Monday, 25 July 2016

పెసర పుణుకులు


                                                              పెసర పుణుకులు

కావలిసిన పదార్థములు
1.  పెసర  పప్పు  2 కప్పులు
2. ఉప్పు
3. నూని
4. పచ్చిమిరపకాయలు  4
5. జీలకర్ర
6. కొత్తిమీర

తయారీ విధానము.
ముందుగా పెసర పప్పు  నీళ్ళలో నానబెట్టుకోవాలి .
గంట సేపు నానితే సరిపోతుంది .
తరువాత
ఉప్పు , పచ్చిమిరపకాయలు  వేసి
మెత్తగా రుబ్బుకోవాలి .
 తరువాత  జీలకర్ర కలుపుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి లో ఆయిల్ పోసుకుని , కాగాక
రుబ్బుకున్న ఈ పిండిని
చిన్న చిన్న పునుకులలాగా వేసుకోవాలి.
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
రుచికరమైన  పెసర పుణుకులు  రెడీ

టమాటో సాస్ తోకాని , కొత్తిమీర పచ్చడి తో గాని 
వేడివేడి గా తింటే బాగుంటాయి.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi