Sunday, 10 July 2016

చపాతిలు తినడం వల్ల కలిగే లాభాలు.


                                                    చపాతిలు తినడం వల్ల కలిగే లాభాలు.

శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు ,చాలా విషయాల్లో మేలు చేస్తుంది
" చపాతి " అంటున్నారు నిపుణులు.

1. చపాతి ఉపయోగించే గోధుమలలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది.
2. ఇందులో విటమిన్ బి, ఇ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, ఆర్సెనిక్, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి ఖనిజాలు వీటిలో ఉంటాయి. శరీరానికి కావల్సినపౌష్టికాహారాన్నిఅందిస్తాయి.
3. చపాతీలో జింక్, పైబర్ తదితర మినరల్స్ అధికంగా ఉండడంతో ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
5. గోదుమల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ ను ఇంక్రీజ్ చేస్తుంది.
7.  సహజంగా ఉండే ఫైబర్, సెలీనియం కంటెంట్ కొన్నిరకాల క్యాన్సర్లను నివారిస్తాయి. క్యాన్సర్ బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతాయి.
9. అనీమియా, బ్రెస్ట్ క్యాన్సర్, ట్యూబర్‌క్యులోసిస్, సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.
11. డయాబెటిస్ ఉన్నవారికి చపాతీలు బాగా పనిచేస్తాయి.
13. చర్మాన్ని సంరక్షించుతాయి.
15. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
17. వెయిట్ పెరుగుతున్నామన్న ఆందోళనలో ఉన్నవారికి, ఒబేసిటీ సమస్యను ఎదుర్కొంటున్న వారికి చపాతీలు చక్కగా జీర్ణమై మరుసటి రోజు
18. శరీరం యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి.

చపాతీలు  తయారీ  కి  కావలిసిన పదార్థాలు
1.   గోధుమ పిండి  పావుకేజీ
2.  ఉప్పు కొద్దిగా
3. ఆయిల్ 3 స్పూన్స్
4.  నీళ్లు తగినన్ని

తయారీ విధానము

చపాతీలు మెత్తగా రావాలంటే

ముందుగా గోధుమ పిండిని ఒక విశాల మైన ప్లేటులోకి తీసుకోవాలి.
సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
తరువాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
రెండు స్పూన్స్ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని, గోధుమ పిండిలో వేసి ,
స్పూన్ తో బాగా కలిపి , చల్లారాక చేతితో బాగా కలిపి , పిండి చేతిలో ముద్ద లాగా వచ్చే లాగా చూసుకుని , తరువాత
కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి ని కలిపి బాగా మర్ధించాలి .
ఎంత బాగా మర్థిస్తే అంత మెత్తగా వస్తాయి... తరువాత
ఇలా చేసిన పిండి ముద్దను వేళ్ళతో నొక్కి చూస్తే మెత్తగా ఉండాలి. ఈ ముద్దను ఒక బౌల్ తో మూత పెట్టి ఒక 10 నిమిషాలు
అలా వదిలేయాలి. తరువాత మనం తినే ముందు బౌల్ తీసి ఆ ముద్దను మళ్ళీ ఇంకోసారి బాగా మర్ధించాలి...
ఆ తరువాత చిన్న చిన్న ఉండలు గా చేసుకుని వత్తుకుని పెనం మీద కాల్చుకోవాలి... మొదట నూని వేయకూడదు... పెనం మీద వేసిన తరువాత చపాతీ మీద మచ్చలు వస్తాయి ..అలా రెండు వైపులా వచ్చాక పైన ఆయిల్ రాసి వేయించుకోవాలి...
ఇలా చేస్తే చపాతీ లు మెత్తగా మరియు మృదువు గావస్తాయి.


Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
Writer:
Achanta Subha
Facebook Page : Achanta Kadhalu