యాలకుల్లో ఔషధాంశాలు
యాలక్కాయకి ఒక సుగంధ ద్రవ్యం అన్న పేరే స్థిరపడింది. అయితే ఆహార పదార్థాలకు సహజసిద్ధమైన సుగంధం, కమ్మదనం ఇవ్వడమే కాదు. యాలకుల్లో ఔషధ గుణాలు కూడా చాలానే ఉన్నాయి.
1. యాలకుల్లో జీర్ణశక్తిని పెంచే గుణం ఎక్కువ. అందువల్ల యాలకులు, సోంపు, ధనియాల మిశ్రమాన్ని భోజనం తరువాత తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.
2. ఒక యాలక్కాయని నమిలి చూడండి మౌత ఫ్రెషనర్‌గా ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసనను అరికట్టడమే కాకుండా, నోటిలోని బ్యాక్టీరియాను హరింపచేస్తుంది.
3. యాలక్కాయల్లో పొటాషియం, మెగ్నీషియంలు సమృద్ధిగా ఉండడం వల్ల గుండెకు మేలు చేస్తాయి. అందువల్ల ప్రతి రోజూ భోజనంలో యాలకుల్ని చేరిస్తే ప్రయోజనం. యాలకులతో టీ చేసుకుని తాగినా గుండెకు ఎంతో మంచి జరుగుతుంది.
4. యాలకుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలూ ఉన్నాయి. అన్నింటినీ మించి కేన్సర్‌ను నిరోధించే మూలకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
5. రోజూ ఒకట్రెండు యాలక్కాయల్ని నమలితినడం ద్వారా వికారం, వాంతులు త గ్గుతాయి.
6. సూప్స్ ల్లో యాలక్కాయ వేసుకుంటే, జలుబు, ఫ్లూ లక్షణాలు తగ్గుతాయి.
7. యాలక్కాయ టెన్షన్ తగ్గించే గుణము ఉంది .ఒత్తిడి ఉన్నప్పుడు ఒకయాలక్కాయ నమిలితే తగ్గుతుంది.