Wednesday 27 April 2016

ఔషధగుణాల్నీ పోషకఫలాల్నీ ఏకకాలంలో అందించే " ఉసిరి "

     
             
ఔషధగుణాల్నీ పోషకఫలాల్నీ ఏకకాలంలో అందించే ఉసిరి

వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి .అందుకే
ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు.
ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం.
1. ఉసిరిని సంస్కృతంలో ఆమ్లాకి లేదా ధాత్రీఫలం అనీ పిలుస్తారు.
2. కమలారసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్‌-సి 20 రెట్లు ఎక్కువ.  ప్రొటీన్లు ఆపిల్‌లోకన్నా మూడురెట్లు ఎక్కువ.
3. ఇతర పండ్లలోకన్నా యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే.
4. అనేకానేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి.
5. దీన్ని సర్వదోషహర అనీ పిలుస్తారు. శీతకాలం నుంచి వేసవివరకూ వచ్చే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వచేసుకుని ఏడాదిపొడవునా వాడతారు. కొందరు పంచదారపాకంలో మురబ్బా రూపంలో నిల్వచేసుకుని తింటారు. నిల్వపచ్చడి రూపంలో వాడుకున్నా ఉసిరి అద్భుత ఔషధమే.
6. వందగ్రా. ఉసిరిలో 80 శాతం నీరూ కొద్దిపాళ్లలో ప్రొటీన్లూ, పిండిపదార్థాలూ పీచూ లభిస్తాయి. 478మి.గ్రా. సి-విటమిన్‌ లభ్యమవుతుంది. ఎంబ్లికానిన్‌-ఎ, ఎంబ్లికానిన్‌-బి, ప్యునిగ్లుకానన్‌ వంటి పాలీఫినాల్సూ, ఎలాజిక్‌, గాలిక్‌ ఆమ్లం... వంటి ఫ్లేవనాయిడ్లూ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం... వంటి ఖనిజాలూ ఉసిరిలో దొరుకుతాయి.
7. ఆయుర్వేదం ప్రకారం- ఉసిరి మూడు రకాల దోషాల్నీ తగ్గిస్తుంది. అన్ని అవయవాలూ సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఆయుర్వేదవైద్యంలో అద్భుత ఔషధంగా చెప్పే చ్యవన్‌ప్రాశ్‌లో ఉండే ప్రధాన పదార్థం ఉసిరే.
8. ఉదయాన్నే ఖాళీకడుపుతో ఉసిరి పొడిని తీసుకోవడంవల్ల దీర్ఘకాలిక దగ్గు, అలర్జీ, ఆస్తమా, టీబీ వంటివన్నీ తగ్గుముఖం పడతాయి.
9. తిన్నది వంటబట్టేలా చేయడంలో దీన్ని మించింది లేదు. ఎండు ఉసిరి జీర్ణసంబంధమైన అన్ని సమస్యల్నీ నివారిస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. భోజనం తరవాత ఇది తింటే ఎంతో మేలు.
10. వేసవిలో ఉసిరి తినడంవల్ల చలువ చేస్తుంది.
11. కాలేయవ్యాధులకు ఉసిరి అద్భుతమైన మందు. శరీరంలోని విషతుల్యాలలను తొలగిస్తుంది.
12. నాడుల్ని బలోపేతం చేయడం ద్వారా మెదడుపనితీరుని మెరుగుపరుస్తుంది. ఉసిరి తీసుకోవడంవల్ల జ్ఞాపకశక్తీ, తెలివితేటలూ పెరుగుతాయట.
13. కఫదోషాల్ని నివారించడం ద్వారా వూపిరితిత్తుల సమస్యల్ని తగ్గిస్తుంది.
14. ఉసిరిముద్దని తలకి పట్టించి స్నానం చేస్తే కళ్లమంటలు తగ్గుతాయట.
15. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది.
16. రోజూ తాజా ఉసిరిని తినడం లేదా దాని గుజ్జుని కుదుళ్లకు పట్టించడం వల్ల శిరోజాలు బాగా పెరగడంతోబాటు నల్లగా ఉంటాయి. దీంతో చేసే షాంపూలూ నూనెలూ జుట్టుకి ఎంతో మంచివి. ఇవి  చుండ్రునీ తగ్గిస్తాయి.
17. ఉసిరి రోజూ తింటే కాల్షియం శోషణకు సహాయపడుతుంది. ఫలితంగా ఎముకలూ, దంతాలూ, గోళ్లూ, వెంట్రుకలూ ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇందులోని విటమిన్‌-సి శరీరాన్ని ఎండవేడిమి నుంచీ చర్మరోగాల నుంచీ కాపాడటంతోబాటు చర్మాన్ని కాంతిమంతంగా చేస్తుంది.
18. ఇందులో యాంటీమైక్రోబియల్‌, యాంటీవైరల్‌గుణాలు అధికంగా ఉన్నాయట రక్తప్రసారాన్ని మెరుగుపరుస్తుందనీ గ్యాస్ట్రిక్‌ సమస్యల్నీ కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తుందని తేలింది.
19. ఇందులో ఉండే క్రోమియం ఇన్సులిన్‌ స్రావాన్నీ ప్రేరేపిస్తుంది.. ఫలితంగా రక్తంలో చక్కెర నిల్వల్నీ తగ్గించడం ద్వారా హృద్రోగాలూ మధుమేహం... వంటివి రాకుండా అడ్డుకుంటుంది.
20. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించగల గుణాలు ఇందులో ఉన్నాయట.
21.  ఉసిరిలో రోగనిరోధకశక్తి ఎక్కువన్నది .

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి.
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/