" అసిడిటీ " నుంచి తక్షణ ఉపశమనం
" అసిడిటీ "
సమస్య మనల్ని ఇబ్బందులు పెడుతుంటుంది.
సహజ సిద్ధంగా లభించే పదార్థాలను ఔషధాలుగా
తీసుకుంటే
అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు.
చల్లని పాలు:-
ఒక గ్లాస్ చల్లల్ ని పాలను చక్కెర లాంటివేవీ కలపకుండా తాగాలి.
దీని వల్ల కడుపులో మంట, అసిడిటీ వంటివి తగ్గుతాయి.
అంతేకాదు పాలు చల్లగా ఉండడం వల్ల పొట్టలో చలువను పెంచుతాయి.
పాలలో ఉండే కాల్షియం కడుపులో అధికంగా ఉన్న ఆమ్లాలను పీల్చుకుని
గ్యాస్ సమస్య నుంచి వెంటనే ఉపశమనాన్ని కలిగిస్తుంది.
యాలకులు:-
రెండు, మూడు యాలకులను తీసుకుని నలిపి పొడి చేయాలి.
దాన్ని ఒక గ్లాస్ నీటిలో మరిగించాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని
చల్లబరిచి తాగాలి. దీని వల్ల కడుపు లోపలి భాగంలో
ఉండే చర్మం అధికంగా విడుదలయ్యే యాసిడ్ల బారిన పడకుండా ఉంటుంది.
తేనె:-
ఒక టీస్పూన్ తేనెను తాగితే కేవలం 5 నిమిషాల్లోనే
అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.
కడుపులోని మ్యూకస్ పొరను రక్షించే ఔషధంగా తేనె పనిచేస్తుంది.
కొబ్బరి నీళ్లు:-
అసిడిటీ నుంచి తక్షణమే ఉపశమనం లభించాలంటే
ఒక గ్లాస్ కొబ్బరి నీటిని తాగితే సరిపోతుంది. ఇది
కడుపులో తయారయ్యే యాసిడ్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
అంతేకాకుండా తరచూ కొబ్బరి నీటిని తాగితే కడుపులో
మ్యూకస్ పొర కొత్తగా ఏర్పడి యాసిడ్లు అధికంగా ఉత్పత్తి కాకుండా చూస్తుంది.
జీరా:
కొన్ని జీరా విత్తనాలను నమిలినా లేదా వాటిని ఒక గ్లాస్ నీటిలో వేసి
మరిగించి చల్లారాక ఆ ద్రవాన్నితీసుకున్నా అసిడిటీ నుంచి
తక్షణమే ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సంబంధమైన సమస్యలను
తగ్గించే గుణాలు జీరాలో ఉన్నాయి. గ్యాస్ట్రిక్ అల్సర్లు రాకుండా జీరా అడ్డుకుంటుంది.