టొమాటో పప్పు
కావలిసిన పదార్థాలు
1 టమాటో లు 3
2. పచ్చిమిర్చి 3
3. కందిపప్పు ఒక కప్పు
4. పసుపు కొద్దిగా
5. చింతపండు కొద్దిగా
6. ఉప్పు రుచికి సరిపడ
పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్
ఆవాలు అరస్పూన్
జీలకర్ర అర స్పూన్
ఇంగువ కొద్దిగా
ఎండుమిరపకాయలు 2
కరివేపాకు
ఆయిల్ 2 స్పూన్స్
వెల్లుల్లి రెబ్బలు 3
కొత్తిమీర
తయారీవిధానం
ముందుగా కందిపప్పును శుభ్రం గా కడుగుకొని
కుక్కరులో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి .
టొమాటోముక్కలను సన్నగా తరుగుకోవాలి
పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసుకుని పైన చెప్పిన
పోపు దినుసులను వేసి
అవి దోరగా వేగాక
టొమాటో ముక్కలను, వెల్లుల్లిరెబ్బలను,
పచ్చిమిర్చి చీలికలు ,కరివేపాకుని వేసి ,
అవి కూడా దోరగా వేగాక
ఉడికించి పెట్టుకున్న కందిపప్పును ,
చింత పండు గుజ్జును ,పసుపును ,
సరిపడినంత ఉప్పు ను వేసి
బాగా కలిపి స్టవ్ మంటను సిమ్ లో పెట్టుకుని
పప్పు అంత దగ్గరపడేంతవరకు ఉడకనిచ్చి
పైన
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
ఘుమఘుమ లాడే టొమాటో పప్పు రెడీ
వేసివేడి అన్నములో మంచి నెయ్యి వేసుకుని
ఆవకాయ తో బాగుంటుంది .
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi