ఉత్తమ " వ్యక్తిత్వ లక్షణములు "
1. నిరంతరమూ పెదవుల మిద చిరునవ్వు .
2. అవతలి వారి మిద కన్సర్న్ చూపించడము
3. థాంక్స్ అన్న పదము తరచూ వాడడము
4. ప్రతీ చిన్న విషయము కూడా మనస్పూర్తి గా ఆస్వాదించడము
5. . ఆనందమును బహిర్గత పరిచడము
6. ఇలా చేయడమువలన ఎక్కువ కాలము " యౌవనవంతులు " గా ఉంటారని శాస్త్రజ్ఞుల అంచనా
7. సమర్ధుడు ఐయిన వ్యక్తీ తనదగ్గర ఉన్న గుడ్లు అన్నీ ఒకే బుట్టలో పెట్టడు
8. తన దగ్గిర ఉన్నడబ్బు అంతా మూడు రూపాయల వడ్డీ కి ఇవ్వడు
9. తన సమయము అంతా " ప్రమోషన్ " కోసము వెచిస్తూ కుటుంబాన్ని "విలువైన సాయంత్రాల్ని "
వేస్ట్ చెయ్యడు
10. అతనికి తెలుసు జీవితము తేనే పట్టు లాంటిది ఒక్కో గది ఒక్కో ఆనందము నకు నిలయము అని.
11. అక్కడ లేని వ్యక్తుల గురించి చెడు గా మాట్లాడక పోవడము
12. తన గమ్యమును తనే నిర్దేశించు కోవడము .
13. తాను సాధించ వలసినిది ఇంకా ఉంది అని జివితాంతము అనుకోవడము
14.విలువలని తాకట్టు పెట్టేవాడు ఎప్పుడు సుఖము గా ఉండలేడు, విలువలని నమ్ముకున్నవాడు కష్టాలలో కూడా ఆనందము గా ఉండగలుగుతాడు .