Sunday, 17 April 2016

ప్రతిరోజు పండుగే ......kadha

                                                           ప్రతిరోజు పండుగే
                                                ( Rachana : Achantagopalakrishna )

మందు బాబులం మేము మందు బాబులం,మందుకొడితే మాకు మేమే మహారాజులం ,
అంటూ తూలుకుంటూఇంటికి బయలుదేరాడువీరయ్య..
తాపీపని  చేస్తూరోజుకి నాలుగువందలు సంపాదిస్తాడు. సాయంత్రందాకా కష్టపడి ఆడబ్బంతా తాగుడికి ఖర్చుచేసేస్తాడు . వీరయ్య భార్య రంగమ్మ నలుగు ఇళ్ల లోను పనిచేసుకుంటూ ఇల్లుగడుపుకు వస్తుంది. ఇద్దరు ఆడపిల్లలు.ఇంటికి వచ్చిన వీరయ్య బయట నులక మంచం మీద వాలి పోయాడు.
"ఏవయ్యా కాస్త అన్నం తిందువుగాని రా", నీ ఆరోగ్యం పాడవుతుంది అయినా ఎన్నిసార్లు చెప్పినా అ మందు మానవు కదా ,"అని అంది.
"నాడబ్బు నా ఇష్టం , అందులో ఆనందం ఉంది నువ్వు ఎవరు అడగడానికి  "అని అరిచాడు".
ఆ అరుపుకి పిల్లలు ఇద్దరుఇంట్లో ఓ మూలకి ఒదిగిపోయి దాక్కున్నారు.
రోజు జరిగే గొడవే అయినారంగమ్మ ప్రయత్నం ఎప్పుడు ఫలించదు.ఒంటి చేత్తో కుటుంబాన్ని నడుపుకుంటూ వస్తోంది. ఏ దేముడో కరుణించాలి. ఈడిలో మార్పు ఎప్పుడువస్తుందో అంటూ కంచం తో అతని దగ్గరికి వెళ్ళింది.మత్తులో ఉన్న అతను ఆమె పెట్టింది తిని అలాగే వాలిపోయాడు.
లోపలి కి వచ్చి ఆడు పడుకున్నాడు "మీరు అన్నంతినిపడుకోండి అనిపిల్లల్ని చేరదీసింది."
"అమ్మా స్కూల్ ఫీజులు కట్టాలి . కాని ఎలాగో అర్థం కావట్లేదు. " అంది కూతురు .
 "నేనేం చేయను చెప్పు మీ నాన్న సంపాదన తాగుడికే సరి పోతోంది.
"నాదేమోఇంటికి సరిపోతోంది.""మీ చదువులకి కష్టంగానే ఉంది తల్లీ", అని బాధ పడింది.
"సరేలే రోజు ఉండేదే కదా నువ్వు కూడా ఎంగిలిపదు పడు కుందాము , మళ్లీ పొద్దున్నే పనికి వెళ్ళాలి"  అంటూ కూతురు అన్నం తీసుకువచ్చింది.
మర్నాడు మళ్లీమాములే. రోజులాగానే తూలుకుంటూ వస్తున్నాడు.అంతలో అనుకోకుండా ఒక మోటార్ సైకిల్ కు గుద్దేసి పడిపోయాడు. కాలుకి ,వంటికి బాగా దెబ్బలు తగిలాయి.పరిగెత్తుకుంటూ వెళ్ళింది రంగమ్మ.హాస్పిటల్ లో డాక్టరుకి చూపించింది.
కట్లు కట్టి "ఏంపరవాలేదు. మందులు రాసిస్తాను . కాని ఈ "మందులువాడిన అన్నిరోజులు మందు తాగకూడదు .జాగ్రత్త "అనిహెచ్చరించాడు.
"రోజువచ్చి చూపించుకో "అని అన్నాడు. మూడురోజులు వరసగా వెళ్ళాడు. నాలుగోరోజు "నువ్వుఇక పనికివెళ్ళచ్చు , బాగాతగ్గింది . కానీనీతో మాట్లాడాలి "అన్నాడుడాక్టరు .
"చెప్పండి సారూ  "అన్నాడు
"ఏం మందు మానలేవా,నీ కుటుంబం కష్టాలలో ఉంది. నువ్వునీ ఆనందం చూసుకున్టున్నావు.కానీ నీభార్యా పిల్లల గురించి పట్టించుకోవట్లేదు. "అనిఅన్నాడు
"ఏంటో తాగితే ఆనందంగా ఉంటుంది .అందుకే మానలేకపోతున్నాను. అన్నాడు
"ఇంతకుమించిన ఆనందందొరికితే తాగుడు మానేస్తావా "మరి ,అన్నాడు డాక్టరు.
సరేనండి అదేమిటో చెప్పండి,"తాగుడుకన్నా ఎక్కువ ఆనందందొరికితే "తప్పకుండా వదిలేస్తానన్నాడు.
ఈరోజు నువ్వుఒకపని చెయ్యి .ఈరోజు ,రేపు కూలికి వెళ్ళినా మందులు వాడాలి కాబట్టి తాగద్దు. ఆ డబ్బులతో ఏంచెయ్యాలో చెప్పారు డాక్టరు.
సరేనండిప్రయత్నిస్తాను అంటూదండం పెట్టి వెళ్ళిపోయాడు.
ఆరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాడు,రంగమ్మా అంటూఅరిచాడు. పిల్లలుబిక్కుబిక్కుమంటూ మళ్లీవచ్చాడు ,ఏంగొడవ చేస్తాడోనని హడలిపోతున్నారు. పక్కనే ఉన్న రంగమ్మ పరిగెత్తుకుంటూఇంటికి వచ్చింది.. పిల్లలు భయపడుతూ ఓ మూల కూర్చున్నారు . ఇలా రండి అనిపిలిచాడు .భయపడుతూ రాలేదు. కొట్టనులేరండిఅంటూపిలిచాడు. భయపడు తూబిత్తర చూపులు చూస్తూ , సగం దూరంలో కి అడుగులో
అడుగు వేసుకుంటూ వచ్చినిలబడ్డారు. ఏమంటాడో నన్నభయం కళ్ళలో కనిపిస్తోంది . సంచిలో చేయి
పెట్టిప్యాకెట్  తీసాడు.
ఆశ్చర్యంగా చూస్తున్నారు .
వెనకనే వచ్చిన రంగమ్మగుమ్మంలోనే ఆగిపాయింది.ఏంజరుగుతుందో నని చూస్తూఉండి పోయింది.
ప్యాకెట్లోనుంచి రెండు జతల బట్టలు తీసుకొని ఇదిగో "ఇవి మీకోసమే తీసుకు వచ్చాను . రండితీసుకోండి,
"ఇంకా పుస్తకాలు కూడా మీసారుని కనుక్కుని తెచ్చాను " అన్నాడు.
వాటిని చూడగానే ఆశ్చర్యం తో ,ఆనందంతోకళ్ళు  మెరుపులు మెరిసాయి.ఆ "ఆనందపు కెరటాలు ఒక్కసారిగా అతని హృదయాన్ని తాకాయి".
తెలియకుండానే అతనికళ్ళలో నుంచి కూడా నీళ్ళు రావడం మొదలు పెట్టాయి.
వాళ్ళ కళ్ళలోని ఆనందాన్ని తొలిసారిగా చూసాడు వీరయ్య. పొంగిపోతున్న వాళ్ళమనసు, ఉబికి వస్తున్నఆనంద భాష్పాలతో పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నను వాటేసుకున్నారు. వాళ్ళకన్నీటి "తడి
"అతనిహృదయాన్నితాకింది."
"ఒక్కసారిగాషాక్ కొట్టినట్లయింది ."
"మనసుఉద్వేగం తో నిండి పోయి అత్యాద్భుతమైన ఆత్మానందాన్ని" పొందాడు.
ఏమిటి ఇంతటి ఆనందాన్నినే నేలా పోగొట్టుకున్నాను ,అంటూ తన్మయత్వంతో అలా ఉంది పోయాడు.
వెనుకనే కళ్ళుతుడుచుకుంటూ రంగమ్మ అతనిభుజం మీద చెయ్యి వేసి "ఇన్నాళ్ళకు ఆ దేముడు కరుణించాడు "అంది.
 తనని కూడాబాహువులలోకి తీసుకుని ముగ్గురిని పట్టుకుని "అవును ఇన్నాళ్ళు నేనేం పోగొట్టుకున్నానో తెలుసుకున్నాను" .
"ఇక మీదట అది పోగొట్టుకోను ,తాగుడు మానేస్తాను . కష్టపడతాను .ఇకపై నా సంపాదనతో ఇల్లు  నడుపుతాను.
"త్వరలోనే మీ స్కూల్ ఫీజులు కట్టేస్తాను. మాష్టారిగారితో మాట్లాడాను" .

ఆయన ఒప్పుకున్నారు మీరు ఇద్దరూ రేపటి నుండి స్కూల్కి వెళ్ళచ్చు."అంటూ ఆనందంలో ములిగిపోయాడు.
అన్నట్టు ఇవి "కూడామీకోసమే అంటూ తెచ్చిన పకోడీలు, స్వీట్స్ పిల్లలకి తినిపించాడు "
.తన ఒళ్ళోకూర్చో పెట్టుకుని ఇంతటిఆనందాన్ని పరిచయం చేసిన డాక్టరుగారికి తనమనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇకమీదట "జీవితంలో తాగకూడదు "
అని నిశ్చయించుకున్నాడు
 ఈ రోజు నీకు ఇష్టమైన  చేపల పులుసు  వండుతాను  మామా అని అనగానే ,వద్దు పిల్లలకి ఇష్టమైన బంగాళాదుంపల కూర వండు , నేను కూడా , వాళ్లకు  ఇష్టము ఐన శాకా హారము  మాత్రమే తింటాను .
ఇక నుండి వాళ్ళ యిష్టమే నాఇష్టం , అంటూఆనందంగా పిల్లలను మరింత దగ్గరకు తీసుకున్నాడు. వాళ్ళిద్దరూ అతనిగుండెలమీద ప్రశాంతం గావాలారు.
"తాగుడి వలన లభించే ఆనందంకన్నా తనభార్య ,పిల్లల ఆనందంచూడడంలో ఎక్కువ ఆనందం ఉన్నది "అనిగ్రహించాడు.
ఇక జీవితంలోవ్యసనాల జోలికి పోకూడదు అని నిశ్చయించుకున్నాడు.
"తన ఆనందంకన్ నాతన వాళ్ళఆనందం చూడటంలో ఎక్కువ ఆనందం ఉందని గ్రహించాడు"
." వ్యసనాలచీకట్లు తొలగి ,ఆనందాల వెలుగులు నిండిన ఆ ఇంట్లో
" ప్రతి రోజుపండుగే."