సినీ వినీలాకాశంలో చందమామ
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శ్రీ డా. అక్కినేని నాగేశ్వర రావు గారి గురించి కొన్ని విశేషాలు .....
నట సామ్రాట్ Dr. అక్కినేని నాగేశ్వర రావు గారు 20 సెప్టెంబర్,1923లో జన్మించారు. కడు పేదరికంలో పుట్టి నాటకాలలో ఆడ వేషంతో తన నట ప్రస్థానం మొదలుపెట్టి, తదుపరి సినీ రంగంలో స్థానం సంపాదించుకున్నారు. అలా మొదలైన ఆయన సినీ ప్రస్థానం ఎన్నో విజయాల మైలు రాళ్ళను దాటుకుంటూ, సినీ ప్రపంచ చరిత్రలోనే తనదంటూ ఒక ముద్ర వేసుకున్నారు.
ఆయన మన అందరికీ స్పూర్తి ప్రదాత. ఆదర్శాలు, సమాజ సేవ తో పాటూ, విద్యా దానము గొప్పది అన్న సిద్దాంతాన్ని నమ్మిన వ్యక్తి . ఆయన సాధించిన విజయాలు , అధిరోహించిన కీర్తి శిఖరాలు అనన్య సామాన్యమైనవి. ఒక నటుడిగా , నిర్మాతగా , స్టూడియో అధినేతగా అగ్ర స్థానంలో నిలబడ్డ ఆయన 75 సంవత్సరాలకు పైగా సినీ ప్రయాణములో ఎన్నో పాత్రలు, ఎన్నో అవార్డులు ఆయన్ను వరించి తరించాయి అనడములో అతిశయోక్తి లేదు .
255 లకు పైగా సినిమాలు తెలుగు హిందీ తమిళం భాషల్లో నటించి తన చాతుర్యాన్ని తెలుగువాడి గొప్పతనాన్ని దేశమంతా చాటిచెప్పారు .
D.V.S. రాజు గారుతో కలిసి సినీ పరిశ్రమను హైదరాబాదుకి మార్చడములో ఆయన చేసిన కృషి శ్లాఘనీయం .
1975 లో అన్నపూర్ణా స్టూడియోస్ స్థాపించి , అందులోనే ఆన్నపుర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ ఫిల్మ్స్ & మీడియా ని స్థాపించి లాభాపేక్ష లేకుండా , విద్యార్థులకు ప్రొత్సాహము ఇచ్చి ఎందరో కళాకారులను తయారుచేసి, కళాpమతల్లికి అంకితమిచ్చారు.
తన సినీ ప్రయాణములో నాలుగు “నంది” అవార్డులు, ఐదు ఫిలిం ఫేర్ అవార్డులుతో పాటూ అత్యంత ప్రతిష్టాత్మకమైన “దాదా సాహెబ్ ఫాల్కే” అవార్డును సాధించిన ఘనత ఆయనది . అంతే కాకుండా ప్రభుత్వము ఆయనకు పద్మ విభూషణ్ అవార్డుని ఇచ్చి సత్కరించినది .
ఆయన ఒక గొప్ప రచయిత కూడా. ఆయన రచనలు ఎంతో ఆదర్శ ప్రాయము అయినవి. కొన్ని పుస్తకాలు ఆయన ఆటోబయోగ్రఫీ “నెను నా జీవితం “, ఆయన అమెరికా ప్రయాణపు జ్ఞాపకాలతో ” నేను చూసిన అమిరికా ” , ఆయన ఆలోచానా విధానాలకు సహజ జీవన విధానాలకు అద్దం పట్టే “అక్కినేని ఆలోచనలు – అఆలు” ,ఇప్పటికి ఎప్పటికి మార్గ దర్శకాలే .
మానవత్వ విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం అంత ఇంతా కాదు. జన్మభూమి ట్రస్ట్ ని స్థాపించి అప్పటి (మరియు ప్రస్తుత) ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి సహాయంతో కృష్ణా జిల్లా , రామాపురంలోని సమస్యలను తీర్చడములో ఏంతో కృషి చేసారు.ఒక వంతెన కట్టించారు. దానితో ఆ చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలగి పోయాయి . ఆ వారధికి “అక్కినేని వారధి ” అని
పేరు పెట్టారు. ఒక వాటర్ ట్యాంక్ కట్టించి మంచినీటి సదుపాయాన్ని కలుగచేసి ఆదర్శ ప్రాయుడు అయ్యారు.
ఇక విద్యార్థుల భవిష్యత్ కోసం చేసిన సేవలు అమోఘం. తన బాల్యంలో పేదరికం వలన చదువుకునే అవకాశం కోల్పోయానని, ఆ పరిస్ఠితి ఏ విద్యార్ధికి కలుగ కూడదని విద్యా సంస్థలు స్థాపించారు. విద్యా దాతగా ఆదర్శ ప్రాయుడయ్యారు. గుడివాడలో ఒక కాలేజికి ప్రధాన దాతగా ఉంటూ కాలేజీ ప్రెసిడెంట్ పదవిని అలంకరించారు. ఆ తరువాత
ఆ కాలేజికి “అక్కినేని నాగేశ్వరరావు కాలేజి ” అని పేరు పెట్టారు. గీతం యూనివర్సిటీ విద్యార్ధులలో ప్రతిభా వంతులైన వారికి “గోల్డ్ మెడల్స్ ” ఇచ్చి ప్రోత్సహించారు.
Dr. అక్కినేని నాగేశ్వర రావు గారు లైఫ్ మెంబర్ అఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అయ్యారు మరియు డిపార్టుమెంటు అఫ్ డ్రామా టిక్స్ & థియేటర్ ఆర్ట్స్, ఆంధ్ర యూనివర్సిటీకి సలహాదారుగా ఉంటూ కళామతల్లి ముద్దు బిడ్డగా ఎందరో కళాకారులకు స్ఫూర్తి నిచ్చారు. మార్గ దర్శకులయ్యారు.
కళాకారుడిగా , వ్యాపారవేత్తగా , విద్యా దాతగా, గురువుగా, తత్వవేత్తగా , సమాజ సేవకుడిగా, ఎన్నో ప్రతిస్టాత్మక పురస్కారాలు పొందిన, ప్రపంచం గర్వించ దగ్గ తెలుగు వాడిగా ఆదర్శ ప్రాయుడై, చిరస్మరనీయుడిగా మన అందరి హృదయాలలో నిలిచిపోయారు.
” ఆయన కీర్తి అజరామరం , ఆయన జీవితం స్ఫూర్తి దాయకం ”