జుట్టు ఒత్తుదనం పెరిగేందుకు కొన్ని సహజసిధ్ధమైన చిట్కాలు
ఆయిల్ మస్సాజ్
మీ స్కాల్ప్ ని రోజూ మస్సాజ్ చేసుకోండి. మస్సాజ్ వల్ల రక్త ప్రసరణ పెరిగి జుట్టును కాపాడుతుంది. మీ స్కాల్ప్ ని వేడి నూనె తో మస్సాజ్ చేసుకోవాలి. ఈ మస్సాజ్ సర్క్యులర్ పొజిషన్లో చేసుకోవాలి. జొజొబా, కొబ్బరినూనె తో ఈ మస్సాజ్ చేసుకుంటే మంచిది.
అదే చుండ్రు తగ్గాలంటే రోజ్ మేరి ఆయిల్ తో చేసుకోవాలి. కొన్ని నిముషాలు మస్సాజ్ చేసుకుని వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత వెచ్చటి టవల్ తో తుడుచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసుకోవాలి.
సరైన ఆహారం
జుట్టు రాలటాని తగ్గించుకోవాలంటే మంచి మార్గం మంచి ఆహారం. మీరు మంచి ఆహార అలవాట్లను అలవరచుకుంటే మంచిది. ఉదాహరణకి విటమిన్- సి, విటమిన్-బి, కాపర్, జింక్ మొదలైనవి తీసుకోవటం మంచిది. వీటిలో ఉన్న పోషకాలు, పౌష్టికాలు మీ కేశసంపదను వృధ్ధి చేస్తాయి.ఇంకో మంచి టిప్ ఏంటంటే మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఇది హైడ్రేషన్ అంటే శరీరం లోని వేడిని దూరం చేస్తుంది.
కండీషనింగ్
మంచి కండీషనర్ ను వాడటం మంచిది. ఇది మీ కేశాలకు బలాన్నిస్తుంది. అంతేకాక దీనిని తలస్నానం షాంపూతో చేశాక చేయాలి. మరొక విషయమేమంటే దీనిని స్కాల్ప్ కి దూరంగా పెట్టుకోవాలి. 1-2 అంగుళాలు స్కాల్ప్ కి దూరంగా పెట్టుకోవాలి. ఇది జుట్టుని మృదువుగా, నాజూకుగా ఉంచుతుంది.
అలోవేరా
అలోవేరా ప్రతి ఇంట్లో ఉండే మొక్క. ఇది సహజసిధ్ధమైన ఔషధం. ఇది కేశాలపై బాగా పని చేస్తుంది. దీనిలో ఉన్న పోషకాలు మీ స్కాల్ప్ ని కాపాడతాయి. జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. దీనిని స్కాల్ప్ కి రాసుకుని గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల కేశాలు నిగారింపుగా, కాంతివంతంగా ఉంటాయి.
రసాయనాలకు దూరంగా
రసాయనాలు చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి సాధ్యమైనంతవరకూ వీటికి దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో కొన్ని ప్రాడక్ట్లు హెయిర్ స్ట్రైకెనింగ్ కి, కలరింగ్ కి ఉన్నాయి.
కోడిగ్రుడ్డు
మీకు మీ కేశసంపద పెంచుకోవాలంటే ఈ టిప్ ను అనుసరించండి. ఒక గ్రుడ్డును మీ హెయిర్ కి మాస్క్ గా వేసుకోండి. తెల్లసొన తీసుకుని అలాగే పచ్చసొన కలిపి జుట్టుకి పెట్టుకోవాలి. తర్వాత 10 నిముషాల తర్వాత వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. కొద్దిగా తక్కువగా షాంపూ వేసుకుని చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిది.
మెంతులు
ఇవి ప్రతీ వంటింట్లో ఉండేవే. మెంతుల్ని తీసుకుని ముందు రోజు రాత్రి నీటిలో నాన పెట్టుకోవాలి. తర్వాతి రోజు ఉదయానే వాటిని గ్రైండ్ చేసుకుని తలకు పెట్టుకోవాలి. గంట తర్వాత నీటితో కడుగుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితముంటుంది.
బంగాళదుంప జ్యూస్
బంగాళాదుంపలో విటమిన్-ఎ,బి, సి, ఉంటాయి.ఇవి జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. బంగాళాదుంప జ్యూస్ ను తలకు పట్టించి 15 నిముషాలు ఉంచి కడుగుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచిది.
ఆమ్ల
ఆమ్ల అనేది సహజసిధ్ధ ఔషధం. ఇది జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. దీన్ని చాలా హెయిర్ ప్రాడక్టుల్లో వాడుతారు. ఇది ఆనతికాలంలోనే జుట్టు మళ్ళీ పెరిగేలా చేస్తుంది.
హైబిస్కస్ ఫ్లవర్
ఇది జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. వృధ్ధప్యం చాయల్ని దూరం చేస్తుంది. ఒత్తుదనం పెంచుతుంది. దీనితో పాటు కొబ్బరి నూనె కలుపుకుని వాడితే చాలా మంచిది.
హెన్నా
గోరింటాకుతో కూడిన హెన్న చాలా మంచిది. సహజసిధ్ధ ఔషధం గా కూడా పేర్కొనవచ్చు. ఇది కేశాల్ని ఆరోగ్యంగా, అందంగా మారుస్తుంది. హెన్నాను ఒక ఇనుప బౌల్ లో రాత్రంతా నానపెట్టుకోవాలి. పొద్దున్నే తలకు పట్టించాలి. గంట తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. జుట్టు బలంగా తయారవ్తుంది.
స్ట్రెస్ కు దూరంగా
స్ట్రెస్ జుట్టు ఊడటానికి ప్రధాన కారణం. స్ట్రెస్ తగ్గించుకుంటే జుట్టు ఊడకుండా బాగుంటుంది. ఇందుకు రోజూ వ్యాయామం, యోగా లాంటివి చేస్తే మంచిది. స్ట్రెస్ తగ్గుతుంది.
జుట్టు పెరిగేందుకు సహజసిధ్ధ చిట్కాలు
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ జుట్టుకు రాసుకుంటే వెంట్రుకల్ని బలంగా చేస్తుంది. మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. దీనిని తలకు రాసి మస్సాజ్ చేసుకుని 3 నిముషాల పాటు వదిలేసి షాంపూతో వాష్ చేసుకోవాలి.
కాస్పర్ ఆయిల్
ఇది చాలా జిగురుగా ఉండే ఆయిల్. చాలామంది దీనినే వాడి జుట్టు పెరుగుదల చాలా సులభమని అంటున్నారు. అయితే దీనిలో ఫ్యాటీ కంటెంట్ అయిన విటమిన్- ఇ ఉంటుంది. ఇది జుట్టు బలంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. దీనిని స్కాల్ప్ కి పట్టించిన తర్వాత మస్సాజ్ చేసుకోవాలి.
అవకాడో
ఇది ఒక ఫల చేట్టు. ఇది చాలా మందికి ఈ దేశంలో ఇష్టమైన ఫలం. దీనిలో విటమిన్-ఇ ఉండి అది
జుట్టు ఒత్తుదనం, పెరుగుదలకు దోహదం చేస్తుంది. దీనిని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని దానికి గుజ్జు అరటిని కలిపి రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి 30 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి.
షాంపూ జాగ్రత్త
షాంపూలు వాడేప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎటువంటి షాంపూలు వాడితే మంచిదో నిపుణుల సలహా మేరకే వాడాలి. మంచివి కానివి వాడితే హెయిర్ రూట్స్ పాడవుతాయి.
ఉల్లి జ్యూస్
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదన్న సామెతలా ఉల్లి చాలా వాటికి ఔషధం. దీనిలో సల్ఫర్ ఉంటుంది.
దీనివల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. అంతేకాక సరైన విధ్ధంగా వెంట్రుకలు పెరుగుతాయి.15 నిముషాల పాటు తలకు ఈ జ్యూస్ ఉంచి తర్వాత వాష్ చేసుకోవాలి.