పెసరట్టు
పెసరట్టు తీసుకుంటే శరీరం లో వ్యర్దాలను బయటకు పంపుతుంది.1).మొలకెత్తిన పెసలను తీసుకుని మనం పిండిగా చేసుకుంటే దానిలోని ఫైబర్,ప్రొటీన్ వంటివి రెండింతలు అవుతాయి.
2).ఇక దీన్ని అధిక బరువు,డయాబెటిస్,కొలెస్ట్రాల్ లేక ఇతరత్రా సమస్యలతో భాధపడుతున్న చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు.
3).న్యూట్రిషనల్ సైన్స్ & న్యాచురల్ సైన్స్ ప్రకారం పెసలు ఔషధీ గుణాలు కలిగి ఉండి, శరీరం నుండి వాత, పిత్త దోషాలను, శరీరం నుండి వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది
4).కనీసం వారానికి ఒక్కసారైనా తీసుకుంటే చాలా మంచిది.
5).పెసరట్టులో కొన్ని ఉల్లిపాయలు,జీలకర్ర,అల్లం,వెల్లుల్లి వేసుకుని తింటే శరీరానికి చాలా మంచిది.
1. పెసలు ఒక గ్లాసు
2. బియ్యం 2 స్పూన్
3. ఉల్లిపాయలు 2
4. పచ్చిమిర్చి 3
5. అల్లం చిన్న ముక్క
6 జీలకర్ర
తయారీ విధానం
ముందుగా పెసలను, బియ్యాన్ని
8 గంటలసేపు నాన బెట్టుకోవాలి .
బియ్యం వేసుకుంటే పెసరట్లు కరకరలాడుతూ వస్తాయి
నానిన పెసలనుపచ్చిమిర్చి ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఉల్లి పాయలను , మిరపకాయలను ,
అల్లాన్ని సన్నగా తరుగుకోవాలి
స్టవ్ వెలిగించి పెనం పెట్టి అది వేడెక్కాక
పెనమును నాన్ స్టికీ గా మార్చుకోవడము :
వేడి ఎక్కిన పెనము మీద
ఆయిల్ వేసి పెనం అంతా రాసి,
కొద్దిగా నీళ్లు చల్లి గుడ్డతో తుడిచెయ్యాలి
తరువాత కొంచెం ఆయిల్ వేసి
ఉల్లిపాయ సగానికి కోసి ఆ అరబద్దతో
పెనము అతా రాయాలి అప్పుడు పెనము మీద
ఆయిల్ పొర ఏర్పడి పెనము నాన్ స్టికీ గా మారుతుంది )
ముందుగా రుబ్బుకుని పెట్టుకున్న పెసరపిండిని
ఒకటిన్నర గరిటవేసి పెనం అంతా పరుచుకునేలా
తిప్పుకుని ,
జీలకర్రని , తరిగిపెట్టుకున్న ఉల్లిపాయాళ్ళం
ముక్కలని, మిరపకాయల ముక్కలని వేసి,
కొద్దిగా ఆయిల్ వేసి వేగనివ్వాలి
అట్టు ని తిరగేసి మరలా కొద్దిగా ఆయిల్ వేసి
అట్టుదోరగా వేగాక
ఒక ప్లేట్ లోకి తీసుకుని పెడితే
పెసరట్టు రెడీ.
దీనిని అల్లం పచ్చడి తోగాని,
కొబ్బరి పచ్చడి తో గాని తింటే చాలాబాగుంటుంది
నూని బదులు
మంచి నెయ్యి వేసి వేగనిస్తే
ఆ నేతి పెసరట్టు రుచి ఇంకా బాగుంటుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi