Tuesday 12 April 2016

మన --ఆత్మ విశ్వాసము

1.  మన పట్ల మనకు ఉన్న అనుమానము మనకి భేషిజాన్ని నేర్పుతుంది .

2. మనపట్ల మనకు ఉన్న నమ్మకము మనకి ఆత్మ విశ్వాసమును అలవరుస్తుంది .

3. తమ గురించి తాము గొప్పలు చెప్పుకునేవారు మానసికముగా చాలా భయస్తులు అయి ఉంటారు .
  ఇది    కూడా అంతర్గత భయాల నుండి వచ్చిన  పరిణామమే .

3. తమ మీద తమకు నమ్మకము ఉన్నవారిని గమనిస్తే ఎక్కువగా గొప్పలు చెప్పుకోరు .  

4. తమ పట్ల ,తమ భవిష్యత్ పట్ల నమ్మకము లేని వారు ఏ పనినీ  సాధించ లెరు.

5. ఆశయము స్పస్టముగా ఉన్నప్పుడు , అది రెండు అంచెలు గా సాగుతుంది .

   ఒకటి తాత్కాలికము   రెండు శాశ్వతము

  .ఒకటి  పూర్తి కాకుండా రెండవది పూర్తి అవదు.

   అంటే ఒక విద్యార్ధి  డాక్టర్ అవ్వాలి అనుకుంటే ముందు ఇంటర్ పాస్ అవ్వాలి తరువాత  ఎంసెట్
  రాంక్  సాధించాలి .
  ముందు మొదటి   దాని  గురించి ఆలోచించాలి .తరువాత రెండవదాని గురించి ఆలోచించాలి
  అన్న    మాట
.
6. మనము మార్చలేని విషయాల గురించి ఆలోచించడము మాని , మన గురించి ఆలోచించడము ప్రారంభిస్తే విజయాలు మన సొంతము అవుతాయి
.
7. నేను సామాన్యుడిని అని ఆలోచిస్తే అంతటి తో అభివ్రుధి  ఆగి పోయినట్లే .

8. పుట్టుకతో ఎవరూ అదృష్టవంతులు , దురదృష్ట వంతులు గా పుట్టలేదు .వళ్ళే ఎలా ఉండాలో        నిర్ణయము చేసుకుంటారు.

9. అదృష్టవంతులు ఆనందము గా ఉండడము నేర్చుకున్నారు . దురదృష్టవంతులు అసంతృప్తి తో జీవించడము నేర్చు కున్నారు.