వేటూరి గారి కలము నుండి జాలు వారిన
అద్భుత రసమయ , దృశ్య కావ్యాలలో
"శంకరాభరణము "
తెలుగు సినీ కళామ తల్లి కీర్తి కిరీటము లో
కలికితురాయి . ఈ రోజు ఆయన రాసిన ఒకపాట ,
ఓం ఓం ఓంకార నాదాను
సంధానమౌ గానమే శంకరాభరణము
శంకర గళ నిగళము , శ్రీహరి పద కమలము
రాగ రత్న , మాలికా ,తరళము శంకరాభరణము
శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము
నారద నీరద , మహతీ నినాద ,గమకిత శ్రావణ గీతము
రసికుల కనురాగమై , రస గంగలో తానమై
పల్లవించు , సామ వేద మత్రము , శంకరాభరణము
అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి ,గానమె సోపానము....
సత్వ సాధనకు , సత్య శోధనకు , సంగీతమే ప్రాణము
త్యాగ రాజ హృదయమై , రాగ రాజ నిలయమై
ముక్తి నొసగు భక్తి యోగ మార్గమ
మృతియె లేని సుధాలాప స్వర్గము శంకరాభరణము
ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము
ఆయన ఉపయోగించిన పదాలు ,సాహిత్య విలువలకు
ఎంతో ప్రాధాన్యము తో పాటూ ,భావి తరాల కవులకు
మార్గదర్శకము గా కుడా ఉంటాయి ....
ఇంతటి అద్భుత పద రచనలు చదివి
పులకించని వారు ఉండరు ..
ఆనుభుతి ని ఆస్వాదించని వారు ఉండరు .
సంగీతము, గానము గురించి ఆయన వర్ణించిన విధము .
ఏంతొ అధ్భుత రానుభుతిని కలిగిస్తుంది .
ఆచంట గోపాలకృష్ణ