురు చూస్తున్నారు అందరమూ కలిసే భోజనము చేద్దాము అంటూ పిల్లలిని పిలిచింది
"ఒరే అబ్బాయి రేపు మీ అక్కకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసాను "
"మంచి సంబంధము ,అస్తమాను అవకాశాలు రావు" ,
ఏం అమ్మ "నువ్వు ఇస్తాపడితేనే , ఈ సంబందం ఖాయము చేద్దాము "సరేనా అన్నాడు
"మీ ఇష్టము నాన్నగారు మీరు అంతా చూసుకుంటారు కదా "నాకేది మంచో మీకు బాగా తెలుసు "
"మీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యండి "అన్నది.
తన కూతురు తన మాటకు ఇచ్హిన గౌరవము చూసి పొంగిపొయాడు .
మరునాడు పెళ్ళివారు వచ్చారు" అమ్మాయి చాలా బాగా నచ్చింది.
"మా అబ్బాయి గురించి వివరాలు ముందే చెప్పాము "
"మాకు కట్న కానుకల మీద ఆశ లేదు " కాని పెళ్లి ఘనము గా జరగాలి
" మా స్టేటస్ తగ్గట్లు గా ఉండాలి "అదే మేము కోరుకునేది అన్నాడు "అబ్బాయి తండ్రి .
"యెంత మాట తప్పకుండా మీరు ఎలా చెపితే అలాగే చేస్తాము "అన్నాడు రాఘవయ్య
"ఇంకో వారము రోజులలొ మంచి ముహూర్తము ఉన్నది ట "మా పంతులు గారు చెప్పారు
ఆ ముహూర్తానికి చేసేద్దాము "అన్నారు పెళ్లి కొడుకు తల్లి తండ్రి .
"ఇంత తక్కువ సమయము అంటే మేము అన్నీ చూసుకోవాలి కదండీ "అన్నారు
"మీకు ఆ భయము అక్కరలేదు "కళ్యాణ మండపము మేము బుక్ చేస్తాము
కొంచెం ఖరీదు ఐయినా మా స్టేటస్ కు తగ్గట్టు గా ఉంటుంది
ఇంక భోజనాలు అవి ఎలాగు కాటరింగ్ , " పెళ్లి బట్టలకు ఒకరోజు చాలు ."
"మీరు డబ్బు చూసుకుంటే చాలు "అంటూ అబ్బాయి కేసి చూసి నవ్వాడు .
మళ్ళి నాకు "ఫారిన్ ట్రిప్ ఉన్నది రెండు నెలల వరకు ఖాళి ఉండదు "
ఈ లోపు పెళ్లి చేసిస్తే అమ్మాయి తో కూడా వెళదామని నా ఆలోచాన "అన్నాడు పెళ్లి కొడుకు .
ఇంత సడ్డెన్ గా అంత డబ్బూ ఎలా సర్దాలొ అర్థము కావట్లేదు .
"ఒకసారి మా వాళ్లతో కుడా మాట్లాడి చెపుతాను " అంటూ లోపలికి వెళ్లారు .
అన్నపూర్నా, పిల్లలూ "ఇది సంగతి "
"మంచి సంభందము కానీ సమయము తక్కువ "
డబ్బు ఎలా సర్దుబాటు చేయాలో అర్థము కావటము లేదు "అన్నారు
"ఇందులో ఆలోచించ డానికి ఏముంది "మన ఇల్లు అమ్మెద్దాము "తరువాత
నాకూ ఉద్యోగమూ వస్తుంది కదా అప్పుడు మళ్లీ కొనవచ్చు .
ఇలాంటి సంభందము మళ్లీ దొరకదు .
"ఉన్న ఇల్లు అమ్మేస్తే మీరు ఎక్కడ ఉంటారు అవసరము లేదు ఈ సంభందము వద్దని చెప్పేయండి "నాన్నగారు అన్నది కూతురు
"ని భవిష్యత్ కన్నా ఈ ఇల్లు ఎక్కువ ఏమి కాదు నేను చూసుకుంటాను "అంటూ బయటకు వచారు .
"అయ్యా మీరు చెప్పినట్లే చేద్దాము కానీ ఇప్పటికి ఇప్పుడు డబ్బు సర్దుబాటు కాదు కనుక మా ఇల్లు అమ్మేసి చేస్తాము "
"మనము తాంబులములు మార్చుకుని పనులు ప్రారంభించుదాము "అన్నారు దానికేముంది "మేము అన్ని ఏర్పాట్ల తోనే వచ్హాము "అందరూ ఒక సారి హాలులో కి వస్తే పంతులుగారు ఆ కార్యక్రమము మొదలు పెడతారు" అన్నారు .తాంబూలము కార్యక్రమము తరువాత పెళ్ళికొడుకు తండ్రి అన్నట్టు "మీరు ఇల్లు అమ్మడానికి ఎక్కడికో వెళ్లక్కరలేదు మేమే కోనేస్తాము " ఆ డాకుమెంట్స్ ఇచెస్తే పెళ్లి తరువాత ,రిజిస్టర్ చేసుకుందాము " అన్నాడు .
"ఎవరికైతే ఏమిటి ఎవరికో ఒకరికి అమ్మాలి కదా "
"ఉండండి ఆ కాగితాలు ఇప్పుడే తెస్తాను అంటూ లోపలికి వెళ్లి తెచ్హి ఇచ్చాడు "
"ఇప్పుడు మా దాగ్గర 10 లక్ష లు కాష్ ఉన్నది మిగతాది చెక్ ఇస్తాను "అంటూ
ఒరేయ్ అబ్బాయి "అ చెక్ రాసి ఇచెయ్ మేము బయలుదేరుతాము "అంటూ
వస్తామండి ఇంకా చాలా పనులు ఉన్నాయ్ అంటూ బయలుదేరారు
"ఉండు బాబు నాన్నగారిని పంపించి వస్తాను " అంటూ గేటు దాకా వచ్చి సాగనంపారు .
లోపలి కి రాగానే కాష్ మరియు చెక్ష్క్ బాగ్ రాఘవయ్యగారికి ఇస్తూ ఆ కాగితాలు
తీసుకున్నాడు .
మరి "నేను వెళ్లి వస్తానండి మామయ్యగారు "అన్నాడు రాజేష్ .
గుమ్మం దాక వెళ్ళిన రాజేష్ వెనక్కి తిరిగి "మీతో ఒక ముఖ్యమైన విషయము మాట్లాడాలి "అన్నాడు .
"ఇంకా ఏమిటి బాబు రండి ఇలా కుర్చుని మాట్లాడుదాము " అన్నారు. కుర్చున్నతరువాత "ఓ మంచి కాఫీ ఇస్తార , మీరు కూర్చోండి అత్తయ్యగారు మీ అమ్మాయి తెస్తుంది లెండి ."
"వెల్లమ్మ వెళ్ళు అన్నాడు నవ్వుతూ . "
"పెళ్లి పేరు చెప్పి మా ఇల్లు అమ్మించెసారు .నికు కారము కాఫీ ఇస్తా" తిక్కకుదురుతుంది అంటూ పంచదార బదులు కారము కలిపింది .
ఇంతకీ నేన చెప్పేది ఏమిటంటే" మాది చాల డబ్బు ఉన్న ఫ్యామిలి .
" వచ్చిన సంభందాలన్నీ మా ఆస్తి చూసి వచ్చిన వి .
" మాకు మమ్మలిని ప్రేమించే మనుషులు కావాలి . "
నాన్న గారు మీ కుటుంబము గురించి అన్ని విధాల తెలుసుకుని
" ఈ సంభందము ఫిక్స్ చేసారు నాకే కొంచము అనుమానము అంటే
"పరీక్షించి చూసుకో "అన్నారు అందుకే ఇలా మాట్లాడారు .
"కూతురి సుఖము కోసము ఇల్లు అమ్మేసే తల్లి తండ్రి ,"
" అక్క కోసము తన ఆస్తి హక్కుని వదులుకున్న తమ్ముడు,"
"మీకొసము అసలు పెళ్ళే వద్దనుకున్న కూతురు "
"నిజము గా ఆదర్సవంతమైన కుటుంబము "
"ఇలాంటి కుటుంబము నుంచి మేము పిల్లని కోరుకున్నాము "
"మనుషులు బంధాల కోసము ,డబ్బుకు విలువ ఇవ్వని మీ ఆదర్శము "
మాకు బాగా నచ్చింది .
"నిజానికి పెళ్లి ఏర్పాట్లు అన్ని చేసేసారు.పెళ్లి ఖర్చులు అన్నీ మావే .
"మీరు కళ్యాణ మండపము కు వచ్చి కన్యాదానము చేస్తే చాలు "
ఇల్లు అమ్మడము కేవలము పరిక్ష మాత్రమె.
"ఆ ..ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బు ,పెళ్లి ఖర్చులకి మా తరపున చిరు కానుక . "
"ఇదిగోనండి మీ ఇంటి కాగితాలు "అంటూ తిరిగి ఇచ్చేసాడు
అందరు ఒక్కసారి ఆశ్చర్య పోయారు
"నిజానికి మేము అదృష్టవంతులం బాబు "అంటూ కళ్ళు తుడుచుకున్నారు
"అబ్బబ్బ ఎండలు మండి పోతున్నాయి " ఇదిగో శుభలేఖలు "అంటూ అందించాడు రాజేష్ ఫ్రెండ్
ఇంతలో కాఫీ వచ్చింది "అది అక్కడపెట్ట్టి ఇంకో మంచి కాఫీ పట్టుకు రామ్మా"
అన్నాడు రాజేష్ "నువ్వు చేసిన పని నాకు తెలుసులే " అన్నట్టు
"మళ్ళి ఇంకోటి ఎందుకు ఇదే తాగేస్తాను "అంటూ నోట్లో పోసుకున్నాడు
"కెవ్వు మని అరిచాడు , "అబ్బో మంట మంచినీళ్ళు అంటూ " అక్కడ ఉన్న బాటిల్ లో నీళ్ళు తాగేసాడు .
"నేను చెప్పానా మరి వద్దని "మీ అమ్మాయి గడుసుదే " అంటూ నవ్వేసాడు
"బయలు దేరతాము మేము ఇంకా చాలాపనులు ఉన్నాయ్ "
" అన్నట్టు పెళ్లి ఘనము గా చెయ్యాలండి మరి " అని "నందిని" కి సైగ చేసి నవ్వుతూ తన మనసుకు నచ్చిన అమ్మాయి తో పెళ్లి కుదిరినందుకు ఆనందముగా బయలు దేరాడు.
రాఘవయ్య గారి ఇంట్లో ఆనందాలు తో పెళ్లి పనులు మొదలు పెట్టారు .
.. శుభం