Saturday, 30 April 2016

శనగ పప్పు " పాటోళీ "


                                                              శనగ పప్పు  " పాటోళీ  "

కావలసిన పదార్థాలు  : 
1. సెనగపప్పు  100గ్రాములు 
2. ఉల్లిపాయలు 2 
3. పచ్చిమిరపకాయలు 2 
4. మినపప్పు 1స్పూన్ 
5. ఆవాలు అర స్పూన్ 
6. జీలకర్ర అర స్పూన్  
7. ఎండు మిరపకాయలు  2 
8. కరివేపాకు   రెండు రెమ్మలు 
9. కొత్తిమీర కొద్దిగా  
10. వెల్లుల్లి 4 రెబ్బలు 

తయారీ  విధానము  
ముందుగా సెనగ పప్పుని  నీళ్ళలో నాన బెట్టు కోవాలి 
పప్పు 4 గంటలు నానితే  సరిపోతుంది 
నానిన పప్పుని  మెత్తగా రుబ్బు కోవాలి. 
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 6 స్పూన్స్  నూనె  వేసి , 
వేడెక్కాక  
పైన  చెప్పిన పోపు దినుసులు , వెల్లుల్లిరెబ్బలు వేసి , 
 వేగాక 
కరివేపాకు , తరిగిపెట్టుకున్న ఉల్లిపాయలు , పచ్చిమిరపకాయలు  ,
వేసి దోరగా వేయించుకోవాలి . 
తరువాత రుబ్బి పెట్టుకున్న పప్పు ముద్ద ను వేసి , 2స్పూన్స్ నూనె  వేసి  ,
సరిపడినంతగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి . 
బాణలి పైన  మూత  పెట్టి కాసేపు మగ్గనివ్వాలి . 
10 నిమిషాలకొక సారి కలుపుతూ ఉండాలి.
కలుపు తున్నప్పుడు  ఆయిల్  వేసి కలుపుతుంటే ,
పాటోళీ పొడి పొడి లాడుతూ వస్తుంది . 
చివరకు పొడిపొడి లాడుతూ ఉండే  " పాటోళీ " తయారవుతుంది  
కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి . 
దీనిలో కి  " ఉల్లి పాయ పులుసు "  తో నంచుకు తింటే బావుంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi